కీర్తనలు 112:1-10

  • నీతిమంతుడు యెహోవాకు భయపడతాడు

    • ఉదారంగా అప్పిచ్చే వ్యక్తి వర్ధిల్లుతాడు (5)

    • “నీతిమంతులు ఎప్పటికీ గుర్తుచేసుకోబడతారు” (6)

    • ఉదార స్వభావులు పేదవాళ్లకు ఇస్తారు (9)

112  యెహోవాను* స్తుతించండి!*+ א [ఆలెఫ్‌] యెహోవాకు భయపడే వ్యక్తి ధన్యుడు,*+ב [బేత్‌]ఆయన ఆజ్ఞల్ని బట్టి అతను ఎంతో సంతోషిస్తాడు.+ ג [గీమెల్‌]   అతని వంశస్థులు భూమ్మీద బలవంతులౌతారు,ד [దాలెత్‌]నిజాయితీపరుల తరం దీవించబడుతుంది.+ ה [హే]   అతని ఇంట్లో సిరిసంపదలు ఉంటాయి,ו [వావ్‌]అతని నీతి ఎప్పటికీ ఉంటుంది. ז [జాయిన్‌]   నిజాయితీపరులకు అతను చీకట్లో వెలుగులా ప్రకాశిస్తాడు.+ ח [హేత్‌] అతను కనికరం,* కరుణ,+ నీతి గలవాడు. ט [తేత్‌]   ఉదారంగా* అప్పిచ్చే వ్యక్తికి అంతా బావుంటుంది.+ י [యోద్‌] అతను తన పనుల్ని న్యాయంగా చేస్తాడు. כ [కఫ్‌]   అతను ఎప్పటికీ కదల్చబడడు.+ ל [లామెద్‌] నీతిమంతులు ఎప్పటికీ గుర్తుచేసుకోబడతారు.+ מ [మేమ్‌]   అతను చెడ్డవార్తకు భయపడడు.+ נ [నూన్‌] అతని హృదయం యెహోవాను నమ్ముకుని స్థిరంగా ఉంటుంది.+ ס [సామెఖ్‌]   అతని హృదయం స్థిరంగా ఉంటుంది;* అతను భయపడడు;+ע [అయిన్‌]చివరికి అతను తన శత్రువుల పతనాన్ని చూస్తాడు.+ פ [పే]   అతను విస్తారంగా* పంచిపెట్టాడు; పేదవాళ్లకు ఇచ్చాడు.+ צ [సాదె] అతని నీతి ఎప్పటికీ ఉంటుంది.+ ק [ఖొఫ్‌] అతని బలం* మహిమతో హెచ్చించబడుతుంది. ר [రేష్‌] 10  దుష్టులు అది చూసి నిరాశ చెందుతారు. ש [షీన్‌] తమ పళ్లు కొరుక్కుంటూ మాయమైపోతారు. ת [తౌ] దుష్టులు కోరుకునేవి జరగవు.+

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”
లేదా “సంతోషంగా ఉంటాడు.”
లేదా “దయ.”
లేదా “దయగా.”
లేదా “చెక్కుచెదరదు.”
లేదా “ఉదారంగా.”
అక్ష., “కొమ్ము.”