ఎజ్రా 2:1-70
2 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే.+ వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టుకుపోయాడు,+ వాళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాలోని తమతమ నగరాలకు తిరిగొచ్చారు.+
2 వీళ్లు జెరుబ్బాబెలు,+ యేషూవ,*+ నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పారు, బిగ్వయి, రెహూము, బయనాతో పాటు వచ్చారు.
ఆ ఇశ్రాయేలు పురుషుల సంఖ్య ఇది:+
3 పరోషు వంశస్థులు 2,172 మంది;
4 షెఫట్య వంశస్థులు 372 మంది;
5 ఆరహు+ వంశస్థులు 775 మంది;
6 పహత్మోయాబు వంశంలో+ యేషూవ, యోవాబు వంశస్థులు 2,812 మంది;
7 ఏలాము వంశస్థులు+ 1,254 మంది;
8 జత్తూ వంశస్థులు+ 945 మంది;
9 జక్కయి వంశస్థులు 760 మంది;
10 బానీ వంశస్థులు 642 మంది;
11 బేబై వంశస్థులు 623 మంది;
12 అజ్గాదు వంశస్థులు 1,222 మంది;
13 అదొనీకాము వంశస్థులు 666 మంది;
14 బిగ్వయి వంశస్థులు 2,056 మంది;
15 ఆదీను వంశస్థులు 454 మంది;
16 హిజ్కియా కుటుంబానికి చెందిన అటేరు వంశస్థులు 98 మంది;
17 బెజయి వంశస్థులు 323 మంది;
18 యోరా వంశస్థులు 112 మంది;
19 హాషుము వంశస్థులు+ 223 మంది;
20 గిబ్బారు వంశస్థులు 95 మంది;
21 బేత్లెహేమువాళ్లు 123 మంది;
22 నెటోపావాళ్లు 56 మంది;
23 అనాతోతువాళ్లు+ 128 మంది;
24 అజ్మావెతువాళ్లు 42 మంది;
25 కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతు నగరాలవాళ్లు 743 మంది;
26 రామా,+ గెబా నగరాలవాళ్లు 621 మంది;
27 మిక్మషువాళ్లు 122 మంది;
28 బేతేలు, హాయి నగరాలవాళ్లు 223 మంది;
29 నెబోవాళ్లు+ 52 మంది;
30 మగ్బీషు వంశస్థులు 156 మంది;
31 ఇంకో ఏలాము వంశస్థులు 1,254 మంది;
32 హారీము వంశస్థులు 320 మంది;
33 లోదు, హాదీదు, ఓనో వంశస్థులు 725 మంది;
34 యెరికోవాళ్లు 345 మంది;
35 సెనాయా వంశస్థులు 3,630 మంది.
36 యాజకులు: యేషూవ+ కుటుంబానికి చెందిన యెదాయా+ వంశస్థులు 973 మంది;
37 ఇమ్మేరు వంశస్థులు+ 1,052 మంది;
38 పషూరు వంశస్థులు+ 1,247 మంది;
39 హారీము వంశస్థులు+ 1,017 మంది.
40 లేవీయులు:+ హోదవ్యా వంశంలో యేషూవ, కద్మీయేలు+ వంశస్థులు 74 మంది.
41 గాయకులు:+ ఆసాపు వంశస్థులు+ 128 మంది.
42 ద్వారపాలకులు:+ షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను+ వంశస్థులు, అక్కూబు+ వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయి వంశస్థులు; మొత్తం 139 మంది.
43 ఆలయ సేవకులు:*+ జీహా, హశూపా, టబ్బాయోతు వంశస్థులు,
44 కేరోసు, సీయహా, పాదోను వంశస్థులు,
45 లెబానా, హగాబా, అక్కూబు వంశస్థులు,
46 హాగాబు, షల్మయి, హానాను వంశస్థులు,
47 గిద్దేలు, గహరు, రెవాయా వంశస్థులు,
48 రెజీను, నెకోదా, గజ్జాము వంశస్థులు,
49 ఉజ్జా, పాసెయ, బేసాయి వంశస్థులు,
50 అస్నా, మెయోనీం, నెపూసీము వంశస్థులు,
51 బక్బూకు, హకూపా, హర్హూరు వంశస్థులు,
52 బజ్లుతు, మెహీదా, హర్షా వంశస్థులు,
53 బర్కోసు, సీసెరా, తెమహు వంశస్థులు,
54 నెజీయహు, హటీపా వంశస్థులు.
