కీర్తనలు 41:1-13
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం.
41 దీనులకు సహాయం చేసే వ్యక్తి సంతోషంగా ఉంటాడు;+విపత్తు రోజున యెహోవా అతన్ని రక్షిస్తాడు.
2 యెహోవా అతన్ని సంరక్షించి సజీవంగా ఉంచుతాడు.
అతను భూమ్మీద సంతోషంగల వ్యక్తిగా ఎంచబడతాడు;+నువ్వు ఎన్నడూ అతని శత్రువుల ఇష్టానికి* అతన్ని అప్పగించవు.+
3 అతను అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు యెహోవా అతన్ని ఆదుకుంటాడు;+అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు అతని పడకను పూర్తిగా మార్చేస్తావు.
4 “యెహోవా, నా మీద అనుగ్రహం చూపించు.+
నన్ను బాగుచేయి,+ నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను”+ అని నేను అన్నాను.
5 కానీ నా శత్రువులు, “అతను ఎప్పుడు చస్తాడో,
అతని పేరు ఎప్పుడు తుడిచిపెట్టుకుపోతుందో” అంటూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు.
6 వాళ్లలో ఎవరైనా నన్ను చూడడానికి వస్తే, అతను* కపటంగా మాట్లాడతాడు.
నా గురించి చెడుగా మాట్లాడడానికి అతను సమాచారం సేకరిస్తాడు;తర్వాత బయటికి వెళ్లి, దాని గురించి అంతటా చెప్తాడు.
7 నన్ను ద్వేషించేవాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు;నాకు కీడు చేయాలని కుట్ర పన్నుతున్నారు:
8 “అతని మీదికి ఒక పెద్ద విపత్తు వచ్చింది;అతను పడిపోయాడు, మళ్లీ లేవడు” అని వాళ్లు అనుకుంటున్నారు.+
9 నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు,+నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు.*+
10 కానీ యెహోవా, నేను వాళ్లకు ప్రతీకారం చేసేలానా మీద అనుగ్రహం చూపించి, నన్ను పైకి లేపు.
11 నా శత్రువులు నా మీద గెలవలేకపోయినప్పుడు,
నువ్వు నన్ను చూసి సంతోషిస్తున్నావని నాకు తెలుస్తుంది.+
12 నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఆదుకుంటున్నావు;+నన్ను శాశ్వతంగా నీ సన్నిధిలో ఉంచుకుంటావు.+
13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాశాశ్వతకాలం* స్తుతించబడాలి.+
ఆమేన్. ఆమేన్.
అధస్సూచీలు
^ అక్ష., “అతని హృదయం.”
^ అక్ష., “నా మీదికి తన మడిమె ఎత్తాడు.”
^ లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”