కీర్తనలు 42:1-11

  • మహాగొప్ప రక్షకుడైన దేవుణ్ణి స్తుతించడం

    • జింక నీళ్ల కోసం ఆశపడినట్టు దేవుని కోసం ఆశపడడం (1, 2)

    • “నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?” (5, 11)

    • “దేవుని కోసం వేచివుంటాను” (5, 11)

సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల+ మాస్కిల్‌.* 42  జింక నీళ్ల కోసం ఆశపడినట్టు,దేవా, నా ప్రాణం నీ కోసం ఆశపడుతోంది.   దేవుని కోసం, జీవంగల దేవుని కోసం నేను దప్పికతో ఉన్నాను.+ నేనెప్పుడు నా దేవుని సన్నిధిలోకి వచ్చి కనబడతానో?+   రాత్రింబగళ్లు నా కన్నీళ్లే నాకు ఆహారంగా ఉన్నాయి;“నీ దేవుడు ఎక్కడ?” అంటూ ప్రజలు రోజంతా నన్ను దెప్పిపొడుస్తున్నారు.+   ఈ విషయాలు గుర్తుచేసుకుంటూ నేను నా హృదయాన్ని* కుమ్మరిస్తున్నాను,ఒకప్పుడు నేను జనసమూహంతో పాటు నడిచాను;సంతోష ధ్వనులతో, కృతజ్ఞతలతోజనసమూహం పండుగ చేసుకుంటుండగా,నేను వాళ్ల ముందు నెమ్మదిగా* నడుస్తూ దేవుని మందిరానికి వెళ్లేవాణ్ణి.+   నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది?+ నా లోపల ఎందుకు ఈ అలజడి? నేను దేవుని కోసం వేచివుంటాను,+ఇప్పటికీ ఆయన్ని నా మహాగొప్ప రక్షకునిగా స్తుతిస్తాను.+   నా దేవా, నేను కృంగిపోయాను.+ అందుకే యొర్దాను ప్రాంతం నుండి, హెర్మోను శిఖరాల నుండి,మిసారు కొండ* దగ్గర నుండినిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను.+   నీ జలపాతాల శబ్దం విని,కెరటాలు కెరటాల్ని పిలిచాయి. ఉప్పొంగే నీ అలలన్నీ నా మీదుగా పొంగిపొర్లాయి.   పగలు యెహోవా తన విశ్వసనీయ ప్రేమను నా దగ్గరికి పంపిస్తాడు,రాత్రివేళ ఆయన కీర్తన, అంటే నా జీవదాత అయిన దేవుని+ ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది.   నా శైలమైన* దేవునితో నేను, “నన్ను ఎందుకు మర్చిపోయావు?+ నా శత్రువు అణచివేయడం వల్ల నేను ఎందుకు బాధతో తిరగాలి?” అని అంటాను.+ 10  నా శత్రువులు క్రూరంగా* నన్ను దెప్పిపొడుస్తున్నారు;“నీ దేవుడు ఎక్కడ?” అంటూ రోజంతా నన్ను దెప్పిపొడుస్తున్నారు.+ 11  నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది? నా లోపల ఎందుకు ఈ అలజడి? నేను దేవుని కోసం వేచివుంటాను,+ఇప్పటికీ ఆయన్ని నా మహాగొప్ప రక్షకునిగా, నా దేవునిగా స్తుతిస్తాను.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “ప్రాణాన్ని.” పదకోశం చూడండి.
లేదా “గంభీరంగా.”
లేదా “చిన్న పర్వతం.”
లేదా “పెద్ద రాతిబండైన.”
లేదా “నా ఎముకల్ని నలగ్గొడుతున్నట్టుగా” అయ్యుంటుంది.