ఆదికాండం 20:1-18

  • అబీమెలెకు నుండి శారా కాపాడబడడం (1-18)

20  అబ్రాహాము అక్కడి నుండి+ నెగెబుకు వెళ్లి కాదేషుకు,+ షూరుకు+ మధ్య డేరాలు వేసుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. అతను గెరారులో+ నివసిస్తున్నప్పుడు,*  అబ్రాహాము మళ్లీ తన భార్య శారా గురించి, “ఈమె నా చెల్లి” అని చెప్పాడు.+ కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు మనుషుల్ని పంపించి శారాను తన ఇంటికి తెప్పించుకున్నాడు.+  తర్వాత దేవుడు ఒక కలలో అబీమెలెకు దగ్గరికి వచ్చి అతనితో ఇలా అన్నాడు: “నువ్వు ఇంటికి తెచ్చుకున్న స్త్రీకి పెళ్లయింది, ఆమె ఇంకొకరి భార్య,+ కాబట్టి ఆమె కారణంగా నువ్వు చనిపోతావు.”+  అయితే అప్పటికింకా అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్లలేదు.* కాబట్టి అతను ఇలా అన్నాడు: “యెహోవా, నిర్దోషులైన* జనాన్ని నువ్వు చంపేస్తావా?  ‘ఈమె నా చెల్లి’ అని అతను, ‘ఇతను నా అన్న’ అని ఆమె చెప్పలేదా? ఆమెను తీసుకొచ్చినప్పుడు నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనా లేదు, నేను తప్పు చేస్తున్నాననే విషయం కూడా నాకు తెలీదు.”  తర్వాత సత్యదేవుడు కలలో అతనితో ఇలా అన్నాడు: “నువ్వు అలా చేసినప్పుడు నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనా లేదని నాకు తెలుసు, కాబట్టే నాకు వ్యతిరేకంగా పాపం చేయకుండా నిన్ను ఆపాను. అందుకే నిన్ను ఆమెను ముట్టనివ్వలేదు కూడా.  ఇప్పుడు అతని భార్యను అతనికి ఇచ్చేయి; అతను ఒక ప్రవక్త,+ అతను నీ కోసం వేడుకుంటాడు,+ అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉంటావు. కానీ నువ్వు ఆమెను తిరిగి ఇచ్చేయకపోతే నువ్వు, నీ వాళ్లంతా ఖచ్చితంగా చనిపోతారని తెలుసుకో.”  అబీమెలెకు తెల్లవారుజామునే లేచి, తన సేవకులందర్నీ పిలిచి ఈ విషయాలన్నీ వాళ్లకు చెప్పాడు. దాంతో వాళ్లు చాలా భయపడ్డారు.  తర్వాత అబీమెలెకు అబ్రాహామును పిలిపించి అతనితో ఇలా అన్నాడు: “నువ్వు మాకు చేసింది ఏంటి? నువ్వు నాకూ నా రాజ్యానికీ ఇంత పెద్ద పాపాన్ని అంటగట్టడానికి నేను నీ విషయంలో ఏం పాపం చేశాను? నువ్వు నాకు చేసింది సరైనది కాదు.” 10  తర్వాత అబీమెలెకు అబ్రాహామును, “నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా చేశావు?” అని అడిగాడు.+ 11  దానికి అబ్రాహాము ఇలా చెప్పాడు: “ఎందుకంటే, ‘ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని ప్రజలకు దైవభయం లేదు; నా భార్య కోసం వీళ్లు నన్ను చంపేస్తారు’ అని నాకు అనిపించింది.+ 12  అంతేకాదు, నిజంగానే ఈమె నాకు చెల్లి అవుతుంది. మా ఇద్దరికీ తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు; ఈమెను నేను పెళ్లి చేసుకున్నాను.+ 13  కాబట్టి, దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి ప్రయాణమై వెళ్లమన్నప్పుడు+ నేను ఆమెతో ఇలా అన్నాను: ‘మనం వెళ్లే ప్రతీచోట, నా గురించి “ఇతను నా అన్న” అని చెప్పు.+ అలా నువ్వు నా పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించిన దానివౌతావు.’ ” 14  తర్వాత అబీమెలెకు గొర్రెల్ని, పశువుల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను అబ్రాహాముకు ఇచ్చాడు; అతని భార్య శారాను కూడా అతనికి తిరిగి ఇచ్చేశాడు. 15  అంతేకాదు అబీమెలెకు ఇలా అన్నాడు: “ఇదిగో, నా దేశమంతా నీ ముందు ఉంది. నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు.” 16  అతను శారాతో ఇలా అన్నాడు: “ఇదిగో, నీ అన్నకు+ 1,000 వెండి రూకలు ఇస్తున్నాను. నీతో ఉన్నవాళ్లందరి కళ్లముందు, అలాగే ప్రతీ ఒక్కరి కళ్లముందు నువ్వు నిర్దోషివి అనడానికి ఇది గుర్తుగా ఉంది. నీ మీద ఇక ఏ నిందా ఉండదు.” 17  తర్వాత అబ్రాహాము సత్యదేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. దాంతో దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసురాళ్లను బాగుచేశాడు. అప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టడం మొదలైంది; 18  ఎందుకంటే, అప్పటిదాకా అబ్రాహాము భార్య శారా కారణంగా+ యెహోవా అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరికీ పిల్లలు పుట్టకుండా చేశాడు.*

అధస్సూచీలు

లేదా “పరదేశిగా నివసిస్తున్నప్పుడు.”
లేదా “నీతిమంతులైన.”
అంటే, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు.
లేదా “అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరి గర్భాల్ని పూర్తిగా మూసేశాడు.”