పరమగీతం 6:1-13

  • యెరూషలేము కూతుళ్లు (1)

  • యువతి (2, 3)

    • “నేను నా ప్రియుడికి సొంతం, నా ప్రియుడు నాకు సొంతం” (3)

  • రాజు (4-10)

    • “నువ్వు తిర్సా అంత అందమైనదానివి” (4)

    • స్త్రీల మాటలు (10)

  • యువతి (11, 12)

  • రాజు (అలాగే ఇతరులు) (13ఎ)

  • యువతి (13బి)

  • రాజు (అలాగే ఇతరులు) (13సి)

6  “అత్యంత సౌందర్యవతీ,నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు? పద, కలిసి వెదుకుదాం.”   “నా ప్రియుడు తన తోట దగ్గరికి,సుగంధ ద్రవ్యాల మొక్కల దగ్గరికి వెళ్లాడు;గొర్రెల్ని కాయడానికి,లిల్లీ పూలను కోయడానికి అక్కడికి వెళ్లాడు.+   నేను నా ప్రియుడికి సొంతం,నా ప్రియుడు నాకు సొంతం.+ అతను లిల్లీ పూల దగ్గర గొర్రెలు కాస్తున్నాడు.”+   “నా ప్రియసఖీ,+ నువ్వు తిర్సా*+ అంత అందమైనదానివి,యెరూషలేము అంత మనోహరమైనదానివి,+పతాకాలు ఎత్తిన సైన్యాలంత గంభీరమైనదానివి.+   నన్ను అలా చూడకు,+నీ చూపులు నన్ను కట్టిపడేస్తున్నాయి. నీ కురులు గిలాదు కొండల మీదుగా కిందికి దూకుతున్న మేకల మందలా ఉన్నాయి.+   నీ పళ్లు, కడగబడి పైకి వస్తున్న గొర్రెల మందలా ఉన్నాయి;అవి ఒక్కటి కూడా తప్పిపోని కవల పిల్లల్లా ఉన్నాయి.   మేలిముసుగు వెనక నీ చెంపలు* దానిమ్మ ముక్కలా మెరిసిపోతున్నాయి.   60 మంది రాణులు,80 మంది ఉపపత్నులు,లెక్కలేనంతమంది యువతులు ఉన్నా,+   మచ్చలేని నా పావురం ఒక్కతే.+ ఆమె తల్లికి ఆమె ఒక్కతే కూతురు. ఆమెను కన్న తల్లికి ఆమె ముద్దు బిడ్డ. యువతులు ఆమెను చూసి ధన్యురాలు* అంటారు;రాణులు, ఉపపత్నులు ఆమెను పొగుడుతారు. 10  ‘అరుణోదయంలా ప్రకాశిస్తున్న* ఈమె ఎవరు?నిండు చంద్రుడిలా అందంగా,సూర్యకాంతిలా స్వచ్ఛంగా,పతాకాలు ఎత్తిన సైన్యాల్లా గంభీరంగా ఉన్న ఈమె ఎవరు?’ ”+ 11  “లోయలోని* కొత్త మొగ్గల్ని చూడడానికి,ద్రాక్షతీగలు చిగురించాయో* లేదో,దానిమ్మ చెట్లు మొగ్గ తొడిగాయో లేదోతెలుసుకోవడానికి నేను పండ్ల చెట్ల* తోటకు+ వెళ్లాను. 12  నాకు తెలియకుండానేనా కోరిక నా ప్రముఖుల* రథాల దగ్గరికి నన్ను తీసుకొచ్చింది.” 13  “షూలమ్మీతీ, తిరిగి రా, తిరిగి రా, మేము మళ్లీ నిన్ను చూడగలిగేలాతిరిగి రా, తిరిగి రా!” “మీరు షూలమ్మీతీని ఎందుకు చూడాలనుకుంటున్నారు?”+ “ఆమె మహనయీము* నాట్యంలా ఉంది!”

అధస్సూచీలు

లేదా “ఆహ్లాదకరమైన నగరం.”
లేదా “కణతలు.”
లేదా “సంతోషవంతురాలు.”
అక్ష., “కిందికి చూస్తున్న.”
లేదా “వాగులోని.”
లేదా “పూతకొచ్చాయో.”
ఇశ్రాయేలులో జీడికాయల లాంటి కాయలు కాసే చెట్ల.
లేదా “ఇష్టపూర్వకంగా సేవచేసే నా ప్రజల.”
లేదా “రెండు గుంపుల.”