కీర్తనలు 91:1-16
91 సర్వోన్నతుని చాటున* నివసించేవాళ్లు+సర్వశక్తిమంతుని నీడలో విశ్రమిస్తారు.
2 “నువ్వే నా ఆశ్రయం, నా కోట,+నేను నమ్ముకున్న నా దేవుడు”+ అని నేను యెహోవాతో అంటాను.
3 ఆయన వేటగాడి ఉరిలో నుండి,నాశనకరమైన తెగులు నుండి నిన్ను రక్షిస్తాడు.
4 తన రెక్కలతో* నిన్ను కప్పుతాడు,ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందుతావు.+
ఆయన నమ్మకత్వం+ పెద్ద డాలులా,+ రక్షణ గోడలా* ఉంటుంది.
5 రాత్రి కలిగే భయాలకు గానీ,పగలు ఎగిరే బాణానికి+ గానీ నువ్వు భయపడవు;+
6 చీకట్లో తిరిగే తెగులుకు గానీ,మధ్యాహ్నం కలిగే నాశనానికి గానీ నువ్వు భయపడవు.
7 నీ పక్కన వెయ్యి మంది,నీ కుడిపక్కన పదివేల మంది పడిపోతారు,కానీ నీకు ఏ హానీ జరగదు.+
8 నువ్వు కేవలం నీ కళ్లతో దాన్ని చూస్తావు,దుష్టులు శిక్షించబడడం నువ్వు చూస్తావు.
9 “యెహోవాయే నా ఆశ్రయం” అని అంటూనువ్వు సర్వోన్నతుణ్ణి నీ నివాస స్థలంగా* చేసుకున్నావు;+
10 అందుకే ఏ విపత్తూ నీ మీదికి రాదు,ఏ తెగులూ నీ డేరా దగ్గరికి రాదు.
11 నీ మార్గాలన్నిట్లో నిన్ను కాపాడమనిఆయన నీ గురించి తన దూతలకు+ ఆజ్ఞాపిస్తాడు.+
12 నీ పాదానికి రాయి తగలకుండావాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు.+
13 నువ్వు కొదమ సింహాన్ని, తాచుపామును తొక్కుతావు;జూలు ఉన్న సింహాన్ని, పెద్ద పామును కాళ్లకింద తొక్కుతావు.+
14 దేవుడు ఇలా అన్నాడు: “అతనికి నేనంటే ప్రేమ* కాబట్టి నేను అతన్ని రక్షిస్తాను.+
అతనికి నా పేరు తెలుసు* కాబట్టి నేను అతన్ని కాపాడతాను.+
15 అతను నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను.+
కష్టాల్లో అతనికి తోడుంటాను.+
అతన్ని రక్షిస్తాను, మహిమపరుస్తాను.
16 దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను,+అతను నా రక్షణ కార్యాల్ని* చూసేలా చేస్తాను.”+
అధస్సూచీలు
^ లేదా “రహస్య స్థలంలో.”
^ లేదా “ఈకలతో.”
^ లేదా “అడ్డు గోడలా.”
^ లేదా “కోటగా; ఆశ్రయంగా” అయ్యుంటుంది.
^ అక్ష., “అతను నన్ను అంటిపెట్టుకున్నాడు.”
^ లేదా “అతను నా పేరును గుర్తిస్తున్నాడు.”
^ లేదా “నేను అనుగ్రహించే రక్షణను.”