కీర్తనలు 141:1-10
దావీదు శ్రావ్యగీతం.
141 యెహోవా, నీకు ప్రార్థిస్తున్నాను.+
త్వరగా వచ్చి నాకు సహాయం చేయి.+
నేను నీకు మొరపెట్టినప్పుడు శ్రద్ధగా ఆలకించు.+
2 నా ప్రార్థన, నీ ముందు బాగా సిద్ధం చేసిన ధూపంలా+ ఉండాలి;+నేను చేతులు ఎత్తడం, సాయంకాల ధాన్యార్పణలా ఉండాలి.+
3 యెహోవా, నా నోటికి కాపలా పెట్టు,నా పెదాల ద్వారం దగ్గర కాపలావాణ్ణి నియమించు.+
4 నా హృదయాన్ని చెడ్డవాటి వైపు మొగ్గుచూపనివ్వకు,+నన్ను చెడ్డవాళ్లతో పాటు నీచమైన పనుల్లో పాల్గొననివ్వకు;వాళ్ల రుచిగల ఆహారపదార్థాల్ని నేను ఎప్పటికీ ఆస్వాదించకూడదు.
5 నీతిమంతుడు నన్ను కొడితే, నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించినట్టే;+అతను నన్ను గద్దిస్తే, నా తలమీద సేదదీర్చే తైలం పోసినట్టే,+నా తల ఎప్పటికీ దాన్ని వద్దనదు.+
వాళ్లకు విపత్తులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉంటాను.
6 వాళ్ల న్యాయమూర్తులు కొండ అంచు నుండి కిందికి పడేయబడినా,ప్రజలు నా మాటల మీద శ్రద్ధ పెడతారు, ఎందుకంటే అవి ఆహ్లాదకరమైనవి.
7 ఒక వ్యక్తి నేలను దున్ని చీల్చినట్టు,మా ఎముకలు సమాధి* దగ్గర చెల్లాచెదురుగా పడివున్నాయి.
8 అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా, నా కళ్లు నీ వైపే చూస్తున్నాయి.+
నేను నిన్నే ఆశ్రయంగా చేసుకున్నాను.
నా ప్రాణం తీసేయకు.
9 వాళ్లు నా కోసం పెట్టిన ఉచ్చు నుండి,చెడ్డవాళ్ల ఉరుల్లో నుండి నన్ను కాపాడు.
10 దుష్టులంతా తమ వలల్లో తామే చిక్కుకుంటారు,+అయితే నేను సురక్షితంగా దాటివెళ్తాను.