కీర్తనలు 27:1-14
దావీదు కీర్తన.
27 యెహోవా నా వెలుగు,+ నా రక్షణ.
నేను ఎవరికైనా ఎందుకు భయపడాలి?+
యెహోవాయే నా ప్రాణ దుర్గం.+
నేను ఎవరికైనా ఎందుకు బెదరాలి?
2 నా శరీరాన్ని నాశనం చేయడానికి చెడ్డవాళ్లు నా మీద దాడిచేసినప్పుడు,+నా విరోధులూ శత్రువులే తొట్రిల్లి పడిపోయారు.
3 సైన్యం నన్ను చుట్టుముట్టినా,నా హృదయం భయపడదు.+
నా మీదికి యుద్ధమే వచ్చినా,నేను ధైర్యంగానే ఉంటాను.
4 నేను యెహోవాను ఒకటి అడిగాను,దాని కోసమే ఎదురుచూస్తాను, అదేమిటంటేయెహోవా మంచితనాన్ని* చూస్తూ ఉండేలాఆయన ఆలయాన్ని* సంతోషంతో* చూసేలా+నేను జీవించినంత కాలం యెహోవా మందిరంలో నివసించాలి.+
5 ఎందుకంటే, విపత్తు రోజున ఆయన నన్ను తన ఆశ్రయంలో దాస్తాడు;+తన గుడారంలోని రహస్య స్థలంలో నన్ను దాచిపెడతాడు;నన్ను ఎత్తైన బండ మీద ఉంచుతాడు.+
6 నన్ను చుట్టుముట్టిన నా శత్రువుల కన్నా నా తల ఎత్తుగా ఉంది;నేను ఆనందంగా కేకలు వేస్తూ ఆయన గుడారం దగ్గర బలులు అర్పిస్తాను;నేను యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడతాను.*
7 యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించు;+నా మీద అనుగ్రహం చూపించి నాకు జవాబివ్వు.+
8 “నా కోసం వెదకండి” అని నువ్వు ఆజ్ఞాపించావని
నా హృదయం చెప్పింది.
యెహోవా, నేను నీ కోసం వెదుకుతాను.+
9 నీ ముఖాన్ని నాకు దాచకు.+
కోపంతో నీ సేవకుణ్ణి పంపించేయకు.
నువ్వే నా సహాయకుడివి;+నా రక్షకుడివైన దేవా, నన్ను విడిచిపెట్టకు, వదిలేయకు.
10 నా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టినా,+యెహోవా నన్ను చేరదీస్తాడు.+
11 యెహోవా, నీ మార్గాన్ని నాకు ఉపదేశించు,+నా శత్రువుల్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు.
12 నా శత్రువులకు నన్ను అప్పగించకు,+ఎందుకంటే అబద్ధ సాక్షులు నాకు వ్యతిరేకంగా లేచారు,+వాళ్లు నాకు హాని చేయాలనుకుంటున్నారు.
13 సజీవుల దేశంలో యెహోవా మంచితనాన్ని చూస్తాననే నమ్మకం నాకు లేకపోతే,నేను ఎక్కడ ఉండేవాణ్ణి?*+
14 యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి;+ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి.+
అవును, యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి.
అధస్సూచీలు
^ లేదా “సౌందర్యాన్ని.”
^ లేదా “పవిత్రమైన స్థలాన్ని.”
^ లేదా “కృతజ్ఞతతో.”
^ లేదా “సంగీతం వాయిస్తాను.”
^ లేదా “నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది” అయ్యుంటుంది.