కీర్తనలు 74:1-23

  • తన ప్రజల్ని గుర్తుచేసుకోమని దేవునికి ప్రార్థన

    • దేవుని రక్షణ కార్యాలు గుర్తుచేసుకోవడం (12-17)

    • “శత్రువుల దూషణల్ని గుర్తుచేసుకో” (18)

మాస్కిల్‌.* ఆసాపు+ కీర్తన. 74  దేవా, మమ్మల్ని ఎందుకు శాశ్వతంగా విడిచిపెట్టేశావు?+ నువ్వు మేపే మంద మీద నీ కోపం ఎందుకు రగులుకుంది?*+   చాలాకాలం క్రితం నువ్వు సంపాదించుకున్న ప్రజల్ని*+ గుర్తుచేసుకో,నీ స్వాస్థ్యంగా నువ్వు విడిపించిన గోత్రాన్ని+ గుర్తుచేసుకో. నువ్వు నివసించిన సీయోను పర్వతాన్ని+ గుర్తుచేసుకో.   దీర్ఘకాల శిథిలాల వైపు అడుగులు వేయి.+ పవిత్ర స్థలంలోని ప్రతీదాన్ని శత్రువులు నాశనం చేశారు.+   నీ ఆలయం* లోపల నీ శత్రువులు గర్జించారు.+ అక్కడ వాళ్లు తమ ధ్వజాలు నిలబెట్టారు.   వాళ్లు దట్టమైన అడవి మీదికి గొడ్డలి ఎత్తే మనుషుల్లా ఉన్నారు.   వాళ్లు గొడ్డళ్లతో, ఇనుప కడ్డీలతో ఆలయ చెక్కడాలన్నిటినీ+ పగలగొట్టారు.   వాళ్లు నీ పవిత్రమైన స్థలానికి నిప్పంటించారు.+ నీ పేరు పెట్టబడిన గుడారాన్ని కూల్చేసి, దాన్ని అపవిత్రపర్చారు.   “దేశంలోని దేవుని సమావేశ స్థలాలన్నిటినీ* తగలబెట్టాలి” అని వాళ్లు, వాళ్ల పిల్లలు తమ హృదయాల్లో అనుకున్నారు.   మా కోసం అక్కడ ఒక్క సూచన కూడా కనిపించట్లేదు;ఒక్క ప్రవక్త కూడా మిగల్లేదు,ఇలా ఎంతకాలం ఉంటుందో మాలో ఎవరికీ తెలీదు. 10  దేవా, ఎంతకాలం విరోధులు నిన్ను దూషిస్తూ ఉంటారు?+ శత్రువులు నీ పేరును ఎప్పటికీ అవమానిస్తూనే ఉంటారా?+ 11  నీ చేతిని, నీ కుడిచేతిని ఎందుకు వెనక్కి తీసుకున్నావు?+ నీ వస్త్రం మడతల్లో నుండి దాన్ని బయటికి తీసి, వాళ్లను అంతం చేయి. 12  చాలాకాలం నుండి దేవుడే నా రాజు,భూమ్మీద రక్షణ కార్యాలు చేసేది ఆయనే.+ 13  నువ్వు నీ బలంతో సముద్రంలో అలజడి రేపావు;+నీళ్లలోని భారీ సముద్రప్రాణుల తలలు చితగ్గొట్టావు. 14  నువ్వు లివ్యాతన్‌* తలను* చితగ్గొట్టావు;ఎడారుల్లో నివసించే ప్రజలకు దాన్ని ఆహారంగా ఇచ్చావు. 15  నువ్వు ఊటల్ని, వాగుల్ని తెరిచావు;+జీవనదుల్ని ఎండిపోజేశావు.+ 16  పగలు నీదే, రాత్రి నీదే. వెలుగును, సూర్యుణ్ణి నువ్వే చేశావు.+ 17  నువ్వే భూమి సరిహద్దులన్నిటినీ నియమించావు;+వేసవికాలాన్ని, చలికాలాన్ని నువ్వే చేశావు.+ 18  యెహోవా, శత్రువుల దూషణల్ని గుర్తుచేసుకో,మూర్ఖులైన ప్రజలు నీ పేరును ఎలా అవమానిస్తున్నారో గుర్తుచేసుకో.+ 19  నీ గువ్వ ప్రాణాన్ని అడవి మృగాలకు అప్పగించకు. కష్టాల్లో ఉన్న నీ ప్రజల్ని శాశ్వతంగా మర్చిపోకు. 20  మాతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకో,భూమ్మీది చీకటి స్థలాలు దౌర్జన్యం చేసేవాళ్ల నివాసాలతో నిండిపోయాయి. 21  నలిగిపోయిన వ్యక్తిని నిరాశతో వెనక్కి వెళ్లనివ్వకు;+దీనులు, పేదవాళ్లు నీ పేరును స్తుతించాలి.+ 22  దేవా, లేచి నీ వ్యాజ్యాన్ని వాదించు. మూర్ఖులు రోజంతా నిన్ను ఎలా దూషిస్తున్నారో గుర్తుచేసుకో.+ 23  నీ శత్రువులు అంటున్న మాటల్ని మర్చిపోకు. నిన్ను ఎదిరిస్తున్నవాళ్ల కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “పొగ రాజుకుంది?”
అక్ష., “నీ సమాజాన్ని.”
లేదా “నీ సమావేశ స్థలం.”
లేదా “దేవుణ్ణి ఆరాధించే స్థలాలన్నిటినీ.”
పదకోశం చూడండి.
అక్ష., “తలల్ని.”