నహూము 1:1-15
1 నీనెవె గురించిన సందేశం.+ ఇది ఎల్కోషు వాడైన నహూముకు* వచ్చిన దర్శనాన్ని వివరించే పుస్తకం:
2 యెహోవా సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు,+ ప్రతీకారం తీర్చుకునే దేవుడు;యెహోవా పగ తీర్చుకుంటాడు, ఆయన తన కోపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.+
యెహోవా తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు,ఆయన తన విరోధుల కోసం కోపాన్ని నిల్వచేస్తాడు.
3 యెహోవా ఓర్పు గలవాడు,*+ మహాబలం గలవాడు,అయినాసరే, యెహోవా తగిన శిక్ష విధించకుండా ఉండడు.+
ఆయన దారి నాశనకరమైన గాలిలో, సుడిగాలిలో ఉంది.మేఘాలు ఆయన పాదధూళి.
4 ఆయన సముద్రాన్ని గద్దించి+ ఆరిపోజేస్తాడు;నదులన్నిటినీ ఎండిపోజేస్తాడు.+
బాషాను, కర్మెలు వాడిపోతాయి,+లెబానోను పూలు వడలిపోతాయి.
5 ఆయన వల్ల పర్వతాలు కంపిస్తాయి,కొండలు కరిగిపోతాయి.+
ఆయన ముందు భూమి కంపిస్తుంది,లోకం, దానిలో నివసించే వాళ్లందరూ వణుకుతారు.+
6 ఆయన కోపం ముందు ఎవరు నిలవగలరు?
ఆయన కోపాగ్నిని ఎవరు తట్టుకోగలరు?+
ఆయన ఉగ్రత అగ్నిలా కుమ్మరించబడుతుంది,ఆయన వల్ల బండలు బద్దలౌతాయి.
7 యెహోవా మంచివాడు,+ శ్రమ రోజున ఆయన బలమైన దుర్గం.+
తనను ఆశ్రయించే వాళ్లు ఆయనకు తెలుసు.*+
8 వరద ప్రవాహంతో ఆయన దాని* స్థలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు,చీకటి ఆయన శత్రువుల్ని తరుముతుంది.
9 యెహోవాకు వ్యతిరేకంగా నువ్వు ఏం కుట్ర పన్నుతావు?
ఆయన సమూలనాశనం చేయబోతున్నాడు.
ఆపద రెండోసారి రాదు.+
10 వాళ్లు ముళ్లకంపల్లా అల్లుకుపోయారు,మద్యం* తాగిన వాళ్లలా మత్తుగా ఉన్నారు;అయితే వాళ్లు కొయ్యకాలులా* దహించేయబడతారు.
11 యెహోవాకు వ్యతిరేకంగా పన్నాగం పన్నే వ్యక్తి నీ నుండి వస్తాడు,పనికిమాలిన సలహా ఇస్తాడు.
12 యెహోవా ఇలా అంటున్నాడు:
“వాళ్లు చాలా బలంగా, అసంఖ్యాకంగా ఉన్నానరికేయబడతారు, అంతమైపోతారు.*
నేను నిన్ను* కష్టపెట్టాను, కానీ ఇకమీదట అలా కష్టపెట్టను.
13 ఇప్పుడు నేను నీ మీదున్న అతని కాడిని విరగ్గొడతాను,+నీ కట్లను తెంపేస్తాను.
14 యెహోవా నీ* గురించి ఆజ్ఞ ఇచ్చాడు,‘నీ పేరు పెట్టుకునే వాళ్లు ఇక పుట్టరు.
నీ దేవుళ్ల గుడిలోని చెక్కిన విగ్రహాల్ని, పోత* విగ్రహాల్ని నాశనం చేస్తాను.
నేను నీకు సమాధి సిద్ధం చేస్తాను, ఎందుకంటే నువ్వు నీచుడివి.’
15 ఇదిగో! మంచివార్త ప్రకటించే,శాంతిని చాటించే వ్యక్తి పాదాలు పర్వతాల మీద ఉన్నాయి.+
యూదా, నీ పండుగలు ఆచరించు,+ నీ మొక్కుబళ్లు చెల్లించు,ఎందుకంటే, పనికిమాలినవాడు ఇంకెప్పుడూ నీ మధ్య నుండి వెళ్లడు.
అతను పూర్తిగా నాశనమౌతాడు.”
అధస్సూచీలు
^ “ఓదార్చేవాడు” అని అర్థం.
^ లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తాడు.”
^ లేదా “వాళ్ల బాగోగులు చూసుకుంటాడు.”
^ అంటే, నీనెవె.
^ లేదా “గోధుమలతో తయారైన మద్యం.”
^ పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
^ లేదా “నేను వాళ్ల మధ్య నుండి దాటివెళ్తాను” అయ్యుంటుంది.
^ అంటే, యూదా.
^ అంటే, అష్షూరు.
^ లేదా “లోహపు.”