ఎస్తేరు 10:1-3

  • మొర్దెకై గొప్పవాడవ్వడం (1-3)

10  అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమంతటా, అంటే దేశంలో అలాగే సముద్ర ద్వీపాల్లో ఉన్న ప్రజలతో వెట్టిచాకిరి చేయించాడు.  అతను చేసిన శక్తివంతమైన, గొప్పగొప్ప పనులు; అలాగే రాజు మొర్దెకైని+ ఉన్నత స్థానంలోకి తీసుకురావడానికి+ సంబంధించిన పూర్తి వివరాలు మాదీయ-పారసీక+ రాజుల చరిత్ర గ్రంథంలో+ నమోదయ్యాయి.  అహష్వేరోషు రాజు తర్వాత అత్యంత ప్రముఖ స్థానం యూదుడైన మొర్దెకైదే. అతను యూదుల మధ్య గొప్పవాడిగా ఎంచబడ్డాడు, తన సహోదరులైన యూదులందరూ అతన్ని గౌరవించేవాళ్లు. అతను తన ప్రజల మంచి కోసం పాటుపడుతూ, వాళ్ల వంశస్థుల శ్రేయస్సు కోసం కృషిచేశాడు.

అధస్సూచీలు