కీర్తనలు 83:1-18
గీతం. ఆసాపు+ శ్రావ్యగీతం.
83 దేవా, నిశ్శబ్దంగా ఉండకు;+దేవా, మౌనంగా ఉండిపోకు, ఊరుకోకు.
2 ఇదిగో! నీ శత్రువులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు;+నిన్ను ద్వేషించేవాళ్లు అహంకారంగా ప్రవర్తిస్తున్నారు.*
3 కుయుక్తితో వాళ్లు నీ ప్రజల మీద రహస్య పన్నాగాలు పన్నుతున్నారు;నీ అమూల్యమైన* ప్రజల మీద కుట్ర పన్నుతున్నారు.
4 వాళ్లు, “రండి, ఇశ్రాయేలు జనాన్ని సమూలంగా నాశనం చేసి,+వాళ్ల పేరు శాశ్వతంగా మరవబడేలా చేద్దాం” అని అంటున్నారు.
5 వాళ్లు కలిసికట్టుగా వ్యూహం పన్నుతున్నారు;నీకు వ్యతిరేకంగా సంధి* చేసుకున్నారు.+
6 డేరాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు; మోయాబీయులు,+ హగ్రీయులు;+
7 గెబలీయులు, అమ్మోనీయులు,+ అమాలేకీయులు;తూరు+ నివాసులతోపాటు ఫిలిష్తీయులు+ సంధి చేసుకున్నారు.
8 అష్షూరీయులు+ కూడా వాళ్లతో చేతులు కలిపారు;వాళ్లు లోతు కుమారులకు+ మద్దతిస్తున్నారు.* (సెలా)
9 నువ్వు మిద్యానుకు చేసినట్టు,+కీషోను వాగు దగ్గర సీసెరాకు, యాబీనుకు చేసినట్టు వాళ్లకు చేయి.+
10 ఏన్దోరు+ దగ్గర వాళ్లు సమూలంగా నాశనమయ్యారు;భూమికి ఎరువు అయ్యారు.
11 వాళ్ల ప్రముఖుల్ని ఓరేబులా, జెయేబులా,+వాళ్ల అధిపతుల్ని* జెబహులా, సల్మున్నాలా చేయి.+
12 ఎందుకంటే వాళ్లు, “దేవుడు నివసించే దేశాన్ని స్వాధీనం చేసుకుందాం” అని చెప్పుకున్నారు.
13 నా దేవా, వాళ్లను గిరగిర తిరిగే ముళ్లకొమ్మలా,+గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయి.
14 నిప్పు అడవిని కాల్చేసినట్టు,కార్చిచ్చు పర్వతాల్ని తగలబెట్టినట్టు,+
15 నీ తుఫానుతో+ వాళ్లను తరుము,నీ సుడిగాలితో వాళ్లను భయపెట్టు.+
16 యెహోవా, వాళ్లు నీ పేరును వెదికేలావాళ్ల ముఖాల్ని అవమానంతో కప్పేయి.*
17 వాళ్లు శాశ్వతంగా సిగ్గుపడాలి, భయపడిపోవాలి;అవమానాలపాలై నాశనమవ్వాలి;
18 యెహోవా అనే పేరున్న+ నువ్వు మాత్రమేభూమంతటి పైన మహోన్నతుడివని* ప్రజలు తెలుసుకోవాలి.+
అధస్సూచీలు
^ లేదా “తలలు ఎత్తుతున్నారు.”
^ అక్ష., “దాచబడిన.”
^ లేదా “ఒప్పందం.”
^ అక్ష., “బాహువు అయ్యారు.”
^ లేదా “నాయకుల్ని.”
^ అక్ష., “నింపేయి.”
^ లేదా “సర్వోన్నతుడివని.”