కీర్తనలు 16:1-11
దావీదు మిక్తాము.*
16 దేవా, నన్ను కాపాడు, నిన్నే నేను ఆశ్రయించాను.+
2 నేను యెహోవాతో ఇలా అన్నాను: “యెహోవా, నా మంచితనానికి మూలం నువ్వే.
3 భూమ్మీది పవిత్రులు, ప్రముఖులునాకు ఎంతో సంతోషం కలిగిస్తారు.”+
4 వేరే దేవుళ్లను అనుసరించేవాళ్లు ఎన్నో బాధలు అనుభవిస్తారు.+
నేను ఎన్నడూ వాటికి రక్తార్పణలు అర్పించను,నా పెదాలు వాటి పేర్లను పలకవు.+
5 యెహోవా నా వంతు, నాకు వచ్చిన భాగం,+ నా గిన్నె.+
నువ్వు నా స్వాస్థ్యాన్ని కాపాడతావు.
6 ఆహ్లాదకరమైన స్థలాలు నాకు కొలిచి ఇవ్వబడ్డాయి.
అవును, నా స్వాస్థ్యంతో నేను సంతృప్తిగా ఉన్నాను.+
7 నాకు సలహా ఇచ్చిన యెహోవాను+ నేను స్తుతిస్తాను.
రాత్రివేళ కూడా నా అంతరంగం* నన్ను సరిదిద్దుతుంది.+
8 నేను ఎప్పుడూ యెహోవాను నా ముందు ఉంచుకుంటాను.+
ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను.*+
9 అందుకే నా హృదయం ఉల్లాసంగా ఉంది, నా ప్రాణం* ఎంతో సంతోషిస్తుంది.
నేను* సురక్షితంగా నివసిస్తున్నాను.
10 ఎందుకంటే నువ్వు నన్ను* సమాధిలో* విడిచిపెట్టవు.+
నీ విశ్వసనీయుణ్ణి గోతిని చూడనివ్వవు.*+
11 నువ్వు నాకు జీవ మార్గాన్ని తెలియజేస్తున్నావు.+
నీ సన్నిధిలో గొప్ప ఆనందం ఉంది;+నీ కుడిచేతి దగ్గర ఎప్పటికీ సంతోషం* ఉంటుంది.
అధస్సూచీలు
^ లేదా “లోతైన భావోద్వేగాలు.” అక్ష., “మూత్రపిండాలు.”
^ లేదా “తడబడను.”
^ అక్ష., “నా మహిమ.”
^ లేదా “నా శరీరం.”
^ లేదా “నా ప్రాణాన్ని.”
^ లేదా “కుళ్లిపోనివ్వవు” అయ్యుంటుంది.
^ లేదా “ఆహ్లాదం.”