నెహెమ్యా 11:1-36

  • యెరూషలేములో మళ్లీ ప్రజలు నివసించడం (1-36)

11  ప్రజల అధిపతులు యెరూషలేములో నివసించారు;+ కానీ ప్రతీ పదిమందిలో ఒకరు పవిత్ర నగరమైన యెరూషలేములో నివసించేలా వాళ్లను తీసుకురావడానికి మిగతా ప్రజలు చీట్లు వేశారు.+ మిగతా తొమ్మిదిమంది ఇతర నగరాల్లో నివసించారు.  యెరూషలేములో నివసించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్లందర్నీ ప్రజలు దీవించారు.  యెరూషలేములో నివసించిన యూదా సంస్థాన అధిపతులు వీళ్లు. (ఇశ్రాయేలీయుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో, ఆలయ సేవకుల్లో,*+ సొలొమోను సేవకుల వంశస్థుల్లో+ మిగిలినవాళ్లు యూదాలోని ఇతర నగరాల్లో నివసించారు; ప్రతీ ఒక్కరు తమతమ నగరాల్లో తమ సొంత వాటాలో నివసించారు.+  యూదా, బెన్యామీను ప్రజల్లో కొంతమంది కూడా యెరూషలేములో నివసించారు.) యూదా ప్రజల్లో ఉజ్జియా కుమారుడైన అతాయా; ఉజ్జియా జెకర్యా కుమారుడు, జెకర్యా అమర్యా కుమారుడు, అమర్యా షెఫట్య కుమారుడు, షెఫట్య మహలలేలు కుమారుడు, మహలలేలు పెరెసు+ వంశస్థుడు.  అలాగే బారూకు కుమారుడైన మయశేయా; బారూకు కొల్హోజె కుమారుడు, కొల్హోజె హజాయా కుమారుడు, హజాయా అదాయా కుమారుడు, అదాయా యోయారీబు కుమారుడు, యోయారీబు జెకర్యా కుమారుడు, జెకర్యా షేలానీయుని కుమారుడు.  యెరూషలేములో నివసించిన పెరెసు వంశస్థులందరూ 468 మంది బలాఢ్యులు.  బెన్యామీను ప్రజల్లో: మెషుల్లాము కుమారుడైన సల్లు;+ మెషుల్లాము యోవేదు కుమారుడు, యోవేదు పెదాయా కుమారుడు, పెదాయా కోలాయా కుమారుడు, కోలాయా మయశేయా కుమారుడు, మయశేయా ఈతీయేలు కుమారుడు, ఈతీయేలు యెషాయా కుమారుడు.  అతని తర్వాత గబ్బయి, సల్లయి; మొత్తం 928 మంది;  జిఖ్రీ కుమారుడైన యోవేలు వాళ్ల పర్యవేక్షకుడు; హాసెనూయా కుమారుడైన యూదా ఆ నగరానికి ఉప అధిపతి. 10  యాజకుల్లో: యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను,+ 11  శెరాయా; ఈ శెరాయా హిల్కీయా కుమారుడు, హిల్కీయా మెషుల్లాము కుమారుడు, మెషుల్లాము సాదోకు కుమారుడు, సాదోకు మెరాయోతు కుమారుడు, మెరాయోతు సత్యదేవుని మందిర* అధిపతైన అహీటూబు+ కుమారుడు; 12  అలాగే మందిర పని చేసిన అతని సహోదరులు; మొత్తం 822 మంది; అలాగే యెరోహాము కుమారుడైన అదాయా; యెరోహాము పెలల్యా కుమారుడు, పెలల్యా అమ్జీ కుమారుడు, అమ్జీ జెకర్యా కుమారుడు, జెకర్యా పషూరు+ కుమారుడు, పషూరు మల్కీయా కుమారుడు; 13  పూర్వీకుల కుటుంబాల పెద్దలైన అతని సహోదరులు; మొత్తం 242 మంది; అలాగే అజరేలు కుమారుడైన అమష్షయి; అజరేలు అహజై కుమారుడు, అహజై మెషిల్లేమోతు కుమారుడు, మెషిల్లేమోతు ఇమ్మేరు కుమారుడు; 14  బలాఢ్యులూ ధైర్యవంతులూ అయిన వాళ్ల సహోదరులు; మొత్తం 128 మంది. వాళ్ల పర్యవేక్షకుడు జబ్దీయేలు, ఇతను ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవాడు. 15  లేవీయుల్లో: హష్షూబు కుమారుడైన షెమయా; హష్షూబు అజ్రీకాము కుమారుడు, అజ్రీకాము హషబ్యా కుమారుడు, హషబ్యా బున్నీ కుమారుడు; 16  లేవీయుల పెద్దల్లో షబ్బెతై,+ యోజాబాదు;+ వాళ్లు సత్యదేవుని మందిరం బయటి విషయాల్ని చూసుకునేవాళ్లు. 