ఓబద్యా 1:1-21

  • పొగరుబోతు ఎదోము తగ్గించబడతాడు (1-9)

  • యాకోబు మీద ఎదోము దౌర్జన్యం (10-14)

  • అన్నిదేశాల మీదికి యెహోవా రోజు (15, 16)

  • యాకోబు ఇంటివాళ్లు పునరుద్ధరించబడతారు (17-21)

    • యాకోబు ఎదోమును దహించేస్తాడు (18)

    • రాజ్యాధికారం యెహోవాది అవుతుంది (21)

 ఓబద్యాకు* వచ్చిన దర్శనం. ఎదోము గురించి సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే:+ “మేము యెహోవా నుండి ఒక వార్త విన్నాం.‘లెండి, ఆమెతో యుద్ధం చేయడానికి సిద్ధమౌదాం’ అని చెప్పడానికి దేశాల మధ్యకు ఒక రాయబారి పంపబడ్డాడు.”+   “ఇదిగో! దేశాల మధ్య నిన్ను తక్కువవాడిగా చేశాను;నువ్వు పూర్తిగా తిరస్కరించబడ్డావు.+   నీ అహంకార హృదయం నిన్ను మోసం చేసింది,+బండ సందుల్లో నివసించేవాడా,ఎత్తులో ఉండేవాడా,‘నన్నెవరు కింద పడేస్తారు?’ అని నీ హృదయంలో అనుకుంటున్నావు.   నువ్వు గద్దలా ఎత్తులో నివాసం ఏర్పర్చుకున్నా,*నక్షత్రాల మధ్య గూడు కట్టుకున్నా,అక్కడి నుండి నేను నిన్ను కింద పడేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.   “దొంగలు గానీ, రాత్రివేళ దోచుకునేవాళ్లు గానీ నీ దగ్గరికి వస్తే,(నువ్వు ఎంత ఘోరంగా నాశనం చేయబడతావో!)* వాళ్లు తమకు కావాల్సినంత మాత్రమే దోచుకుంటారు కదా? ద్రాక్షలు సమకూర్చేవాళ్లు నీ దగ్గరికి వస్తే,కొంత పరిగె విడిచిపెడతారు కదా?+   ఏశావు పూర్తిగా సోదా చేయబడ్డాడు! అతను దాచుకున్న సంపదలన్నీ కొల్లగొట్టబడ్డాయి!   వాళ్లు నిన్ను సరిహద్దు వరకు తరిమారు. నీతో సంధి* చేసుకున్నవాళ్లంతా నిన్ను మోసం చేశారు. నీతో శాంతిగా ఉన్నవాళ్లు నీకు ఎదురుతిరిగారు. నీతో కలిసి భోజనం చేస్తున్నవాళ్లు నీ కింద వల పరుస్తారు,కానీ నువ్వు దాన్ని గ్రహించలేవు.”   యెహోవా ఇలా అంటున్నాడు:“ఆ రోజున ఎదోములోని తెలివిగలవాళ్లను,ఏశావు పర్వత ప్రాంతంలోని వివేచనాపరుల్ని నేను నాశనం చేయకుండా ఉంటానా?+   తేమానూ,+ నీ యోధులు భయంతో వణికిపోతారు,+ఎందుకంటే, ఏశావు పర్వత ప్రాంతంలోని ప్రతీ ఒక్కరు వధించబడతారు.+ 10  నీ తమ్ముడైన యాకోబును హింసించినందుకు,+నువ్వు అవమానాలపాలు అవుతావు,+శాశ్వతంగా నాశనమౌతావు.+ 11  పరాయివాళ్లు అతని సైన్యాన్ని చెరపట్టుకుపోయిన రోజున,+విదేశీయులు అతని ద్వారం లోపలికి ప్రవేశించి, యెరూషలేము మీద చీట్లు* వేసిన రోజున,+నువ్వు పక్కకు నిలబడి చూస్తూ ఉండిపోయావు, వాళ్లలో ఒకడిలా ప్రవర్తించావు. 