కీర్తనలు 25:1-22
దావీదు కీర్తన.
א [ఆలెఫ్]
25 యెహోవా, నేను నీ వైపే తిరుగుతున్నాను.
ב [బేత్]
2 నా దేవా, నిన్నే నమ్ముకున్నాను;+నన్ను సిగ్గుపడేలా చేయకు.+
నా శత్రువులు నా కష్టాల్ని చూసి సంతోషించనివ్వకు.+
ג [గీమెల్]
3 నీ మీద ఆశపెట్టుకునే వాళ్లెవ్వరూ అస్సలు అవమానాలపాలు కారు,+అయితే, కారణం లేకుండా ఇతరులకు ద్రోహం చేసేవాళ్లు అవమానించబడతారు.+
ד [దాలెత్]
4 యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజేయి;+నీ త్రోవలు నాకు బోధించు.+
ה [హే]
5 నన్ను నీ సత్యంలో నడిపించు, నాకు బోధించు;+ఎందుకంటే నువ్వే నా రక్షకుడివైన దేవుడివి.
ו [వావ్]
రోజంతా నేను నీ కోసం కనిపెట్టుకొనివున్నాను.
ז [జాయిన్]
6 యెహోవా, నీ కరుణను,నువ్వు ఎప్పుడూ చూపిస్తూ వచ్చిన* నీ విశ్వసనీయ ప్రేమను+ గుర్తుచేసుకో.+
ח [హేత్]
7 యౌవనంలో నేను చేసిన పాపాల్ని, నా అపరాధాల్ని గుర్తుచేసుకోకు.
యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమను బట్టి,+నీ మంచితనాన్ని బట్టి నన్ను గుర్తుచేసుకో.+
ט [తేత్]
8 యెహోవా మంచివాడు, నిజాయితీగలవాడు.+
అందుకే ఆయన, పాపులకు వాళ్లు నడవాల్సిన మార్గాన్ని ఉపదేశిస్తాడు.+
י [యోద్]
9 ఆయన సాత్వికుల్ని సరైన మార్గంలో* నడిపిస్తాడు,+వాళ్లకు తన మార్గాన్ని బోధిస్తాడు.+
כ [కఫ్]
10 యెహోవా ఒప్పందాన్ని,*+ ఆయన జ్ఞాపికల్ని+ పాటించేవాళ్లకుఆయన మార్గాలన్నీ విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని వెల్లడిచేస్తాయి.
ל [లామెద్]
11 యెహోవా, నేను చేసిన తప్పు పెద్దదే అయినానీ పేరు కోసం+ దాన్ని క్షమించు.
מ [మేమ్]
12 యెహోవాకు భయపడే వ్యక్తి ఎవరు?+
అతను ఎంచుకోవాల్సిన మార్గాన్ని ఆయన అతనికి ఉపదేశిస్తాడు.+
נ [నూన్]
13 అతని ప్రాణం దేవుని మంచితనాన్ని చవిచూస్తుంది,+అతని వంశస్థులు భూమిని స్వాధీనం చేసుకుంటారు.+
ס [సామెఖ్]
14 యెహోవాకు భయపడేవాళ్లు ఆయనతో దగ్గరి స్నేహాన్ని అనుభవిస్తారు,+తన ఒప్పందాన్ని ఆయన వాళ్లకు తెలియజేస్తాడు.+
ע [అయిన్]
15 నా కళ్లు ఎప్పుడూ యెహోవా వైపే చూస్తున్నాయి,+ఆయన నా పాదాల్ని వలలో నుండి విడిపిస్తాడు.+
פ [పే]
16 నీ ముఖం నావైపు తిప్పి, నామీద అనుగ్రహం చూపించు,ఎందుకంటే నేను ఒంటరిగా, నిస్సహాయుడిగా ఉన్నాను.
צ [సాదె]
17 నా హృదయ వేదనలు ఎక్కువయ్యాయి;+నా మనోవేదన నుండి నాకు విడుదల దయచేయి.
ר [రేష్]
18 నా బాధను, నా కష్టాన్ని చూడు,+నా పాపాలన్నీ క్షమించు.+
19 నా శత్రువులు ఎంత విస్తారంగా ఉన్నారో,వాళ్లు నన్ను ఎంత క్రూరంగా ద్వేషిస్తున్నారో చూడు.
ש [షీన్]
20 నా ప్రాణాన్ని కాపాడి, నన్ను రక్షించు.+
నేను నిన్ను ఆశ్రయించాను, నన్ను సిగ్గుపడేలా చేయకు.
ת [తౌ]
21 నా యథార్థత, నా నిజాయితీ నన్ను కాపాడాలి,+ఎందుకంటే నేను నీ మీద ఆశపెట్టుకున్నాను.+
22 దేవా, ఇశ్రాయేలును అతని కష్టాలన్నిటి నుండి కాపాడు.*
అధస్సూచీలు
^ లేదా “ప్రాచీనకాలం నుండి ఉన్న.”
^ అక్ష., “తీర్పులో.”
^ లేదా “నిబంధనను.”
^ అక్ష., “విడిపించు.”