కీర్తనలు 52:1-9
సంగీత నిర్దేశకునికి సూచన. మాస్కిల్.* దావీదు కీర్తన. దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చాడని ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరికి వచ్చి చెప్పినప్పటిది.+
52 బలవంతుడా, నీ చెడ్డపనుల గురించి నువ్వెందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు?+
దేవుని విశ్వసనీయ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.+
2 మంగలికత్తి లాంటి పదునైన నీ నాలుక,+కీడు చేయాలని పన్నాగాలు పన్నుతూ, మోసకరంగా పనిచేస్తోంది.+
3 మంచి కన్నా చెడు అంటేనే నీకు ఇష్టం,నిజం చెప్పడం కన్నా అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. (సెలా)
4 మోసకరమైన నాలుకా!గాయపర్చే ప్రతీ మాటను నువ్వు ప్రేమిస్తావు.
5 అందుకే దేవుడు నిన్ను శాశ్వతంగా కూలగొడతాడు;+నిన్ను పట్టుకొని నీ గుడారంలో నుండి లాగేస్తాడు;+సజీవుల దేశం నుండి వేళ్లతోసహా నిన్ను పెకిలించేస్తాడు.+ (సెలా)
6 నీతిమంతులు దాన్ని చూసి, సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతారు,+అతన్ని చూసి నవ్వుతారు.+ వాళ్లిలా అంటారు:
7 “ఇదిగో! ఈ మనిషి దేవుణ్ణి ఆశ్రయంగా* చేసుకోకుండా,+తన గొప్ప సంపదల్ని నమ్ముకున్నాడు,+తన పన్నాగాల* మీద ఆధారపడ్డాడు.”*
8 కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉంటాను;దేవుని విశ్వసనీయ ప్రేమ మీదే ఎప్పటికీ నమ్మకం పెట్టుకుంటాను.+
9 నువ్వు చర్య తీసుకున్నావు కాబట్టి, నిన్ను ఎప్పటికీ స్తుతిస్తాను;+నీ విశ్వసనీయుల ముందునీ పేరుమీద ఆశపెట్టుకుంటాను,+ ఎందుకంటే అది మంచిది.