ఎజ్రా 5:1-17
5 అప్పుడు ప్రవక్తలైన హగ్గయి,+ ఇద్దో+ మనవడైన జెకర్యా+ యూదులకు తోడుగా ఉన్న ఇశ్రాయేలు దేవుని పేరున యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ప్రవచించారు.
2 దాంతో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు,+ యెహోజాదాకు కుమారుడైన యేషూవ+ యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు.+ దేవుని ప్రవక్తలు వాళ్లతో ఉండి వాళ్లకు సహాయం చేశారు.+
3 ఆ సమయంలో నది అవతలి ప్రాంతానికి* అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, వాళ్ల సహోద్యోగులు వాళ్ల దగ్గరికి వచ్చి, “ఈ మందిరాన్ని కట్టమని, దీని నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు మీకు ఆజ్ఞ జారీ చేశారు?” అని అడిగారు.
4 ఆ తర్వాత వాళ్లు, “ఈ నిర్మాణ పని చేస్తున్న వాళ్ల పేర్లు ఏమిటి?” అని వాళ్లను అడిగారు.
5 కానీ దేవుని దృష్టి యూదుల పెద్దల మీద ఉంది,+ కాబట్టి దర్యావేషు దగ్గరికి ఒక నివేదిక పంపబడి, దానికి సంబంధించిన అధికార పత్రం వెనక్కి వచ్చేంతవరకు వాళ్లు ఆ పనిని ఆపుజేయించలేదు.
6 నది అవతలి ప్రాంతానికి అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, నది అవతలి ప్రాంతానికి కింది స్థాయి అధిపతులైన వాళ్ల సహోద్యోగులు దర్యావేషు రాజుకు పంపిన లేఖ నకలు ఇది;
7 వాళ్లు అతనికి పంపిన లేఖలో ఇలా రాశారు:
“దర్యావేషు రాజుకు:
“మీకు క్షేమం కలగాలి!
8 మేము యూదా సంస్థానంలోని మహాదేవుని మందిరం దగ్గరికి వెళ్లాం. అది పెద్దపెద్ద రాళ్లతో నిర్మించబడుతోంది. గోడల్లో దూలాల్ని అమరుస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్లు కష్టపడి పనిచేస్తూ పనిని ముందుకు తీసుకెళ్తున్నారని మీకు తెలియజేస్తున్నాం.
9 అప్పుడు మేము వాళ్ల పెద్దల్ని, ‘ఈ మందిరాన్ని కట్టమని, దీని నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు మీకు ఆజ్ఞ జారీ చేశారు?’ అని అడిగాం.+
10 మీకు తెలియజేయడానికి మేము వాళ్ల పేర్లను కూడా అడిగాం. నాయకత్వం వహించేవాళ్ల పేర్లను మీకు రాయడానికి అలా అడిగాం.
11 “దానికి వాళ్లు ఇలా జవాబిచ్చారు: ‘మేము భూమ్యాకాశాల దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం నిర్మించబడిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం. ఒక గొప్ప ఇశ్రాయేలు రాజు దాన్ని కట్టించి పూర్తిచేశాడు.+
12 అయితే, మా తండ్రులు పరలోక దేవునికి కోపం తెప్పించడం వల్ల+ ఆయన వాళ్లను బబులోను రాజూ కల్దీయుడూ అయిన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు.+ అతను ఈ మందిరాన్ని పడగొట్టి,+ ప్రజల్ని బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.+
13 అయితే, కోరెషు బబులోనుకు రాజైన మొదటి సంవత్సరంలో, దేవుని మందిరాన్ని తిరిగి కట్టమనే ఆజ్ఞను కోరెషు రాజు జారీ చేశాడు.+
14 అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవుని ఆలయంలో నుండి తీసుకెళ్లి, బబులోను గుడిలో పెట్టిన వెండిబంగారు పాత్రల్ని కోరెషు రాజు బబులోను గుడిలో నుండి బయటికి తెప్పించాడు.+ అవి కోరెషు అధిపతిగా నియమించిన షేష్బజ్జరు*+ అనే వ్యక్తికి ఇవ్వబడ్డాయి.
15 కోరెషు షేష్బజ్జరుకు ఇలా చెప్పాడు: “ఈ పాత్రలు తీసుకొని వెళ్లి యెరూషలేములోని ఆలయంలో పెట్టు. దేవుని మందిరం అది ఒకప్పుడు ఉన్న స్థలంలోనే తిరిగి కట్టబడాలి.”+
16 తర్వాత షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరానికి పునాదులు వేశాడు;+ అప్పటినుండి ఇప్పటివరకు అది నిర్మాణ దశలోనే ఉంది, ఇంకా పూర్తికాలేదు.’+
17 “రాజా, ఇప్పుడు మీ దృష్టికి సరైనదనిపిస్తే, కోరెషు రాజు యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టమని ఆజ్ఞ జారీ చేశాడో లేదో తెలుసుకోవడానికి అక్కడ బబులోనులోని రాజు ఖజానాలో తనిఖీ చేయించండి;+ తర్వాత ఈ విషయంపై మీ నిర్ణయాన్ని మాకు తిరిగి పంపండి.”
అధస్సూచీలు
^ ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.