ఆమోసు 1:1-15

  • ఆమోసుకు యెహోవా నుండి సందేశం (1, 2)

  • పదేపదే చేసిన తిరుగుబాట్లను బట్టి తీర్పులు (3-15)

    • సిరియా (3-5), ఫిలిష్తియ (6-8), తూరు (9, 10), ఎదోము (11, 12), అమ్మోను (13-15)

1  తెకోవలోని+ గొర్రెల కాపరుల్లో ఒకడైన ఆమోసుకు* ఇశ్రాయేలు గురించి వచ్చిన దర్శనంలోని మాటలు. ఉజ్జియా రాజు+ యూదాను పరిపాలిస్తున్న కాలంలో, యోవాషు+ కుమారుడైన యరొబాము+ ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో, భూకంపం+ రావడానికి రెండు సంవత్సరాల ముందు అతనికి ఈ దర్శనం వచ్చింది.  అతను ఇలా చెప్పాడు: “యెహోవా సీయోనులో నుండి గర్జిస్తాడు,యెరూషలేములో నుండి తన స్వరం వినిపిస్తాడు. కాపరుల పచ్చిక మైదానాలు విలపిస్తాయి,కర్మెలు పర్వత శిఖరం ఎండిపోతుంది.”+   “యెహోవా ఇలా అంటున్నాడు:‘ “దమస్కు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును* బట్టి నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.ఎందుకంటే, వాళ్లు పంట నూర్చే ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు.+   కాబట్టి నేను హజాయేలు+ ఇంటి మీదికి అగ్నిని పంపిస్తాను,అది బెన్హదదు పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.+   నేను దమస్కు అడ్డ గడియలు విరగ్గొడతాను;+బికత్తావెను నివాసుల్ని నాశనం చేస్తాను,బెతేదేను నుండి పరిపాలిస్తున్న రాజును* నాశనం చేస్తాను;సిరియా ప్రజలు కీరుకు బందీలుగా తీసుకెళ్లబడతారు”+ అని యెహోవా చెప్తున్నాడు.’   యెహోవా ఇలా అంటున్నాడు:‘ “గాజా మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను. ఎందుకంటే, వాళ్లు బందీల గుంపంతటినీ+ ఎదోముకు అప్పగించారు.   కాబట్టి నేను గాజా ప్రాకారం మీదికి అగ్నిని పంపిస్తాను,+అది దాని పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.   నేను అష్డోదు నివాసుల్ని నాశనం చేస్తాను,+అష్కెలోను నుండి పరిపాలిస్తున్న రాజును* నాశనం చేస్తాను;+ఎక్రోనుకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను,+మిగిలిన ఫిలిష్తీయులు తుడిచిపెట్టుకుపోతారు”+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.’   యెహోవా ఇలా అంటున్నాడు:‘తూరు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.ఎందుకంటే, వాళ్లు బందీల గుంపంతటినీ ఎదోముకు అప్పగించారు,అంతేకాదు, వాళ్లు సహోదర ఒప్పందాన్ని* గుర్తుచేసుకోలేదు.+ 10  కాబట్టి నేను తూరు ప్రాకారం మీదికి అగ్నిని పంపిస్తాను,అది దాని పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.’+ 11  యెహోవా ఇలా అంటున్నాడు:‘ఎదోము మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను దాన్ని శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.ఎందుకంటే, అతను కత్తి పట్టుకుని సొంత తమ్ముణ్ణి వెంటాడాడు,+ఏమాత్రం కరుణ చూపించలేదు;కోపంతో అతను వాళ్లను క్రూరంగా చీల్చేస్తూ ఉన్నాడు,వాళ్ల మీద అతని కోపం చల్లారడం లేదు.+ 12  కాబట్టి నేను తేమాను మీదికి అగ్నిని పంపిస్తాను,+అది బొస్రా పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.’+ 13  యెహోవా ఇలా అంటున్నాడు:‘ “అమ్మోనీయులు మూడుసార్లు, నాలుగుసార్లు చేసిన తిరుగుబాటును బట్టి+ నేను వాళ్లను శిక్షిస్తాను, నా నిర్ణయం మార్చుకోను.ఎందుకంటే, వాళ్లు తమ సరిహద్దులు విశాలపర్చుకోవడానికి గిలాదులోని గర్భిణుల కడుపుల్ని చీల్చారు.+ 14  కాబట్టి నేను రబ్బా ప్రాకారానికి నిప్పు అంటిస్తాను;+అది, యుద్ధం జరిగే రోజున యుద్ధకేకతో,తుఫాను గాలి వీచే రోజున అల్లకల్లోలంతోదాని పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది. 15  వాళ్ల రాజు తన రాకుమారులతో పాటు బందీగా తీసుకెళ్లబడతాడు”+ అని యెహోవా చెప్తున్నాడు.’

అధస్సూచీలు

“బరువుగా ఉండడం” లేదా “బరువు మోయడం” అని అర్థం.
లేదా “నేరాన్ని.”
అక్ష., “రాజదండం పట్టుకొనివున్న వ్యక్తిని.”
అక్ష., “రాజదండం పట్టుకొనివున్న వ్యక్తిని.”
లేదా “నిబంధనను.”