పరమగీతం 4:1-16

  • గొర్రెల కాపరి (1-5)

    • “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు” (1)

  • యువతి (6)

  • గొర్రెల కాపరి (7-16ఎ)

    • “నా పెళ్లికూతురా, నువ్వు నా మనసు దోచుకున్నావు” (9)

  • యువతి (16బి)

4  “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు! నువ్వు సౌందర్యవతివి! మేలిముసుగు వెనక నీ కళ్లు పావురం కళ్లలా ఉన్నాయి.నీ కురులు గిలాదు కొండల మీదుగా కిందికి దూకుతున్న మేకల మందలా ఉన్నాయి.+   నీ పళ్లు, అప్పుడే బొచ్చు కత్తిరించబడి, కడగబడిపైకి వస్తున్న గొర్రెల మందలా ఉన్నాయి;అవి ఒక్కటి కూడా తప్పిపోని కవల పిల్లల్లా ఉన్నాయి.   నీ పెదాలు ముదురు ఎరుపు దారంలా ఉన్నాయి,నీ మాటలు మనోహరంగా ఉన్నాయి. మేలిముసుగు వెనక నీ చెంపలు దానిమ్మ ముక్కలా మెరిసిపోతున్నాయి.   నీ మెడ,+ రాళ్ల వరుసలతో కట్టిన దావీదు గోపురంలా ఉంది,+దానిమీద వెయ్యి డాళ్లు వేలాడుతున్నాయి,అవన్నీ యోధుల డాళ్లే.*+   నీ రెండు స్తనాలు రెండు జింకపిల్లల్లా,లిల్లీ పువ్వుల మధ్య మేత మేస్తున్నకొండజింక కవల పిల్లల్లా ఉన్నాయి.”+   “పిల్లగాలులు వీచే లోపు, నీడలు కనుమరుగయ్యే లోపునేను బోళపు పర్వతం దగ్గరికి,సాంబ్రాణి కొండ+ దగ్గరికి వెళ్తాను.”   “నా ప్రియసఖీ, నువ్వు పరిపూర్ణ సౌందర్యవతివి,+నీలో ఏ లోపం లేదు.   నా వధువా, లెబానోను నుండి నాతో వచ్చేయి,లెబానోను+ నుండి నాతో వచ్చేయి. అమాన* శిఖరం నుండి,శెనీరు శిఖరం నుండి, హెర్మోను+ శిఖరం నుండి,సింహాల విశ్రాంతి స్థలాల నుండి, చిరుతపులుల పర్వతాల నుండి దిగిరా.   నా ప్రేయసీ, నా పెళ్లికూతురా, నువ్వు నా మనసు దోచుకున్నావు.+ఒకే చూపుతో, నీ హారంలోని ఒకే ఒక్క పూసతో నా మనసు దోచుకున్నావు. 10  నా ప్రేయసీ, నా పెళ్లికూతురా, నీ ప్రేమానురాగాలు ఎంత మధురమైనవి!+ అవి ద్రాక్షారసం కన్నా ఎంతో శ్రేష్ఠమైనవి,+నీ పరిమళ తైలం సువాసన సుగంధ ద్రవ్యాల సువాసన+ కన్నా ఎంతో గొప్పది! 11  నా వధువా, నీ పెదాలు తేనెలొలుకుతున్నాయి.+ నీ నాలుక కింద పాలుతేనెలు ఉన్నాయి,+నీ వస్త్రాల పరిమళం లెబానోను పరిమళంలా ఉంది. 12  నా ప్రేయసి, నా పెళ్లికూతురు చుట్టూ కంచె వేయబడిన తోటలా ఉంది,ఆమె కంచె వేసిన తోట, మూయబడిన ఊట. 13  నీ కొమ్మలు* శ్రేష్ఠమైన పండ్లు గల దానిమ్మ తోట;*అందులో గోరింట చెట్లు, జటామాంసి చెట్లు, 14  జటామాంసి,+ కుంకుమ పువ్వు, వస,*+ దాల్చిన చెక్క,+అన్నిరకాల సాంబ్రాణి చెట్లు, బోళం, అగరు మొక్కలు,+అతి శ్రేష్ఠమైన పరిమళ మొక్కలు+ ఉన్నాయి. 15  నువ్వు తోటలోని ఊట లాంటి దానివి,మంచినీటి బావి లాంటి దానివి, లెబానోను నీటి ప్రవాహాల+ లాంటి దానివి. 16  ఉత్తర గాలీ, మేలుకో;దక్షిణ గాలీ, రా. వచ్చి నా తోట మీద మృదువుగా వీచు. దాని పరిమళం అంతటా వ్యాపింపజేయి.” “నా ప్రియుడు తన తోటలోకి వచ్చి,దాని శ్రేష్ఠమైన పండ్లు తినాలి.”

అధస్సూచీలు

లేదా “గుండ్రటి డాళ్లే.”
లేదా “లెబానోను పర్వతశ్రేణికి ఎదురుగా ఉన్న పర్వతాలు.”
లేదా “చర్మం” అయ్యుంటుంది.
లేదా “పరదైసు.”
ఒక సువాసన మొక్క.