మత్తయి 1:1-25

  • యేసుక్రీస్తు వంశావళి  (1-17)

  • యేసు పుట్టుక  (18-25)

1  ఇది యేసుక్రీస్తు* వంశావళికి* సంబంధించిన పుస్తకం. ఆయన దావీదు కొడుకు. దావీదు అబ్రాహాము కొడుకు.   అబ్రాహాము ఇస్సాకును కన్నాడు;ఇస్సాకు యాకోబును కన్నాడు;యాకోబు యూదాను, అతని సోదరుల్ని కన్నాడు;   యూదా తామారు ద్వారా పెరెసును, జెరహును కన్నాడు;పెరెసు ఎస్రోనును కన్నాడు;ఎస్రోను అరామును కన్నాడు;   అరాము అమ్మీనాదాబును కన్నాడు;అమ్మీనాదాబు నయస్సోనును కన్నాడు;నయస్సోను శల్మానును కన్నాడు;   శల్మాను రాహాబు ద్వారా బోయజును కన్నాడు;బోయజు రూతు ద్వారా ఓబేదును కన్నాడు;ఓబేదు యెష్షయిని కన్నాడు;   యెష్షయి రాజైన దావీదును కన్నాడు.దావీదు ఊరియా భార్య ద్వారా సొలొమోనును కన్నాడు;   సొలొమోను రెహబామును కన్నాడు;రెహబాము అబీయాను కన్నాడు;అబీయా ఆసాను కన్నాడు;   ఆసా యెహోషాపాతును కన్నాడు;యెహోషాపాతు యెహోరామును కన్నాడు;యెహోరాము ఉజ్జియాను కన్నాడు;   ఉజ్జియా యోతామును కన్నాడు;యోతాము ఆహాజును కన్నాడు;ఆహాజు హిజ్కియాను కన్నాడు;  10  హిజ్కియా మనష్షేను కన్నాడు;మనష్షే ఆమోనును కన్నాడు;ఆమోను యోషీయాను కన్నాడు; 11  యూదులు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన కాలంలో యోషీయా యెకొన్యాను, అతని సోదరుల్ని కన్నాడు. 12  బబులోనుకు వెళ్లిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కన్నాడు;షయల్తీయేలు జెరుబ్బాబెలును కన్నాడు; 13  జెరుబ్బాబెలు అబీహూదును కన్నాడు;అబీహూదు ఎల్యాకీమును కన్నాడు;ఎల్యాకీము అజోరును కన్నాడు; 14  అజోరు సాదోకును కన్నాడు;సాదోకు ఆకీమును కన్నాడు;ఆకీము ఎలీహూదును కన్నాడు; 15  ఎలీహూదు ఎలియాజరును కన్నాడు;ఎలియాజరు మత్తానును కన్నాడు;మత్తాను యాకోబును కన్నాడు; 16  యాకోబు, మరియ భర్తయైన యోసేపును కన్నాడు; మరియకు యేసు పుట్టాడు. ఈ యేసే క్రీస్తు అయ్యాడు. 17  కాబట్టి, అబ్రాహాము నుండి దావీదు వరకు మొత్తం 14 తరాలు; దావీదు నుండి, యూదులు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన సమయం వరకు మొత్తం 14 తరాలు; బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన సమయం నుండి క్రీస్తు వరకు మొత్తం 14 తరాలు. 18  యేసుక్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లి మరియ పెళ్లి యోసేపుతో నిశ్చయమైంది; కానీ వాళ్ల పెళ్లి కాకముందే ఆమె పవిత్రశక్తి* ద్వారా గర్భవతి అయ్యింది. 19  అయితే ఆమె భర్త యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను అందరిముందు అవమానించడం ఇష్టంలేక ఆమెకు రహస్యంగా విడాకులు ఇవ్వాలనుకున్నాడు. 20  కానీ అతను ఈ విషయాల గురించి ఆలోచించి నిద్రపోయాక, ఇదిగో! యెహోవా* దూత అతనికి కలలో కనిపించి ఇలా అన్నాడు: “దావీదు కొడుకైన యోసేపూ, నీ భార్య మరియను ఇంటికి తీసుకురావడానికి భయపడకు; ఎందుకంటే ఆమె పవిత్రశక్తి ద్వారా గర్భవతి అయ్యింది. 21  ఆమె ఒక కొడుకును కంటుంది. నువ్వు ఆయనకు యేసు* అని పేరుపెట్టాలి, ఎందుకంటే ఆయన తన ప్రజల్ని పాపం నుండి రక్షిస్తాడు.” 22  నిజానికి, యెహోవా* తన ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరేందుకే అదంతా జరిగింది: 23  “ఇదిగో! ఒక కన్య గర్భవతియై కొడుకును కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.” ఆ పేరుకు, “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం. 24  అప్పుడు యోసేపు నిద్ర లేచి యెహోవా* దూత తనకు చెప్పినట్టే చేశాడు, అతను తన భార్యను ఇంటికి తెచ్చుకున్నాడు. 25  కానీ ఆమె కొడుకును కనేంతవరకు యోసేపు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకోలేదు. యోసేపు ఆయనకు యేసు అని పేరు పెట్టాడు.

అధస్సూచీలు

“క్రీస్తు” అనేది ఒక బిరుదు. ఆ మాటకు “అభిషిక్తుడు,” అంటే దేవుడు అభిషేకించిన రాజు అని అర్థం.
లేదా “చరిత్రకి.”
లేదా “చురుకైన శక్తి.”
ఈ అనువాదంలోని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, దేవుని పేరు అయిన “యెహోవా” 237 సార్లు కనిపిస్తుంది. వాటిలో ఇది మొదటిది. పదకోశం చూడండి.
హీబ్రూ భాషలో యేషూవ. ఆ పేరుకు, “యెహోవాయే రక్షణ” అని అర్థం.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.