17  అలాగే మీకా కుమారుడైన మత్తన్యా;+ మీకా జబ్ది కుమారుడు, జబ్ది ఆసాపు కుమారుడు. మత్తన్యా స్తుతులు పాడడంలో నాయకత్వం వహిస్తూ ప్రార్థన చేసేటప్పుడు స్తుతి చెల్లించేవాడు.+ అతని సహాయకుడైన బక్బుక్యా, షమ్మూయ కుమారుడైన అబ్దా; షమ్మూయ గాలాలు కుమారుడు, గాలాలు యెదూతూను+ కుమారుడు. 18  పవిత్ర నగరంలోని లేవీయులందరూ 284 మంది. 19  ద్వారపాలకులు అక్కూబు, టల్మోను,+ అలాగే ద్వారాల దగ్గర కాపలా కాసే వాళ్ల సహోదరులు; మొత్తం 172 మంది. 20  ఇశ్రాయేలీయుల్లో, యాజకుల్లో, లేవీయుల్లో మిగతావాళ్లు యూదాలోని ఇతర నగరాలన్నిట్లో నివసించారు; ప్రతీ ఒక్కరు తమకు వారసత్వంగా వచ్చిన స్థలంలో* నివసించారు. 21  ఆలయ సేవకులు*+ ఓపెలులో+ నివసించారు; జీహా, గిష్పా ఆలయ సేవకుల* మీద అధికారులు. 22  యెరూషలేములోని లేవీయుల మీద బానీ కుమారుడైన ఉజ్జీ పర్యవేక్షకుడు; బానీ హషబ్యా కుమారుడు, హషబ్యా మత్తన్యా కుమారుడు, మత్తన్యా మీకా కుమారుడు, మీకా గాయకులైన ఆసాపు వంశస్థుల్లో ఒకడు; ఉజ్జీ సత్యదేవుని మందిర పని మీద అధికారి. 23  గాయకుల కోసం అప్పుడు ఒక రాజాజ్ఞ+ ఉండేది, వాళ్ల రోజువారీ అవసరాలు తీర్చడానికి ఒక నిర్దిష్ట ఏర్పాటు ఉండేది. 24  పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లో రాజుకు సలహాదారుడిగా* ఉండేవాడు. ఈ పెతహయా మెషేజబెయేలు కుమారుడు, మెషేజబెయేలు యూదా కుమారుడైన జెరహు వంశస్థుడు. 25  పొలాలున్న పల్లెల విషయానికొస్తే, యూదా ప్రజలు కొంతమంది కిర్యతర్బాలో,+ దాని చుట్టుపక్కల పట్టణాల్లో; దీబోనులో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; యెకబ్సెయేలులో,+ దాని పల్లెల్లో నివసించారు. 26  అలాగే యేషూవలో, మోలాదాలో,+ బేత్‌-పెలెతులో,+ 27  హజర్షువలులో,+ బెయేర్షెబాలో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; 28  సిక్లగులో,+ మెకోనాలో, దాని చుట్టుపక్కల పట్టణాల్లో; 29  ఏన్రిమ్మోనులో,+ జొర్యాలో,+ యర్మూతులో, 30  జానోహలో,+ అదుల్లాములో, దాని పల్లెల్లో; లాకీషులో,+ దాని పొలాల్లో; అజేకాలో,+ దాని చుట్టుపక్కల పట్టణాల్లో నివసించారు. వాళ్లు బెయేర్షెబా నుండి హిన్నోము లోయ+ వరకు స్థిరపడ్డారు.* 31  బెన్యామీను ప్రజలు గెబాలో,+ మిక్మషులో, ఆయాలో, అలాగే బేతేలులో,+ దాని చుట్టుపక్కల పట్టణాల్లో నివసించారు; 32  అలాగే అనాతోతులో,+ నోబులో,+ అనన్యాలో, 33  హాసోరులో, రామాలో,+ గిత్తయీములో, 34  హాదీదులో, జెబోయిములో, నెబల్లాటులో, 35  లోదులో, ఓనోలో,+ చేతిపని వారి లోయలో నివసించారు. 36  అంతకుముందు యూదాలో నివసించిన కొన్ని లేవీయుల గుంపులు బెన్యామీను ప్రాంతంలో స్థిరపడ్డాయి.

అధస్సూచీలు

లేదా “నెతీనీయుల్లో.” అక్ష., “ఇవ్వబడినవాళ్లలో.”
లేదా “ఆలయ.”
లేదా “తమ స్వాస్థ్యంలో.”
లేదా “నెతీనీయుల.” అక్ష., “ఇవ్వబడినవాళ్ల.”
లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
అక్ష., “రాజు చేతి దగ్గర.”
లేదా “డేరాలు వేసుకొని నివసించారు.”