నెహెమ్యా 3:1-32

  • ప్రాకారాల్ని తిరిగి కట్టడం (1-32)

3  ప్రధానయాజకుడైన ఎల్యాషీబు,+ యాజకులైన అతని సహోదరులు లేచి గొర్రెల ద్వారాన్ని+ కట్టే పని మొదలుపెట్టారు. వాళ్లు దాన్ని ప్రతిష్ఠించి,*+ దాని తలుపుల్ని అమర్చారు; వాళ్లు దాన్ని మేయా గోపురం+ వరకు, హనన్యేలు గోపురం+ వరకు ప్రతిష్ఠించారు.  వాళ్ల పక్కన యెరికోవాళ్లు+ కట్టారు. వాళ్ల పక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు.  హస్సెనాయా కుమారులు చేపల ద్వారాన్ని+ కట్టారు; వాళ్లు దాని దూలాల్ని అమర్చి,+ దాని తలుపుల్ని, గడియల్ని, అడ్డగడియల్ని బిగించారు.  వాళ్ల పక్కన హక్కోజు మనవడూ ఊరియా కుమారుడూ అయిన మెరేమోతు+ ప్రాకారాన్ని బాగుచేశాడు, వాళ్ల పక్కన మెషేజబెయేలు కుమారుడైన బెరెక్యా కుమారుడు మెషుల్లాము+ బాగుచేశాడు. వాళ్ల పక్కన బయనా కుమారుడైన సాదోకు బాగుచేశాడు.  వాళ్ల పక్కన తెకోవీయులు+ బాగుచేశారు, కానీ వాళ్లలోని ప్రముఖులు తమ యజమానుల సేవలో పాలుపంచుకునేంత వినయం చూపించలేదు.  పాసెయ కుమారుడైన యోయాదా, బెసోద్యా కుమారుడైన మెషుల్లాము పాత నగర ద్వారాన్ని+ బాగుచేశారు; వాళ్లు దాని దూలాల్ని అమర్చి, దాని తలుపుల్ని, గడియల్ని, అడ్డగడియల్ని బిగించారు.  వాళ్ల పక్కన గిబియోనీయుడైన+ మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. వీళ్లు గిబియోనుకు, మిస్పాకు+ చెందినవాళ్లు, అలాగే నది అవతలి ప్రాంత*+ అధిపతి అధికారం కింద ఉన్నవాళ్లు.  వాళ్ల పక్కన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు అనే కంసాలి బాగుచేశాడు, అతని పక్కన లేపనాలు చేసే* హనన్యా బాగుచేశాడు; వాళ్లు యెరూషలేములో వెడల్పు గోడ+ వరకు రాళ్లు పరిచారు.  వాళ్ల పక్కన హూరు కుమారుడూ యెరూషలేము ప్రాంత సగభాగానికి అధిపతీ అయిన రెఫాయా బాగుచేశాడు. 10  వాళ్ల పక్కన హరూమపు కుమారుడైన యెదాయా తన ఇంటి ఎదురుగా బాగుచేశాడు. అతని పక్కన హషబ్నెయా కుమారుడైన హట్టూషు బాగుచేశాడు. 11  హారీము+ కుమారుడైన మల్కీయా, పహత్మోయాబు+ కుమారుడైన హష్షూబు మరో భాగాన్ని,* అలాగే పొయ్యిల గోపురాన్ని+ మరమ్మతు చేశారు. 12  వాళ్ల పక్కన హల్లోహెషు కుమారుడూ యెరూషలేము ప్రాంత సగభాగానికి అధిపతీ అయిన షల్లూము తన కూతుళ్లతో కలిసి బాగుచేశాడు. 13  హానూను, జానోహ+ నివాసులు లోయ ద్వారాన్ని+ మరమ్మతు చేశారు; వాళ్లు దాన్ని కట్టి, దాని తలుపుల్ని, గడియల్ని, అడ్డగడియల్ని బిగించారు. వాళ్లు బూడిద కుప్పల ద్వారం+ వరకు 1,000 మూరల* ప్రాకారాన్ని మరమ్మతు చేశారు. 14  రేకాబు కుమారుడూ బేత్‌-హక్కెరెము+ ప్రాంత అధిపతీ అయిన మల్కీయా బూడిద కుప్పల ద్వారాన్ని బాగుచేశాడు; అతను దాన్ని కట్టి, దాని తలుపుల్ని, గడియల్ని, అడ్డగడియల్ని బిగించాడు. 15  కొల్హోజె కుమారుడూ మిస్పా+ ప్రాంత అధిపతీ అయిన షల్లూను ఊట ద్వారాన్ని+ బాగుచేశాడు; అతను దాన్ని కట్టి, దానికి పైకప్పు వేసి, తలుపుల్ని, గడియల్ని, అడ్డగడియల్ని బిగించాడు. ఇంకా అతను రాజు తోట+ పక్కనున్న కాలువ కోనేరు*+ గోడను, దావీదు నగరం+ నుండి కిందికి వెళ్లే మెట్ల+ వరకు మరమ్మతు చేశాడు. 16  అతని పక్కన అజ్బూకు కుమారుడూ బేత్సూరు+ ప్రాంత సగభాగానికి అధిపతీ అయిన నెహెమ్యా బాగుచేశాడు; అతను దావీదుకు చెందిన సమాధుల ప్రాంతం+ ఎదుటి నుండి కృత్రిమ కోనేరు+ వరకు, యోధుల ఇంటి వరకు బాగుచేశాడు. 