ఆమోసు 3:1-15

  • దేవుని తీర్పును ప్రకటించడం (1-8)

    • దేవుడు తన రహస్యాన్ని తెలియజేస్తాడు (7)

  • సమరయకు వ్యతిరేకంగా సందేశం (9-15)

3  “ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మీ గురించి చెప్పిన మాట వినండి; ఐగుప్తు దేశం నుండి ఆయన బయటికి తీసుకొచ్చిన ఇశ్రాయేలు కుటుంబమంతటి గురించి ఆయన చెప్పిన ఈ మాట వినండి:   ‘భూమ్మీదున్న కుటుంబాలన్నిట్లో మీరు మాత్రమే నాకు తెలుసు,+ అందుకే, మీ తప్పులన్నిటి విషయంలో మిమ్మల్ని లెక్క అడుగుతాను.+   ముందే అనుకుని కలుసుకుంటే తప్ప, ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తారా?   జంతువు కనబడకుండానే అడవిలో సింహం గర్జిస్తుందా? ఏమీ పట్టుకోకుండానే గుహలో ఉన్న కొదమ సింహం గుర్రుమంటుందా?   నేలమీద ఉచ్చు* లేకుండానే పక్షి ఉచ్చులో చిక్కుకుంటుందా? ఏమీ చిక్కుకోకుండానే ఉచ్చు నేలమీద నుండి పైకి లేస్తుందా?   నగరంలో బూర* ఊదినప్పుడు, ప్రజలు భయంతో వణికిపోకుండా ఉంటారా? నగరంలో విపత్తు వచ్చిందంటే, అది యెహోవా రప్పించింది కాదా?   తన సేవకులైన ప్రవక్తలకు తన రహస్యాన్ని తెలియజేయకుండాసర్వోన్నత ప్రభువైన యెహోవా ఏమీ చేయడు.+   సింహం గర్జించింది!+ భయపడని వాళ్లెవరు? సర్వోన్నత ప్రభువైన యెహోవా మాట్లాడాడు! ప్రవచించని వాళ్లెవరు?’+   ‘అష్డోదు పటిష్ఠమైన బురుజుల మీద,ఐగుప్తు దేశపు పటిష్ఠమైన బురుజుల మీద దీన్ని చాటించండి: “సమరయ పర్వతాలకు వ్యతిరేకంగా సమకూడండి,+దాని మధ్య చెలరేగిన అల్లకల్లోలాన్ని,దానిలో జరుగుతున్న మోసాల్ని చూడండి.+ 10  సరైనది ఎలా చేయాలో వాళ్లకు తెలీదు” అని యెహోవా అంటున్నాడు,“వాళ్లు తమ పటిష్ఠమైన బురుజుల్లో హింసను, నాశనాన్ని పోగుచేసుకుంటున్నారు.” ’ 11  కాబట్టి, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:‘దేశాన్ని శత్రువు చుట్టుముడతాడు,+అతను నీ బలాన్ని లాగేసుకుంటాడు,నీ పటిష్ఠమైన బురుజుల్ని కొల్లగొడతాడు.’+ 12  యెహోవా ఇలా అంటున్నాడు:‘కాపరి, సింహం నోటి నుండి గొర్రె రెండు కాళ్లనో, చెవి ముక్కనో లాగేసినట్టు,ఇశ్రాయేలు ప్రజలు లాగేయబడతారు,ఇప్పుడు సమరయలో అందమైన మంచాల మీద, శ్రేష్ఠమైన* ఆసనాల* మీద కూర్చున్నవాళ్లు లాగేయబడతారు.’+ 13  ‘నేను చెప్పేది విని, యాకోబు ఇంటివాళ్లను హెచ్చరించు’* అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు దేవుడూ అయిన యెహోవా అంటున్నాడు. 14  ‘ఇశ్రాయేలు చేసిన తిరుగుబాట్లన్నిటిని* బట్టి నేను దాన్ని లెక్క అడిగే రోజున,+బేతేలులో ఉన్న బలిపీఠాల్ని కూడా లెక్క అడుగుతాను;+బలిపీఠపు కొమ్ములు నరికేయబడి, నేలమీద పడతాయి.+ 15  చలికాలపు ఇళ్లను, వేసవికాలపు ఇళ్లను నేను పడగొడతాను.’ ‘దంతపు ఇళ్లు నాశనమౌతాయి,+గొప్పగొప్ప* ఇళ్లు అంతమౌతాయి’+ అని యెహోవా అంటున్నాడు.”

అధస్సూచీలు

లేదా “ఎర” అయ్యుంటుంది.
అక్ష., “కొమ్ము.”
లేదా “దమస్కుకు చెందిన.”
లేదా “విశాలమైన కుర్చీల.”
లేదా “యాకోబు ఇంటివాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు.”
లేదా “నేరాలన్నిటిని.”
లేదా “చాలా” అయ్యుంటుంది.