కీర్తనలు 129:1-8
-
దాడికి గురైనా ఓడిపోలేదు
-
సీయోనును ద్వేషించేవాళ్లు అవమానాలపాలు అవుతారు (5)
-
యాత్ర కీర్తన.
129 “చిన్నప్పటి నుండి వాళ్లు నా మీద దాడి చేస్తూ వచ్చారు,”+
అప్పుడు ఇశ్రాయేలు ఇలా అనాలి:
2 “చిన్నప్పటి నుండి వాళ్లు నా మీద దాడి చేస్తూ వచ్చారు,+కానీ వాళ్లు నా మీద గెలవలేదు.+
3 పొలాన్ని దున్నినట్టు వాళ్లు నా వీపును దున్నారు;+ఆ చాళ్లు పొడుగ్గా ఉన్నాయి.”
4 అయితే యెహోవా నీతిమంతుడు;+దుష్టుల తాళ్లను ఆయన తెంపేశాడు.+
5 సీయోనును ద్వేషించేవాళ్లంతాసిగ్గుపడి అవమానంతో వెనక్కి వెళ్లిపోతారు.+
6 వాళ్లు, ఇంటి పైకప్పు మీదుండే గడ్డిలా తయారౌతారు;దాన్ని పెరికివేయక ముందే అది వాడిపోతుంది,
7 కోసేవాడి గుప్పిలి గానీపనల్ని* కూర్చేవాడి ఒడి గానీ దానితో నిండదు.
8 దారిన పోయేవాళ్లు,
“యెహోవా దీవెన నీ మీద ఉండాలి;యెహోవా పేరున నిన్ను దీవిస్తున్నాం” అని అనరు.
అధస్సూచీలు
^ లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”