ద్వితీయోపదేశకాండం 33:1-29

  • మోషే ఇశ్రాయేలు గోత్రాల్ని దీవించడం (1-29)

    • యెహోవా “శాశ్వత బాహువులు” (27)

33  సత్యదేవుని సేవకుడైన మోషే తాను చనిపోవడానికి ముందు ఇశ్రాయేలీయుల్ని దీవిస్తూ మాట్లాడిన మాటలు.+  అతను ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం మీద నుండి వచ్చాడు,+శేయీరు నుండి వాళ్లమీద ప్రకాశించాడు, పారాను పర్వత ప్రాంతం నుండి మహిమతో ప్రకాశించాడు,+లక్షలాది పవిత్ర దూతలు ఆయనతో పాటు ఉన్నారు,+ఆయన కుడిపక్కన ఆయన యోధులు ఉన్నారు.+   ఆయనకు తన ప్రజల మీద ఆప్యాయత ఉంది,+వాళ్ల పవిత్రులందరూ నీ చేతిలో ఉన్నారు.+ వాళ్లు నీ పాదాల దగ్గర కూర్చున్నారు,+నీ మాటలు వినడం మొదలుపెట్టారు.+   (మోషే మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు,+అది యాకోబు సమాజపు సొత్తు.)+   ఇశ్రాయేలు గోత్రాలన్నిటితో పాటు+ ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు, ఆయన యెషూరూనులో*+ రాజయ్యాడు.   రూబేను అంతరించిపోకుండా జీవించే ఉండాలి,+ అతని మనుషుల సంఖ్య తగ్గకూడదు.”+   అతను యూదాను ఇలా దీవించాడు:+ “యెహోవా, యూదా మొరను ఆలకించు,+ నువ్వు అతన్ని తన ప్రజల దగ్గరికి తిరిగి తీసుకురావాలి. అతని బాహువులు అతనికి చెందిన వాటికోసం పోరాడాయి, తన శత్రువులతో పోరాడడానికి నువ్వు అతనికి సహాయం చేయాలి.”+   లేవి గురించి అతను ఇలా అన్నాడు:+ “నీ* తుమ్మీము, ఊరీము+ నీకు విశ్వసనీయంగా ఉన్న వ్యక్తికి+ చెందుతాయి, మస్సా దగ్గర నువ్వు అతన్ని పరీక్షించావు,+ మెరీబా నీళ్ల దగ్గర అతనితో పోరాడడం మొదలుపెట్టావు,+   అతను తన తల్లిదండ్రుల గురించి, ‘నేను వాళ్లను పట్టించుకోలేదు’ అని అన్నాడు. అతను తన సహోదరుల్ని కూడా లెక్కచేయలేదు,+ తన సొంత కుమారుల్ని లక్ష్యపెట్టలేదు. అతను నీ మాటకు కట్టుబడి ఉన్నాడు, నీ ఒప్పందాన్ని పాటించాడు.+ 10  అతను నీ న్యాయనిర్ణయాల్ని యాకోబుకు నేర్పించాలి,+ నీ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు బోధించాలి.+ నువ్వు ఇష్టపడే సువాసన వచ్చేలా అతను నీకు ధూపం వేయాలి,+ నీ బలిపీఠం మీద పూర్తి అర్పణను అర్పించాలి.+ 11  యెహోవా, అతని బలాన్ని దీవించు, అతని చేతుల పనిని స్వీకరించు, అతన్ని ద్వేషించేవాళ్లు ఇక అతని మీదికి లేవకుండా, వాళ్ల కాళ్లను* విరగ్గొట్టు.” 12  బెన్యామీను గురించి అతను ఇలా అన్నాడు:+ “యెహోవాకు ప్రియమైన వ్యక్తి ఆయన దగ్గర సురక్షితంగా ఉండాలి; రోజంతా ఆయన అతనికి ఆశ్రయమౌతాడు, ఆయన భుజాల మధ్య అతను నివసిస్తాడు.” 13  యోసేపు గురించి అతను ఇలా అన్నాడు:+ “యెహోవా అతని భూమిని దీవించాలి;+ ఆకాశం నుండి వచ్చే శ్రేష్ఠమైన వాటితో, మంచుతో, అగాధ జలాలతో,+ 14  సూర్యుని వల్ల పెరిగే శ్రేష్ఠమైన వాటితో, నెలనెలా పండే శ్రేష్ఠమైన పంటతో,+ 15  పురాతన కాల పర్వతాల* నుండి వచ్చే అతిశ్రేష్ఠమైన వాటితో,+ ఎల్లకాలం నిలిచే పర్వతాల నుండి వచ్చే శ్రేష్ఠమైన వాటితో, 16  భూమి నుండి వచ్చే శ్రేష్ఠమైన వాటితో, అందులో పండే ప్రతీదానితో,+ ముళ్లపొదలో నివసించే దేవుని+ ఆమోదంతో అతను దీవించబడాలి. అవన్నీ యోసేపు తలమీదికి, తన సహోదరుల నుండి వేరుచేయబడిన వ్యక్తి నడినెత్తి మీదికి రావాలి.