కీర్తనలు 137:1-9
137 మనం బబులోను నదుల పక్కన+ కూర్చుని ఉన్నప్పుడు,
సీయోనును గుర్తుచేసుకుంటూ ఏడ్చాం.+
2 దాని* మధ్య ఉన్న నిరవంజి చెట్లకుమన వీణలు* తగిలించాం.+
3 మనల్ని చెరపట్టినవాళ్లు అక్కడ మనల్ని ఒక పాట పాడమని అడిగారు,+మనల్ని ఎగతాళి చేసేవాళ్లు వినోదం కోరుకుంటూ,
“మాకోసం సీయోను పాటల్లో ఒక పాట పాడండి” అన్నారు.
4 పరాయి నేల మీదమనం యెహోవా పాటను ఎలా పాడగలం?
5 యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోతేనా కుడిచెయ్యి తన నైపుణ్యాన్ని మర్చిపోవాలి.*+
6 నేను నిన్ను గుర్తుచేసుకోకపోతే,నాకు అత్యంత సంతోషాన్నిచ్చే వాటన్నిటికన్నాయెరూషలేమును పైస్థానంలో ఉంచకపోతే,+నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.
7 యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజునఎదోమీయులు అన్న మాటల్ని గుర్తుచేసుకో.
వాళ్లు, “దాన్ని కూలగొట్టండి! పునాదుల వరకు దాన్ని కూలగొట్టండి!” అన్నారు.+
8 త్వరలోనే నాశనం కాబోతున్న బబులోను కుమారీ,+నువ్వు మాకు చేసినదాన్ని బట్టినీకు ప్రతీకారం చేసేవాళ్లు+ ధన్యులు.*
9 నీ పిల్లల్ని పట్టుకొనిబండకేసి కొట్టేవాళ్లు+ ధన్యులు.
అధస్సూచీలు
^ బబులోనును సూచిస్తుంది.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “ఎండిపోవాలి” అయ్యుంటుంది.
^ లేదా “సంతోషంగా ఉంటారు.”