కీర్తనలు 88:1-18

  • మరణం నుండి కాపాడమని ప్రార్థన

    • “సమాధి అంచున ఉన్నాను” (3)

    • ‘ప్రతీ ఉదయం నీకు ప్రార్థిస్తాను’ (13)

గీతం. కోరహు కుమారుల శ్రావ్యగీతం.+ సంగీత నిర్దేశకునికి సూచన; మాహలతు* అనే శైలిలో వంతులవారీగా పాడాలి. ఎజ్రాహీయుడైన హేమాను+ మాస్కిల్‌.* 88  యెహోవా, నా రక్షకుడివైన దేవా,+పగలు నేను నీకు మొరపెడతాను,రాత్రిపూట నీ ముందుకు వస్తాను.+   నా ప్రార్థన నిన్ను చేరనివ్వు,+సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు.*+   నేను కష్టాల్లో మునిగిపోయాను,+సమాధి* అంచున ఉన్నాను.+   ఇప్పటికే నేను గోతిలోకి* దిగిపోయేవాళ్లలో ఒకడిగా ఎంచబడుతున్నాను;+నిస్సహాయుడిగా* ఉన్నాను.+   చనిపోయినవాళ్ల మధ్య విడవబడ్డాను.సమాధిలో పడివున్న హతునిలా,నువ్వు ఇక గుర్తుచేసుకోని వ్యక్తిలా,నీ సంరక్షణ* నుండి దూరమైన వాడిలా ఉన్నాను.   నువ్వు నన్ను లోతైన గోతిలో,చీకటిగా ఉన్న స్థలాల్లో, పెద్ద అగాధంలో ఉంచావు.   నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది,+ఢీకొట్టే నీ అలలతో నువ్వు నన్ను ముంచెత్తుతున్నావు. (సెలా)   నువ్వు నా పరిచయస్థుల్ని నాకు దూరం చేశావు;+వాళ్ల దృష్టిలో నన్ను నీచుడిగా చేశావు. నేను ఇరుక్కుపోయాను, బయటపడలేకపోతున్నాను.   బాధ వల్ల నా కళ్లు క్షీణించిపోయాయి.+ యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను;+నీ వైపే నా చేతులు చాపుతున్నాను. 10  నువ్వు చనిపోయినవాళ్ల కోసం అద్భుతాలు చేస్తావా? చనిపోయినవాళ్లు లేచి నిన్ను స్తుతిస్తారా?+ (సెలా) 11  సమాధిలో నీ విశ్వసనీయ ప్రేమ,నాశనస్థలంలో* నీ నమ్మకత్వం ప్రకటించబడతాయా? 12  చీకట్లో నీ అద్భుతాలు,అజ్ఞాత స్థలంలో నీ నీతి చాటించబడతాయా?+ 13  యెహోవా, ఇంకా నేను నీ సహాయం కోసం మొరపెడుతూనే ఉన్నాను,+ప్రతీ ఉదయం నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది.+ 14  యెహోవా, నన్నెందుకు తిరస్కరిస్తున్నావు?+ ఎందుకు నీ ముఖం నా నుండి పక్కకు తిప్పుకున్నావు?+ 15  చిన్నప్పటి నుండి నేను కష్టాలు అనుభవించాను,ఎప్పుడూ చావుకు దగ్గర్లో ఉన్నాను;+నువ్వు నాకు రానిచ్చిన ఘోరమైన కష్టాల వల్ల నేను మొద్దుబారిపోయాను. 16  నీ కోపాగ్ని నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది;+నీ భయాలు నన్ను నాశనం చేస్తున్నాయి. 17  అవి రోజంతా నీళ్లలా నన్ను చుట్టుముడుతున్నాయి;అన్నివైపుల నుండి* నా మీదికి వస్తున్నాయి. 18  నువ్వు నా స్నేహితుల్ని, నా సహవాసుల్ని నాకు దూరం చేశావు;+ఇప్పుడు చీకటి మాత్రమే నా సహవాసి.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “కిందికి వంగి, విను.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “శక్తిలేనివాడిలా.”
లేదా “సమాధిలోకి.”
అక్ష., “చేతి.”
లేదా “అబద్దోనులో.”
లేదా “ఒక్కసారిగా” అయ్యుంటుంది.