కీర్తనలు 1:1-6

  • రెండు భిన్నమైన మార్గాలు

    • దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం వల్ల సంతోషం (2)

    • నీతిమంతులు ఫలించే చెట్టులా ఉంటారు (3)

    • దుష్టులు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు (4)

1  దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా,పాపుల మార్గంలో నిలబడకుండా,ఎగతాళి చేసేవాళ్లతో కూర్చోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+   అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ,+పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు.*+   అతను నీటి కాలువల పక్కనే నాటబడి,దాని కాలంలో ఫలాలు ఇచ్చేపచ్చని* చెట్టులా ఉంటాడు. అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.+   కానీ దుష్టులు అలా ఉండరు;వాళ్లు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.   అందుకే తీర్పు తీర్చే సమయంలో దుష్టులు,నీతిమంతుల సమాజంలో పాపులు నిలబడలేరు.+   నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు,+ దుష్టుల మార్గం నాశనమౌతుంది.

అధస్సూచీలు

లేదా “చిన్న స్వరంతో చదువుతాడు; జాగ్రత్తగా చదువుతాడు.”
లేదా “ఆకులు వాడని.”