కీర్తనలు 59:1-17

  • దేవుడు ఒక డాలు, ఆశ్రయం

    • ‘ద్రోహం చేసేవాళ్ల మీద కరుణ చూపించకు’ (5)

    • “నీ శక్తి గురించి పాడతాను” (16)

సంగీత నిర్దేశకునికి సూచన; “నాశనం చేయకు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. మిక్తాము.* దావీదును చంపడం కోసం అతని ఇంటిని గమనిస్తూ ఉండమని సౌలు మనుషుల్ని పంపినప్పటిది.+ 59  నా దేవా, నా శత్రువుల నుండి నన్ను కాపాడు;+నా మీదికి లేస్తున్న వాళ్ల నుండి నన్ను రక్షించు.+   చెడ్డపనులు చేసేవాళ్ల నుండి నన్ను కాపాడు,దౌర్జన్యం చేసే* వాళ్ల నుండి నన్ను రక్షించు.   ఇదిగో! వాళ్లు నా కోసం పొంచి ఉన్నారు;+యెహోవా, నేను తిరుగుబాటు గానీ పాపం గానీ చేయకపోయినా+బలవంతులు నా మీద దాడి చేస్తున్నారు.   నేను ఏ తప్పూ చేయకపోయినా, వాళ్లు పరుగెత్తుతూ నా మీద దాడి చేయడానికి సిద్ధమౌతున్నారు. నేను మొరపెట్టినప్పుడు లేచి చూడు.   సైన్యాలకు దేవుడివైన యెహోవా, నువ్వు ఇశ్రాయేలు దేవుడివి.+ దేశాలన్నిటినీ పరిశీలించడానికి మేలుకో. ద్రోహం చేసే దుష్టులెవ్వరి మీద కరుణ చూపించకు.+ (సెలా)   ప్రతీ సాయంత్రం వాళ్లు తిరిగొస్తారు;+కుక్కల్లా+ మొరుగుతూ,* నగరమంతా తిరుగుతారు.+   వాళ్ల నోరు చెడ్డమాటలు వెళ్లగక్కుతుంది;వాళ్ల పెదాలు కత్తుల్లాంటివి,+“వినేవాళ్లు ఎవరు?” అని వాళ్లు అంటారు.+   కానీ యెహోవా, నువ్వు వాళ్లను చూసి నవ్వుతావు;+దేశాలన్నిటినీ ఎగతాళి చేస్తావు.+   నా బలమా, నేను నీ కోసం కనిపెట్టుకొని ఉంటాను;+దేవుడే నా సురక్షితమైన ఆశ్రయం.*+ 10  నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవుడే నన్ను ఆదుకుంటాడు;+నా శత్రువుల పతనాన్ని ఆయన నాకు చూపిస్తాడు.+ 11  వాళ్లను చంపకు, అలాచేస్తే నా ప్రజలు మర్చిపోతారు,నీ శక్తితో వాళ్లను చెల్లాచెదురు చేయి; మా డాలువైన యెహోవా,+ వాళ్లను పడగొట్టు. 12  తమ నోటి పాపం వల్ల, తమ పెదాల మాటలవల్ల,శపించడం వల్ల, అబద్ధాలాడడం వల్లవాళ్లు తమ గర్వంలో చిక్కుకుపోవాలి.+ 13  నీ కోపంతో వాళ్లను నాశనం చేయి;+వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేయి;దేవుడు యాకోబు మీద, అలాగే భూమంతటా పరిపాలిస్తున్నాడని వాళ్లు తెలుసుకునేలా చేయి.+ (సెలా) 14  సాయంత్రం వాళ్లను తిరిగిరానివ్వు;కుక్కల్లా మొరుగుతూ,* నగరమంతా తిరగనివ్వు.+ 15  ఆహారం కోసం వాళ్లను అటూఇటూ తిరగనివ్వు;+వాళ్లను తృప్తి పొందనివ్వకు, వాళ్లకు విశ్రాంతి స్థలం దొరకనివ్వకు. 16  నేనైతే నీ శక్తి గురించి పాడతాను;+ఉదయాన్నే నీ విశ్వసనీయ ప్రేమ గురించి సంతోషంగా చెప్తాను. నా సురక్షితమైన ఆశ్రయం,+కష్టకాలంలో నేను పారిపోయే స్థలం నువ్వే.+ 17  నా బలమా, నిన్ను స్తుతిస్తూ నేను పాటలు పాడతాను,*+ఎందుకంటే నామీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవుడే నా సురక్షితమైన ఆశ్రయం.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “రక్తదాహం గల.”
లేదా “గుర్రుమంటూ.”
లేదా “ఎత్తైన స్థలం.”
లేదా “గుర్రుమంటూ.”
లేదా “సంగీతం వాయిస్తాను.”