పరమగీతం 2:1-17

  • యువతి (1)

    • ‘నేను అడవి పువ్వు లాంటిదాన్ని’

  • గొర్రెల కాపరి (2)

    • ‘నా ప్రియురాలు లిల్లీ పువ్వులా ఉంది’

  • యువతి (3-14)

    • ‘ప్రేమ దానంతటదే మేల్కొనే వరకు దాన్ని లేపకండి’ (7)

    • గొర్రెల కాపరి మాటలు (10బి-14)

      • “నా అందాలరాశీ, నాతో వచ్చేయి” (10బి, 13)

  • యువతి సహోదరులు (15)

    • “గుంటనక్కల్ని పట్టుకో”

  • యువతి (16, 17)

    • “నా ప్రియుడు నాకు సొంతం, నేను అతనికి సొంతం” (16)

2  “నేను షారోనులో* పూసే అడవి పువ్వు* లాంటిదాన్ని,లోయల్లో పూసే లిల్లీ పువ్వు+ లాంటిదాన్ని.”   “యువతుల మధ్య నా ప్రియురాలుముళ్ల మధ్య లిల్లీ పువ్వులా ఉంది.”   “యువకుల మధ్య నా ప్రియుడుఅడవి చెట్ల మధ్య ఆపిల్‌ చెట్టులా ఉన్నాడు. అతని నీడలో కూర్చోవాలని నేను తపిస్తున్నాను,అతని పండ్లు నా నోటికి తియ్యగా ఉన్నాయి.   అతను నన్ను విందు గృహానికి తీసుకొచ్చాడు,నా మీద ప్రేమ పతాకం ఎత్తాడు.   నేను విరహ వేదన పడుతున్నాను;ఎండుద్రాక్ష రొట్టెలతో+ నన్ను తెప్పరిల్లజేయండి,ఆపిల్‌ పండ్లతో నన్ను బలపర్చండి.   అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది,తన కుడిచేతితో అతను నన్ను హత్తుకున్నాడు.+   యెరూషలేము కూతుళ్లారా,కొండజింకల+ మీద, మైదానంలోని లేళ్ల మీద మీతో ఒట్టు వేయిస్తున్నాను: ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు మీరు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.+   నా ప్రియుడు వస్తున్న శబ్దం వినిపిస్తోంది! ఇదిగో! పర్వతాల్ని ఎక్కుతూ, కొండల మీద దూకుతూ అతను వస్తున్నాడు.   నా ప్రియుడు కొండజింక లాంటివాడు, పడుచు దుప్పి లాంటివాడు.+ ఇదిగో, అతను మన గోడ వెనకే ఉన్నాడు,కిటికీల గుండా, జాలీల గుండా చూస్తున్నాడు. 10  నా ప్రియుడు నాతో ఇలా అంటున్నాడు: ‘నా ప్రియసఖీ, లే,నా అందాలరాశీ, నాతో వచ్చేయి. 11  ఇదిగో! చలికాలం* అయిపోయింది. వర్షాలు ఆగిపోయాయి, ఇక రావు. 12  దేశమంతటా పూలు పూశాయి,+కొమ్మలు కత్తిరించే సమయం వచ్చింది,+మన దేశంలో గువ్వ పిల్లల పాటలు వినిపిస్తున్నాయి.+ 13  అంజూర చెట్టుకు కాసిన తొలి అంజూర పండ్లు పక్వానికి వచ్చాయి;+ద్రాక్షతీగలు పూత వేసి గుబాళిస్తున్నాయి. నా ప్రియసఖీ, లే, నా అందాలరాశీ, నాతో వచ్చేయి. 14  బండ సందుల్లో, కొండచరియ చాటైన స్థలాల్లో దాక్కునే నా పావురమా,+వచ్చి నాకు కనిపించు, నీ స్వరం వినిపించు,+నీ స్వరం మధురమైనది, నీ రూపం మనోహరమైనది.’ ”+ 15  “మన ద్రాక్షతోటలు పూత వేశాయి,కాబట్టి ద్రాక్షతోటల్ని పాడుచేసే నక్క పిల్లల్ని, గుంటనక్కల్ని పట్టుకో.” 16  “నా ప్రియుడు నాకు సొంతం, నేను అతనికి సొంతం.+ అతను లిల్లీ పూల దగ్గర గొర్రెలు కాస్తున్నాడు.+ 17  పిల్లగాలులు వీచే లోపు, నీడలు కనుమరుగయ్యే లోపు,నా ప్రియుడా, త్వరగా రా,కొండజింకలా,+ పడుచు దుప్పిలా+ మన మధ్య ఉన్న పర్వతాల్ని* దాటుకుంటూ వచ్చేయి.

అధస్సూచీలు

అక్ష., “తీర మైదానంలో.”
లేదా “కుంకుమ పువ్వు.”
లేదా “వర్షాకాలం.”
లేదా “బెతెరు పర్వతాల్ని.”