పరమగీతం 7:1-13

  • రాజు (1-9ఎ)

    • ‘ప్రియసఖీ, నువ్వెంత ఆహ్లాదకరంగా ఉన్నావు!’ (6)

  • యువతి (9బి-13)

    • “నేను నా ప్రియుడికి సొంతం, అతను నా కోసం తపిస్తున్నాడు” (10)

7  “గొప్ప వ్యక్తిత్వం ఉన్న యువతీ,పాదరక్షలు ధరించిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల ఒంపులు కళాకారుడు మలిచిన ఆభరణాల్లా ఉన్నాయి.   నీ నాభి గుండ్రటి గిన్నె. దానిలో ద్రాక్షారసం* ఎప్పుడూ తక్కువ కాకూడదు. నీ ఉదరం, లిల్లీ పూల మధ్య ఉన్న గోధుమ రాశిలా ఉంది.   నీ రెండు స్తనాలు రెండు జింకపిల్లల్లా,కొండజింక కవల పిల్లల్లా ఉన్నాయి.+   నీ మెడ+ దంతపు గోపురంలా ఉంది.+ నీ కళ్లు,+ బాత్‌-రబ్బీము ద్వారం దగ్గరున్నహెష్బోను+ మడుగుల్లా ఉన్నాయి. నీ ముక్కు, దమస్కు వైపు చూసేలెబానోను బురుజులా ఉంది.   నీ తల కర్మెలు+ పర్వతంలా,నీ కురులు+ ఊదారంగు ఉన్నిలా+ ఉన్నాయి. పొడవుగా, అందంగా ఉన్న నీ శిరోజాలు రాజును కట్టిపడేశాయి.   ప్రియసఖీ, నువ్వెంత అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నావు!నువ్వు నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం కలిగిస్తావు!   నువ్వు ఖర్జూర చెట్టులా సొగసైనదానివి,నీ స్తనాలు ఖర్జూర పండ్ల గుత్తుల్లా ఉన్నాయి.+   నేను, ‘ఖర్జూర చెట్టు ఎక్కి,గుత్తులున్న కొమ్మల్ని పట్టుకుంటాను’ అని అనుకున్నాను. నీ స్తనాలు ద్రాక్ష గుత్తుల్లా,నీ శ్వాస ఆపిల్‌ పండ్ల సువాసనలా ఉండాలి,   నీ నోరు* శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి.” “అది నా ప్రియుడి పెదాల మీదుగా ప్రవహించి,అతని గొంతులోకి మెల్లమెల్లగా దిగిపోవాలి. 10  నేను నా ప్రియుడికి సొంతం,+అతను నా కోసం తపిస్తున్నాడు. 11  ప్రియుడా, రా,మనం పొలాల దగ్గరికి వెళ్దాం;గోరింట+ చెట్ల మధ్య విశ్రాంతి తీసుకుందాం. 12  మనం ఉదయాన్నే లేచి ద్రాక్షతోటల దగ్గరికి వెళ్లి,ద్రాక్షతీగలు చిగురించాయో* లేదో,మొగ్గలు విచ్చుకున్నాయో లేదో,+దానిమ్మ చెట్లు పూతకొచ్చాయో లేదో చూద్దాం.+ నీ మీద నాకున్న ప్రేమను అక్కడ తెలియజేస్తాను.+ 13  పుత్రదాత చెట్లు+ గుబాళిస్తున్నాయి;మా గుమ్మం దగ్గర అన్నిరకాల శ్రేష్ఠమైన పండ్లు ఉన్నాయి.+ నా ప్రియుడా, అప్పుడే కోసిన పండ్లను, పాత పండ్లనుఅన్నిటినీ నీ కోసం దాచి ఉంచాను.

అధస్సూచీలు

లేదా “కలిపిన ద్రాక్షారసం.”
అక్ష., “అంగిలి.”
లేదా “పూతకొచ్చాయో.”