కీర్తనలు 81:1-16
సంగీత నిర్దేశకునికి సూచన; గిత్తీత్* అనే రాగంలో పాడాలి. ఆసాపు+ కీర్తన.
81 దేవుడే మన బలం,+ సంతోషంతో ఆయన ముందు కేకలు వేయండి.
ఆనందంతో కేకలు వేస్తూ యాకోబు దేవుణ్ణి స్తుతించండి.
2 సంగీతం మొదలుపెట్టండి,కంజీరను,* శ్రావ్యంగా పలికే వీణను,* తంతివాద్యాన్ని తీసుకోండి.
3 అమావాస్య రోజున,పౌర్ణమి రోజున, మన పండుగ రోజున బూర* ఊదండి.+
4 ఎందుకంటే, అది ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ,యాకోబు దేవుని శాసనం.+
5 ఆయన ఐగుప్తు దేశం మీదికి వెళ్లినప్పుడు,+యోసేపు కోసం దాన్ని ఒక జ్ఞాపికగా పెట్టాడు.+
నేను గుర్తుపట్టని ఒక స్వరం* ఇలా చెప్పడం విన్నాను:
6 “నేను అతని భుజం మీదున్న బరువును దించేశాను;+అతని చేతులు గంపను ఎత్తాల్సిన అవసరం లేదు.
7 కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు మొరపెట్టావు, నేను నిన్ను కాపాడాను;+ఉరుముతున్న మేఘాల్లో నుండి* నీకు జవాబిచ్చాను.+
మెరీబా* నీళ్ల దగ్గర నిన్ను పరీక్షించాను.+ (సెలా)
8 నా ప్రజలారా వినండి, నేను మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను.
ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బావుంటుంది.+
9 అప్పుడు నీ మధ్య ఏ అన్య దేవుడూ ఉండడు,వేరే దేశాల దేవునికి నువ్వు వంగి నమస్కారం చేయవు.+
10 ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిననీ దేవుడైన యెహోవాను నేనే.+
నీ నోటిని పెద్దగా తెరువు, నేను దాన్ని నింపుతాను.+
11 కానీ నా ప్రజలు నా మాట వినలేదు;ఇశ్రాయేలు నాకు లోబడడానికి ఇష్టపడలేదు.+
12 కాబట్టి నేను వాళ్లను తమ మొండి హృదయాల ప్రకారం నడుచుకోనిచ్చాను;వాళ్లు తమకు ఏది సరైనదనిపిస్తే అది చేశారు.*+
13 నా ప్రజలు నా మాట వింటే ఎంత బావుంటుంది,+ఇశ్రాయేలు నా మార్గాల్లో నడిస్తే ఎంత బావుంటుంది!+
14 అప్పుడు నేను వాళ్ల శత్రువుల్ని త్వరగా అణచివేస్తాను;వాళ్ల విరోధుల్ని ఓడిస్తాను.+
15 యెహోవాను ద్వేషించేవాళ్లు వణుకుతూ ఆయన దగ్గరికి వస్తారు,వాళ్లు ఎప్పటికీ శిక్ష అనుభవిస్తూ ఉంటారు.
16 కానీ ఆయన నిన్ను* శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాడు,+కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు.”+
అధస్సూచీలు
^ అంటే, గిలకల తప్పెట.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ అక్ష., “కొమ్ము.”
^ లేదా “భాష.”
^ “గొడవపడడం” అని అర్థం.
^ అక్ష., “ఉరుము దాగివున్న స్థలంలో.”
^ అక్ష., “తమ ఆలోచనల ప్రకారం నడిచారు.”
^ అక్ష., “అతన్ని.” అంటే, దేవుని ప్రజల్ని.