కీర్తనలు 6:1-10

  • అనుగ్రహం కోసం విన్నపం

    • చనిపోయినవాళ్లు దేవుణ్ణి స్తుతించరు (5)

    • అనుగ్రహం కోసం చేసే విన్నపాల్ని దేవుడు వింటాడు (9)

సంగీత నిర్దేశకునికి సూచన; షెమినీతు* స్వరంలో తంతివాద్యాలతో పాడాలి. దావీదు శ్రావ్యగీతం. 6  యెహోవా, నీ కోపంతో నన్ను గద్దించకు,నీ ఆగ్రహంతో నన్ను సరిదిద్దకు.+   యెహోవా, నేను కృశించిపోతున్నాను, నా మీద అనుగ్రహం* చూపించు.యెహోవా, నా ఎముకలు వణుకుతున్నాయి, నన్ను బాగుచేయి.+   నిజంగా, నా ప్రాణం ఎంతో కలవరపడుతోంది,+యెహోవా, నా బాధలు ఇంకెన్నాళ్లు ఉంటాయని+ నిన్ను అడుగుతున్నాను.   యెహోవా, వచ్చి నా ప్రాణాన్ని కాపాడు;+నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను రక్షించు.+   చనిపోయినవాళ్లు నీ గురించి మాట్లాడరు;*సమాధిలో* ఎవరు నిన్ను స్తుతిస్తారు?+   నా మూల్గులతో నేను నీరసించిపోయాను;+రాత్రంతా నా పరుపు కన్నీళ్లతో తడిచిపోతోంది;నా మంచం కన్నీళ్లలో మునిగిపోతోంది.+   దుఃఖంతో నా కళ్లు బలహీనమయ్యాయి;నన్ను వేధించేవాళ్లందరి వల్ల నా చూపు మందగించింది.   దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్లారా, నా దగ్గర నుండి వెళ్లిపోండి,యెహోవా నా రోదనను వింటాడు.+   అనుగ్రహం కోసం నేను చేసే విన్నపాన్ని యెహోవా వింటాడు;+నా ప్రార్థనకు యెహోవా జవాబిస్తాడు. 10  నా శత్రువులంతా అవమానించబడతారు, కలవరపడతారు;వాళ్లు హఠాత్తుగా సిగ్గుతో వెనక్కి తిరిగి పారిపోతారు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “కరుణ.”
లేదా “నిన్ను జ్ఞాపకం చేసుకోరు.”
లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.