ఆమోసు 4:1-13
4 “సమరయ పర్వతం మీద ఉన్న+బాషాను ఆవులారా,దీనుల్ని దగా చేస్తూ+ పేదవాళ్లను అణగదొక్కుతున్న స్త్రీలారా,‘తాగడానికి మా కోసం ఏమైనా తీసుకురండి!’ అని మీ భర్తలతో* చెప్తున్న స్త్రీలారా, ఈ మాట వినండి.
2 సర్వోన్నత ప్రభువైన యెహోవా తన పవిత్రత మీద ప్రమాణం చేస్తూ ఇలా అంటున్నాడు:‘ “ఇదిగో! కసాయివాడి కొక్కేలతో ఆయన మిమ్మల్ని పైకెత్తే రోజులు,మీలో మిగిలినవాళ్లను చేపలుపట్టే కొక్కేలతో పైకెత్తే రోజులు మీ మీదికి రాబోతున్నాయి.
3 మీలో ప్రతీ ఒక్కరు ప్రాకారాల పగుళ్ల గుండా తిన్నగా బయటికి వెళ్తారు;
మీరు హర్మోనులోకి విసిరేయబడతారు” అని యెహోవా చెప్తున్నాడు.’
4 ‘బేతేలుకు వచ్చి పాపం* చేయండి,+గిల్గాలుకు వచ్చి మరిన్ని పాపాలు చేయండి!+
ఉదయం మీ బలుల్ని,+మూడో రోజు మీ పదోవంతుల్ని*+ తీసుకురండి.
5 కృతజ్ఞతార్పణలుగా పులిసిన రొట్టెల్ని+ కాల్చండి;మీ స్వేచ్ఛార్పణల గురించి బిగ్గరగా చాటించండి!
ఇశ్రాయేలు ప్రజలారా, అలా చేయడమే కదా మీకు ఇష్టం’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
6 ‘నేనైతే, మీ నగరాలన్నిట్లో మీ పళ్లను శుభ్రంగా ఉంచాను,*మీ ఇళ్లన్నిట్లో రొట్టె లేకుండా చేశాను;+అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
7 ‘కోతకాలానికి మూడు నెలల ముందే వర్షం పడకుండా చేశాను;+ఒక నగరం మీద వర్షం కురిపించాను, ఇంకో నగరం మీద కురిపించలేదు.
పొలంలో కొంత భాగం మీద వర్షం కురిసింది,వర్షం కురవని భాగమేమో ఎండిపోయింది.
8 రెండు మూడు నగరాలకు చెందిన ప్రజలు ఆయాసంగా నడుస్తూ నీళ్లు తాగడానికి ఒకే నగరానికి వెళ్లారు,+కానీ వాళ్ల దాహం తీరలేదు;అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
9 ‘మంట పుట్టించే వేడితో, మొక్కల తెగులుతో* నేను మిమ్మల్ని మొత్తాను.+
మీరు మీ తోటల్ని, ద్రాక్షతోటల్ని విస్తరింపజేసుకున్నారు,అయితే మిడతలు వచ్చి మీ అంజూర చెట్లను, ఒలీవ చెట్లను మింగేశాయి;+అప్పటికీ మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
10 ‘ఐగుప్తు తెగులు లాంటి తెగులును నేను మీ మధ్యకు పంపించాను.+
ఖడ్గంతో మీ యువకుల్ని చంపేశాను,+ మీ గుర్రాల్ని తీసుకెళ్లిపోయాను.+
మీ డేరాల కంపు మీ ముక్కు రంధ్రాల్లోకి ఎక్కేలా చేశాను;+అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’ అని యెహోవా అంటున్నాడు.
11 ‘నేను సొదొమ గొమొర్రాల్ని పడద్రోసినట్టు+మిమ్మల్ని పడద్రోశాను.
మీరు మంటల్లో నుండి లాగేయబడిన కొయ్యలా అయ్యారు;అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు’+ అని యెహోవా అంటున్నాడు.
12 ఇశ్రాయేలూ, నేను నీకు అదే చేస్తాను.
నేను నీకు అలా చేస్తాను కాబట్టి,ఇశ్రాయేలూ, నీ దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడు.
13 ఇదిగో! పర్వతాల్ని రూపొందించింది,+ గాలిని సృష్టించింది ఆయనే;+ఆయన తన ఆలోచనల్ని మనుషులకు తెలియజేస్తాడు,ఆయన సూర్యోదయాన్ని చీకటిగా మారుస్తాడు,+ఆయన భూమ్మీది ఎత్తైన స్థలాలపై సంచరిస్తాడు;+ఆయన పేరు సైన్యాలకు దేవుడైన యెహోవా.”
అధస్సూచీలు
^ లేదా “యజమానులతో.”
^ లేదా “తిరుగుబాటు.”
^ లేదా “దశమభాగాల్ని.”
^ లేదా “తినడానికి మీకు ఆహారమేమీ ఇవ్వలేదు.”
^ అక్ష., “బూజుతో.”