కీర్తనలు 23:1-6

  • “యెహోవా నా కాపరి”

    • “నాకు ఏ లోటూ ఉండదు” (1)

    • “ఆయన నా ప్రాణాన్ని సేదదీరుస్తాడు” (3)

    • “నా గిన్నె పొంగిపొర్లుతుంది” (5)

దావీదు శ్రావ్యగీతం. 23  యెహోవా నా కాపరి.+ నాకు ఏ లోటూ ఉండదు.+   పచ్చికబయళ్లలో ఆయన నన్ను పడుకోబెడతాడు;నీళ్లున్న విశ్రాంతి స్థలాలకు* నన్ను నడిపిస్తాడు.+   ఆయన నా ప్రాణాన్ని సేదదీరుస్తాడు.+ తన పేరు కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.   గాఢాంధకార లోయలో నడిచినా,+హాని కలుగుతుందని నేను భయపడను,+ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు;+నీ దుడ్డుకర్ర, నీ చేతికర్ర నాకు ధైర్యాన్నిస్తాయి.*   నువ్వు నా శత్రువుల ముందు నాకు భోజన బల్లను సిద్ధం చేస్తావు.+ నా తలకు నూనె రాస్తావు;*+నా గిన్నె పొంగిపొర్లుతుంది.+   నీ మంచితనం, విశ్వసనీయ ప్రేమ జీవితాంతం నాకు తోడుంటాయి,నా జీవితమంతా నేను యెహోవా మందిరంలో నివసిస్తాను.+

అధస్సూచీలు

లేదా “ప్రశాంతమైన నీళ్ల దగ్గరికి” అయ్యుంటుంది.
లేదా “ఊరటనిస్తాయి.”
లేదా “నా తలను నూనెతో సేదదీరుస్తావు.”