55 సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా వంశస్థులు,+
56 యహలా, దర్కోను, గిద్దేలు వంశస్థులు,
57 షెఫట్య, హట్టీలు, పొకెరెతు హజెబాయీము, ఆమీ వంశస్థులు.
58 ఆలయ సేవకులు,* సొలొమోను సేవకుల వంశస్థులు మొత్తం 392 మంది.
59 తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు నుండి వచ్చినవాళ్లు తాము ఏ పూర్వీకుల కుటుంబానికి చెందినవాళ్లో రుజువు చేసుకోలేకపోయారు; వాళ్లు ఇశ్రాయేలీయులని నిరూపించుకోలేకపోయారు. వాళ్లు ఎవరంటే:+
60 దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు; మొత్తం 652 మంది.
61 యాజకుల వంశస్థుల్లో: హబాయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు,+ బర్జిల్లయి వంశస్థులు. ఈ బర్జిల్లయి, గిలాదీయుడైన బర్జిల్లయి+ కూతుళ్లలో ఒకర్ని పెళ్లిచేసుకున్నాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది.
62 వీళ్లు తమ వంశావళిని నిర్ధారించుకోవడానికి తమ కుటుంబాల పేర్లను గ్రంథాల్లో వెతికారు, కానీ అవి కనిపించలేదు. దాంతో వాళ్లు యాజకత్వానికి అనర్హులయ్యారు.*+
63 ఊరీము, తుమ్మీము సహాయంతో సంప్రదించే+ ఒక యాజకుడు వచ్చేవరకు వాళ్లు అతి పవిత్రమైన వాటిని తినకూడదని+ అధిపతి* వాళ్లకు చెప్పాడు.
64 సమాజం మొత్తం 42,360 మంది.+
65 వాళ్లతోపాటు 7,337 మంది దాసులు, దాసురాళ్లు; 200 మంది గాయనీ గాయకులు కూడా ఉన్నారు.
66 వాళ్ల దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు,
67 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
68 వాళ్లు యెరూషలేములోని యెహోవా మందిరానికి చేరుకున్నప్పుడు, పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో కొంతమంది, సత్యదేవుని మందిరాన్ని దాని స్థలంలోనే+ తిరిగి కట్టడం* కోసం స్వేచ్ఛార్పణలు ఇచ్చారు.+
69 తమకు ఉన్నంతలో వాళ్లు నిర్మాణానికి సంబంధించిన ఖజానాకు 61,000 బంగారు డ్రక్మాలను,* 5,000 వెండి మినాలను,*+ యాజకుల కోసం 100 పొడవాటి అంగీలను ఇచ్చారు.
70 యాజకులు, లేవీయులు, కొంతమంది ప్రజలు, గాయకులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు* తమ నగరాల్లో స్థిరపడ్డారు. మిగతా ఇశ్రాయేలీయులందరూ తమతమ నగరాల్లో స్థిరపడ్డారు.+
అధస్సూచీలు
^ హగ్గయి 1:1; జెకర్యా 3:1లో ఉన్న “యెహోషువ” ఇతనే.
^ లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
^ లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
^ లేదా “అపవిత్రులు అవ్వడంవల్ల యాజకత్వం నుండి తొలగించబడ్డారు.”
^ లేదా “తిర్షాతా,” సంస్థాన అధిపతికి ఉపయోగించే ఒక పారసీక బిరుదు.
^ లేదా “నిలబెట్టడం.”
^ 8.4 గ్రాముల పారసీక బంగారు డారిక్‌తో సమానమని భావించబడుతోంది. ఇది గ్రీకు లేఖనాల్లో ఉన్న డ్రక్మా కాదు. అనుబంధం B14 చూడండి.
^ హీబ్రూ లేఖనాల్లో ఒక మినా 570 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”