కీర్తనలు 72:1-20

  • దేవుని రాజు శాంతియుత పరిపాలన

    • “నీతిమంతులు వర్ధిల్లుతారు” (7)

    • సముద్రం నుండి సముద్రం వరకు ప్రజలు (8)

    • దౌర్జన్యం నుండి రక్షిస్తాడు (14)

    • భూమ్మీద సస్యసమృద్ధి (16)

    • దేవుని పేరు ఎప్పటికీ స్తుతించబడాలి (19)

సొలొమోను గురించి. 72  దేవా, రాజుకు నీ న్యాయనిర్ణయాల్ని,రాకుమారుడికి నీ నీతిని ఉపదేశించు.+   ఆయన నీతితో నీ ప్రజల తరఫున,న్యాయంతో దీనుల తరఫున వాదించాలి.+   ప్రజల కోసం పర్వతాలు శాంతిని,కొండలు నీతిని తీసుకురావాలి.   ప్రజల్లో దీనులకు ఆయన న్యాయం చేయాలి,పేదవాళ్ల పిల్లల్ని కాపాడాలి, మోసం చేసేవాణ్ణి అణచివేయాలి.+   సూర్యుడు ఉన్నంతకాలం,చంద్రుడు నిలిచి ఉన్నంతకాలం,తరతరాలూ+ వాళ్లు నీకు భయపడతారు.   ఆయన, గడ్డి కోసిన మైదానం మీద పడే వర్షంలా,భూమిని తడిపే వాన జల్లుల్లా ఉంటాడు.+   ఆయన రోజుల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు,*+చంద్రుడు లేకుండా పోయేవరకు శాంతి విస్తరిస్తుంది.+   సముద్రం నుండి సముద్రం వరకు,నది* నుండి భూమి అంచుల వరకు ఆయన పరిపాలిస్తాడు.+   ఎడారి నివాసులు ఆయనకు వంగి నమస్కారం చేస్తారు,ఆయన శత్రువులు మట్టి నాకుతారు.+ 10  తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం కడతారు.+ షేబ రాజులు, సెబా రాజులు కానుకలు సమర్పిస్తారు.+ 11  రాజులందరూ ఆయనకు వంగి నమస్కారం చేస్తారు,అన్ని దేశాలవాళ్లు ఆయన్ని సేవిస్తారు. 12  సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను,దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. 13  దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు,పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. 14  అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు,*వాళ్ల రక్తం ఆయన దృష్టికి చాలా విలువైనదిగా ఉంటుంది. 15  ఆయన చాలాకాలం జీవించాలి, షేబ బంగారం ఆయనకు ఇవ్వబడాలి.+ ఆయన కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థనలు చేయాలి,రోజంతా ఆయన్ని దీవించాలి. 16  భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది;+పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగిపొర్లుతుంది. ఆయన పొలాలు లెబానోను చెట్లలా వర్ధిల్లుతాయి,+నగరాల్లో ప్రజలు భూమ్మీది మొక్కల్లా వికసిస్తారు.+ 17  ఆయన పేరు ఎప్పటికీ నిలిచివుండాలి,+సూర్యుడు ఉన్నంతకాలం ఆయన పేరుప్రతిష్ఠలు వర్ధిల్లాలి. ప్రజలు ఆయన ద్వారా దీవెనలు సంపాదించుకోవాలి;+అన్ని దేశాలవాళ్లు ఆయన్ని ధన్యుడు* అనాలి. 18  ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి,+ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేస్తాడు.+ 19  మహిమగల ఆయన పేరు ఎప్పటికీ స్తుతించబడాలి,+భూమంతా ఆయన మహిమతో నిండిపోవాలి.+ ఆమేన్‌, ఆమేన్‌. 20  ఇక్కడితో యెష్షయి కుమారుడైన దావీదు+ ప్రార్థనలు ముగిశాయి.

అధస్సూచీలు

అక్ష., “చిగురిస్తారు.”
అంటే, యూఫ్రటీసు.
అక్ష., “విడిపిస్తాడు.”
లేదా “సంతోషంగా ఉంటాడు.”