12  నీ సహోదరుడికి కష్టం వచ్చిన రోజున అతన్ని చూసి సంతోషించావు,+యూదా ప్రజలు నాశనమౌతున్న రోజున వాళ్లను చూసి ఆనందించావు,+వాళ్లకు కష్టం ఎదురైన రోజున చాలా పొగరుగా మాట్లాడావు, అది తప్పు. 13  నా ప్రజల మీదికి విపత్తు వచ్చిన రోజున వాళ్ల ద్వారం లోపలికి ప్రవేశించావు,+అతనికి కష్టం వచ్చిన రోజున అతని ఆపదను చూసి సంతోషించావు,అతని మీదికి విపత్తు వచ్చిన రోజున అతని సంపదను ముట్టావు, నువ్వలా చేసి ఉండకూడదు.+ 14  పారిపోతున్న అతని మనుషుల్ని వధించడానికి అడ్డదారుల్లో నిలబడ్డావు,+ఆపద రోజున తప్పించుకున్న అతని మనుషుల్ని అప్పగించావు, అలా చేయడం తప్పు.+ 15  యెహోవా రోజు దగ్గర్లో ఉంది, అది అన్నిదేశాల మీదికి వస్తుంది.+ నువ్వు చేసినట్టే నీకు జరుగుతుంది.+ నువ్వు ఇతరులకు చేసింది నీ తల మీదికే వస్తుంది. 16  మీరు నా పవిత్ర పర్వతం మీద ఎలా తాగారో,అలాగే దేశాలన్నీ అదేపనిగా తాగుతూ ఉంటాయి.+ వాళ్లు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేస్తారు,వాళ్లు అసలెన్నడూ ఉనికిలో లేనట్టుగా అయిపోతారు. 17  కానీ తప్పించుకున్నవాళ్లు సీయోను పర్వతం మీద ఉంటారు,+అది పవిత్రంగా ఉంటుంది;+యాకోబు ఇంటివాళ్లు తమకు చెందిన వాటిని స్వాధీనం చేసుకుంటారు.+ 18  యాకోబు ఇంటివాళ్లు అగ్నిలా అవుతారు,యోసేపు ఇంటివాళ్లు మంటలా అవుతారు,ఏశావు ఇంటివాళ్లు కొయ్యకాలులా* అవుతారు;వాళ్లు వాళ్లను కాల్చి బూడిద చేస్తారు,ఏశావు ఇంటివాళ్లలో తప్పించుకునేవాళ్లు ఎవ్వరూ ఉండరు,+ఎందుకంటే, యెహోవాయే స్వయంగా చెప్పాడు. 19  వాళ్లు నెగెబును, ఏశావు పర్వత ప్రాంతాన్ని,షెఫేలాను, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.+ వాళ్లు ఎఫ్రాయిము భూముల్ని, సమరయ భూముల్ని స్వాధీనం చేసుకుంటారు,+బెన్యామీను గిలాదును స్వాధీనం చేసుకుంటాడు. 20  ఈ ప్రాకారం+ నుండి చెరగా తీసుకెళ్లబడినవాళ్లకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు సారెపతు+ వరకున్న కనానీయుల దేశం ఇవ్వబడుతుంది. యెరూషలేము నుండి చెరగా తీసుకెళ్లబడి సెఫారాదులో ఉంటున్న ప్రజలు నెగెబు నగరాల్ని స్వాధీనం చేసుకుంటారు.+ 21  ఏశావు పర్వత ప్రాంతానికి తీర్పుతీర్చడానికి+రక్షకులు సీయోను పర్వతం మీదికి వెళ్తారు,రాజ్యాధికారం యెహోవాది అవుతుంది.”+

అధస్సూచీలు

“యెహోవా సేవకుడు” అని అర్థం.
లేదా “ఎత్తులో ఎగిరినా” అయ్యుంటుంది.
లేదా “వాళ్లు ఎంత నాశనం చేస్తారు?” అయ్యుంటుంది.
లేదా “ఒప్పందం.”
పదకోశం చూడండి.
పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.