కీర్తనలు 115:1-18
115 మాకు కాదు యెహోవా, మాకు కాదు,*నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టినీ పేరుకే మహిమ కలగాలి.+
2 “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని
దేశాలు ఎందుకు అనాలి?+
3 మన దేవుడు పరలోకంలో ఉన్నాడు;ఆయన తనకు నచ్చిందంతా చేస్తాడు.
4 వాళ్ల విగ్రహాలు వెండిబంగారాలతో చేసినవి,అవి మనుషుల చేతిపనులు.+
5 వాటికి నోరు ఉంది, కానీ మాట్లాడలేవు;+కళ్లు ఉన్నాయి, కానీ చూడలేవు;
6 చెవులు ఉన్నాయి, కానీ వినలేవు;ముక్కు ఉంది, కానీ వాసన చూడలేవు;
7 చేతులు ఉన్నాయి, కానీ ముట్టుకోలేవు;పాదాలు ఉన్నాయి, కానీ నడవలేవు;+గొంతుతో శబ్దం చేయలేవు.+
8 వాటిని తయారుచేసేవాళ్లూ, వాటిని నమ్ముకునే వాళ్లందరూఅచ్చం వాటిలాగే తయారౌతారు.+
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో,+ఆయనే నీ సహాయకుడు, నీ డాలు.+
10 అహరోను ఇంటివాళ్లారా,+ యెహోవాను నమ్ముకోండి,ఆయనే మీ సహాయకుడు, మీ డాలు.
11 యెహోవాకు భయపడేవాళ్లారా, యెహోవాను నమ్ముకోండి,+ఆయనే మీ సహాయకుడు, మీ డాలు.+
12 యెహోవా మనల్ని గుర్తుచేసుకుంటాడు, మనల్ని దీవిస్తాడు;ఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్లను దీవిస్తాడు;+అహరోను ఇంటివాళ్లను దీవిస్తాడు;
13 సామాన్యులైనా, గొప్పవాళ్లయినాతనకు భయపడేవాళ్లను యెహోవా దీవిస్తాడు.
14 యెహోవా మిమ్మల్ని వృద్ధి చేస్తాడు,మిమ్మల్ని, మీ పిల్లల్ని* వృద్ధి చేస్తాడు.+
15 భూమ్యాకాశాల్ని తయారుచేసినయెహోవా+ మిమ్మల్ని దీవించాలి.+
16 ఆకాశం యెహోవాది,+అయితే భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.+
17 చనిపోయినవాళ్లు,మౌనస్థితిలోకి* దిగిపోయేవాళ్లు+ యెహోవాను* స్తుతించరు.+
18 మనం మాత్రం ఇప్పటినుండి సదాకాలంయెహోవాను* స్తుతిస్తాం.
యెహోవాను* స్తుతించండి!*
అధస్సూచీలు
^ లేదా “మాకేం చెందదు, యెహోవా, మాకేం చెందదు.”
^ అక్ష., “కుమారుల్ని.”
^ లేదా “సమాధిలోకి.”
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
^ లేదా “హల్లెలూయా!”