17  అతని పక్కన బానీ కుమారుడైన రెహూము పర్యవేక్షణలో లేవీయులు మరమ్మతు చేశారు. అతని పక్కన కెయీలా+ ప్రాంత సగభాగానికి అధిపతైన హషబ్యా తన ప్రాంతాన్ని బాగుచేశాడు. 18  అతని పక్కన వాళ్ల సహోదరులు బాగుచేశారు; హేనాదాదు కుమారుడూ కెయీలా ప్రాంత సగభాగానికి అధిపతీ అయిన బవ్వై వాళ్ల మీద పర్యవేక్షకుడిగా ఉన్నాడు. 19  అతని పక్కన యేషూవ+ కుమారుడూ మిస్పాకు అధిపతీ అయిన ఏసెరు మరో భాగాన్ని, అంటే ఆధార గోడ+ దగ్గరున్న ఆయుధశాలకు ఎక్కే దారికి ఎదురుగా ఉన్న భాగాన్ని మరమ్మతు చేశాడు. 20  అతని పక్కన జబ్బయి+ కుమారుడైన బారూకు ఎంతో ఉత్సాహంగా పనిచేసి మరో భాగాన్ని, అంటే ఆధార గోడ దగ్గర నుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు+ ఇంటి ముందు వరకు బాగుచేశాడు. 21  అతని పక్కన హక్కోజు కుమారుడైన ఊరియా కుమారుడు మెరేమోతు+ మరో భాగాన్ని, అంటే ఎల్యాషీబు ఇంటి ముంగిటి నుండి ఎల్యాషీబు ఇంటి చివరి వరకు బాగుచేశాడు. 22  అతని పక్కన యొర్దాను ప్రాంతానికి*+ చెందిన యాజకులు బాగుచేశారు. 23  వాళ్ల పక్కన బెన్యామీను, హష్షూబు తమ ఇళ్లకు ఎదురుగా బాగుచేశారు. వాళ్ల పక్కన అనన్యా కుమారుడైన మయశేయా కుమారుడు అజర్యా తన ఇంటి దగ్గర్లో బాగుచేశాడు. 24  అతని పక్కన హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరో భాగాన్ని, అంటే అజర్యా ఇంటి దగ్గర నుండి ఆధార గోడ+ వరకు, మూల వరకు బాగుచేశాడు. 25  అతని పక్కన ఊజై కుమారుడైన పాలాలు ఆధార గోడకు, కాపలాదారుల ప్రాంగణం+ దగ్గరున్న రాజభవనం+ నుండి పైకి లేచే గోపురానికి ఎదురుగా ఉన్న భాగాన్ని బాగుచేశాడు; అతని పక్కన పరోషు+ కుమారుడైన పెదాయా మరమ్మతు చేశాడు. 26  ఓపెలులో+ నివసించిన ఆలయ సేవకులు*+ తూర్పు వైపున నీటి ద్వారం+ ఎదుటి వరకు, బయటికి పొడుచుకు వచ్చిన గోపురం వరకు బాగుచేశారు. 27  వాళ్ల పక్కన తెకోవీయులు+ మరో భాగాన్ని, అంటే బయటికి పొడుచుకు వచ్చిన మహా గోపురం ఎదుటి నుండి ఓపెలు గోడ వరకు బాగుచేశారు. 28  యాజకుల్లో ప్రతీ ఒక్కరు తమ ఇళ్ల ముందు గుర్రపు ద్వారం+ నుండి అవతలి భాగాన్ని బాగుచేశారు. 29  వాళ్ల పక్కన ఇమ్మేరు కుమారుడైన సాదోకు+ తన ఇంటి ఎదురుగా బాగుచేశాడు. అతని పక్కన షెకన్యా కుమారుడూ తూర్పు ద్వారం కాపలాదారుడూ+ అయిన షెమయా బాగుచేశాడు. 30  అతని పక్కన షెలెమ్యా కుమారుడైన హనన్యా, జాలాపు ఆరో కుమారుడైన హానూను మరో భాగాన్ని బాగుచేశారు. అతని పక్కన బెరెక్యా కుమారుడైన మెషుల్లాము+ తన పెద్ద గది ముందు బాగుచేశాడు. 31  అతని పక్కన కంసాలి సమాజ సభ్యుడైన మల్కీయా ఆలయ సేవకుల,*+ వర్తకుల ఇంటి వరకు, తనిఖీ ద్వారం ఎదురుగా, మూలనున్న పై గది వరకు బాగుచేశాడు. 32  మూలనున్న పై గదికీ గొర్రెల ద్వారానికీ+ మధ్య ఉన్న భాగాన్ని కంసాలులు, వర్తకులు మరమ్మతు చేశారు.

అధస్సూచీలు

లేదా “సమర్పించి.”
ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.
లేదా “పరిమళ ద్రవ్యాలు చేసే.”
లేదా “కొలిచిన భాగాన్ని.”
దాదాపు 445 మీటర్లు (1,460 అడుగులు). అనుబంధం B14 చూడండి.
లేదా “షెలా కోనేరు.”
లేదా “దగ్గర్లోని ప్రాంతానికి” అయ్యుంటుంది.
లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”
లేదా “నెతీనీయుల.” అక్ష., “ఇవ్వబడినవాళ్ల.”