కీర్తనలు 60:1-12

  • దేవుడు శత్రువుల్ని ఓడిస్తాడు

    • రక్షణ కోసం మనుషుల మీద ఆశ పెట్టుకోవడం వృథా (11)

    • “దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం” (12)

సంగీత నిర్దేశకునికి సూచన; “జ్ఞాపకార్థ లిల్లీ పువ్వు” అనే రాగంలో పాడాలి. మిక్తాము.* దావీదు కీర్తన. బోధించడం కోసం. దావీదు అరామ్నహరాయిము, అరమోజబా సైన్యాలతో పోరాడినప్పుడు, యోవాబు తిరిగొచ్చి ఉప్పులోయలో 12,000 మంది ఎదోమీయుల్ని చంపినప్పటిది.+ 60  దేవా, నువ్వు మమ్మల్ని తిరస్కరించావు; మమ్మల్ని చెదరగొట్టావు.+ మామీద కోపగించుకున్నావు; ఇప్పుడు మళ్లీ మమ్మల్ని అంగీకరించు!   నువ్వు భూమిని కంపింపజేశావు; దాన్ని బద్దలు చేశావు. అది పడిపోయేలా ఉంది, దాని పగుళ్లను బాగుచేయి.   నువ్వు నీ ప్రజల్ని కష్టాలపాలు చేశావు. తూలేలా చేసే ద్రాక్షారసాన్ని మాతో తాగించావు.+   నీకు భయపడేవాళ్లు పారిపోయి బాణాన్ని తప్పించుకునేలాఒక సంకేతం ఇవ్వు.* (సెలా)   నువ్వు ప్రేమించేవాళ్లు రక్షించబడేలా,నీ కుడిచేతితో మమ్మల్ని కాపాడి, మాకు జవాబివ్వు.+   దేవుడు తన పవిత్రతను బట్టి* ఇలా అన్నాడు: “నేను ఉల్లసించి షెకెమును ఆస్తిగా ఇస్తాను,+సుక్కోతు లోయను కొలిచి ఇస్తాను.+   గిలాదు నాదే, మనష్షే నాదే,ఎఫ్రాయిము నా శిరస్త్రాణం;*యూదా నా అధికార దండం.+   మోయాబు నేను కాళ్లు కడుక్కునే పాత్ర.+ ఎదోము మీదికి నా చెప్పు విసిరేస్తాను.+ ఫిలిష్తియను జయించి విజయోత్సాహంతో కేకలు వేస్తాను.”+   ముట్టడి వేయబడిన* నగరానికి నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఎదోము వరకు నన్ను ఎవరు నడిపిస్తారు?+ 10  దేవా, నువ్వే మమ్మల్ని నడిపిస్తావు;కానీ నువ్వు మమ్మల్ని తిరస్కరించావు, ఇప్పుడు నువ్వు మా సైన్యాలతో పాటు బయల్దేరడం లేదు.+ 11  కష్టాల్లో మాకు సహాయం చేయి,రక్షణ కోసం మనుషుల మీద ఆశపెట్టుకోవడం వృథా.+ 12  దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం,ఆయన మా శత్రువుల్ని అణగదొక్కుతాడు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “ఇచ్చావు” అయ్యుంటుంది.
లేదా “తన పవిత్ర స్థలంలో” అయ్యుంటుంది.
అక్ష., “దుర్గం.”
లేదా “ప్రాకారంగల” అయ్యుంటుంది.