+ 17  అతని వైభవం మొదట పుట్టిన ఎద్దు వైభవం లాంటిది, అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతను జనాల్ని నెట్టేస్తాడు,* వాటన్నిటినీ భూమి సరిహద్దుల వరకు నెట్టేస్తాడు. ఎఫ్రాయిము సైన్యంలోని లక్షలమంది పురుషులు,+ మనష్షే సైన్యంలోని వేలమంది పురుషులే ఆ కొమ్ములు.” 18  జెబూలూను గురించి అతను ఇలా అన్నాడు:+ “జెబూలూనూ, నువ్వు బయటికి వెళ్లేటప్పుడు సంతోషించు, ఇశ్శాఖారూ, నువ్వు నీ డేరాల్లో సంతోషించు.+ 19  వాళ్లు జనాల్ని పర్వతం దగ్గరికి పిలుస్తారు. వాళ్లు అక్కడ నీతి బలులు అర్పిస్తారు. వాళ్లు సముద్రంలోని విస్తారమైన సంపదలతో, ఇసుకలోని గుప్తనిధులతో* పోషించబడతారు.” 20  గాదు గురించి అతను ఇలా అన్నాడు:+ “గాదు సరిహద్దుల్ని విస్తరించేవాడు దీవించబడతాడు.+ అతను అక్కడ సింహంలా పడుకొని ఉంటాడు, బాహువును, నడినెత్తిని చీల్చేయడానికి సిద్ధంగా ఉంటాడు. 21  అతను తన కోసం మొదటి భాగాన్ని ఎంచుకుంటాడు,+ ఎందుకంటే శాసనాల్ని ఇచ్చే వ్యక్తి కేటాయించిన భాగం అక్కడే ఉంది.+ ప్రజల పెద్దలు ఒకచోట సమావేశమౌతారు. అతను యెహోవా నీతిని అమలు చేస్తాడు, ఇశ్రాయేలు విషయంలో ఆయన న్యాయనిర్ణయాల్ని అమలు చేస్తాడు.” 22  దాను గురించి అతను ఇలా అన్నాడు:+ “దాను సింహం పిల్ల.+ అతను బాషాను నుండి దూకి వస్తాడు.”+ 23  నఫ్తాలి గురించి అతను ఇలా అన్నాడు:+ “నఫ్తాలి యెహోవా ఆమోదంతో సంతృప్తిగా ఉన్నాడు, దేవుని దీవెనలతో నిండిపోయాడు. నువ్వు పడమటి ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకో.” 24  ఆషేరు గురించి అతను ఇలా అన్నాడు:+ “అతను కుమారులతో దీవించబడ్డాడు. అతను తన సహోదరుల అనుగ్రహం పొందాలి, తన పాదాన్ని తైలంలో ముంచాలి. 25  నీ ద్వారపు గడియలు ఇనుపవి, రాగివి;+ నువ్వు జీవించినన్ని రోజులు సురక్షితంగా ఉంటావు.* 26  యెషూరూను+ సేవించే సత్యదేవుని లాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశం గుండా స్వారీ చేస్తూ వస్తాడు,తన తేజస్సుతో మేఘాల మీద స్వారీ చేస్తూ వస్తాడు.+ 27  పురాతన కాలాల నుండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు,+ఆయన శాశ్వత బాహువులు నీ కింద ఉన్నాయి.+ శత్రువుల్ని ఆయన నీ ముందు నుండి వెళ్లగొడతాడు,+‘వాళ్లను సమూలంగా నాశనం చేయి!’ అంటాడు.+ 28  ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తాడు,యాకోబు ఊట ప్రత్యేకించబడుతుంది.ధాన్యం, కొత్త ద్రాక్షారసం ఉండే దేశంలో,+ఆకాశం నుండి మంచు బిందువులు కురిసే దేశంలో అతను ఉంటాడు.+ 29  ఇశ్రాయేలూ, నువ్వు సంతోషంగా ఉంటావు!+ నీలాంటి వాళ్లు ఎవరున్నారు?+నువ్వు యెహోవా రక్షణను ఆస్వాదిస్తున్న జనానివి,+ఆయన నీకు రక్షణ కవచంలా ఉన్నాడు,+నీ మహిమాన్విత ఖడ్గంలా ఉన్నాడు. నీ శత్రువులు వణుకుతూ నీ ముందుకు వస్తారు,+నువ్వు వాళ్ల వీపుల* మీద నడుస్తావు.”

అధస్సూచీలు

“నిజాయితీపరుడు” అని అర్థం. ఇది ఇశ్రాయేలుకు ఉపయోగించిన గౌరవపూర్వక బిరుదు.
ఈ వచనంలో “నీ, నీకు, నువ్వు” అనే పదాలు దేవుణ్ణి సూచిస్తున్నాయి.
లేదా “తుంట్లను.”
లేదా “తూర్పు పర్వతాల” అయ్యుంటుంది.
లేదా “కుమ్ముతాడు.”
లేదా “కూడబెట్టిన సంపదలతో.”
అక్ష., “నీ బలం నీ రోజుల్లాగే ఉంటుంది.”
లేదా “ఎత్తైన స్థలాల” అయ్యుంటుంది.