కీర్తనలు 19:1-14

  • దేవుని సృష్టి, ధర్మశాస్త్రం సాక్ష్యమిస్తున్నాయి

    • “ఆకాశం దేవుని మహిమను చాటుతోంది” (1)

    • దేవుని పరిపూర్ణ ధర్మశాస్త్రం సేదదీర్పునిస్తుంది (7)

    • “తెలియక చేసిన పాపాలు” (12)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 19  ఆకాశం దేవుని మహిమను చాటుతోంది;+అంతరిక్షం* ఆయన చేతి పనిని ప్రకటిస్తోంది.+   ప్రతీ రోజు వాటి మాటలు పెల్లుబుకుతున్నాయి,ప్రతీ రాత్రి అవి జ్ఞానాన్ని వెల్లడి చేస్తున్నాయి.   వాటికి భాష లేదు, మాటలు లేవు;వాటి స్వరం వినిపించదు.   అయినా వాటి సాక్ష్యం* భూమంతటికి,వాటి సందేశం భూమి* నలుమూలలకు చేరుకుంది.+ ఆయన ఆకాశంలో సూర్యుని కోసం ఒక డేరా వేశాడు;   సూర్యుడు తన గదిలో నుండి బయటికి వస్తున్న పెళ్లికుమారుడిలా ఉన్నాడు;తన మార్గంలో పరుగెత్తడానికి సంతోషించే బలవంతుడిలా ఉన్నాడు.   సూర్యుడు ఆకాశంలో ఒకవైపు నుండి బయల్దేరి,చుట్టూ తిరిగి మరో వైపుకు వెళ్తాడు;+ఆ వేడికి మరుగైనది ఏదీ లేదు.   యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది,+ అది సేదదీర్పునిస్తుంది.*+ యెహోవా జ్ఞాపిక నమ్మదగినది,+ అది అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా చేస్తుంది.+   యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి;+యెహోవా ఆజ్ఞ స్వచ్ఛమైనది, అది కంటికి వెలుగునిస్తుంది.+   యెహోవా గురించిన భయం+ పవిత్రమైనది, అది ఎప్పటికీ నిలిచివుంటుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, అవి పూర్తిగా నీతిగలవి.+ 10  అవి బంగారం కన్నా,విస్తారమైన మేలిమి* బంగారం కన్నా కోరదగినవి,+తేనె కన్నా, జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి.+ 11  వాటి ద్వారా నీ సేవకుడు హెచ్చరిక పొందాడు;+వాటిని పాటించడం వల్ల గొప్ప ప్రతిఫలం కలుగుతుంది.+ 12  తమ తప్పుల్ని గుర్తించగలిగేవాళ్లు ఎవరు?+ నేను తెలియక చేసిన పాపాల విషయంలో నన్ను నిర్దోషిగా ప్రకటించు. 13  అహంకారంతో పనులు చేయకుండా నీ సేవకుణ్ణి ఆపు;+అవి నా మీద పైచేయి సాధించనివ్వకు. అప్పుడు నేను నిందలేకుండా ఉంటాను,+ఘోరమైన పాపాల* విషయంలో నిర్దోషిగా ఉంటాను. 14  యెహోవా, నా ఆశ్రయదుర్గమా,*+ నా విమోచకుడా,+నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు సంతోషం కలిగించేలా ఉండాలి.+

అధస్సూచీలు

లేదా “విశాలం; పైనున్న ఆకాశం.”
లేదా “కొలనూలు” అయ్యుంటుంది.
లేదా “పండే భూమి.”
లేదా “తిరిగి బలాన్నిస్తుంది; ప్రాణం తిరిగొచ్చేలా చేస్తుంది.”
లేదా “శుద్ధి చేయబడిన.”
లేదా “ఎన్నో అపరాధాల.”
అక్ష., “బండరాయీ.”