పరమగీతం 8:1-14

  • యువతి (1-4)

    • ‘నువ్వు నా సహోదరుడి లాంటి వాడివైతే ఎంత బాగుండు!’ (1)

  • యువతి సహోదరులు (5ఎ)

    • ‘తన ప్రియుడి మీద వాలిపోయిన ఈమె ఎవరు?’

  • యువతి (5బి-7)

    • “ప్రేమ మరణం అంత బలమైనది” (6)

  • యువతి సహోదరులు (8, 9)

    • “ఆమె ఒక ప్రాకారం అయితే, . . . ఆమె ఒక తలుపు అయితే, . . . ” (9)

  • యువతి (10-12)

    • “నేను ఒక ప్రాకారాన్ని” (10)

  • గొర్రెల కాపరి (13)

    • ‘నీ స్వరం విననివ్వు’

  • యువతి (14)

    • ‘కొండజింకలా పరుగెత్తుకుంటూ రా’

8  “నువ్వు నా తల్లి పాలు తాగిననా సహోదరుడి లాంటి వాడివైతే ఎంత బాగుండు! నువ్వు నాకు బయట కనిపించినప్పుడు, నేను నిన్ను ముద్దుపెట్టుకుంటాను,+ఎవరూ నన్ను తప్పుగా చూడరు.   నేనే స్వయంగా నిన్ను మా అమ్మ ఇంటికి,నాకు ఉపదేశం ఇచ్చిన నా తల్లి ఇంటికి తీసుకెళ్తాను,+మసాలాలు కలిపిన ద్రాక్షారసాన్ని, తాజా దానిమ్మ రసాన్ని నీకు ఇస్తాను.   అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంటుంది,తన కుడిచేతితో అతను నన్ను హత్తుకుంటాడు.+   యెరూషలేము కూతుళ్లారా, నేను మీతో ఒట్టు వేయిస్తున్నాను: ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.”+   “తన ప్రియుడి మీద వాలిపోయిఎడారి నుండి వస్తున్న ఈమె ఎవరు?” “ఆపిల్‌ చెట్టు కింద నేను నిన్ను నిద్రలేపాను. అక్కడ మీ అమ్మ నిన్ను కనడానికి ప్రసవవేదన పడింది. నిన్ను కన్న తల్లి అక్కడ పురిటినొప్పులు పడింది.   నన్ను నీ హృదయం మీద,నీ బాహువు మీద ముద్రగా పెట్టుకో,ఎందుకంటే ప్రేమ మరణం అంత బలమైనది,+అది సమాధి* అంత పట్టుదలగా నమ్మకత్వాన్ని కోరుకుంటుంది. దాని జ్వాలలు అగ్ని జ్వాలలు, అది యెహోవా* పుట్టించే జ్వాల.+   ఉప్పొంగే జలాలు ప్రేమను ఆర్పలేవు,+నదీ ప్రవాహాలు దాన్ని ముంచేయలేవు.+ ప్రేమ కోసం ఒక వ్యక్తి తన ఇంట్లోని సంపదంతా ఇచ్చినాఅది తిరస్కరించబడుతుంది.”*   “మాకొక చిట్టి చెల్లెలు+ ఉంది,ఆమెకు ఇంకా రొమ్ములు రాలేదు. ఆమెకు పెళ్లి నిశ్చయమయ్యే రోజుఆమె కోసం మేము ఏం చేయాలి?”   “ఆమె ఒక ప్రాకారం అయితే,దానిమీద మేము వెండితో పిట్టగోడ కడతాం,ఆమె ఒక తలుపు అయితే,దేవదారు పలకతో దాన్ని మూసేస్తాం.” 10  “నేను ఒక ప్రాకారాన్ని,నా రొమ్ములు బురుజుల లాంటివి. కాబట్టి, అతని దృష్టిలో నేనునెమ్మది పొందిన దానిలా ఉన్నాను. 11  బయల్‌-హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షతోట ఉండేది.+ దాన్ని అతను కౌలుకిచ్చాడు. దాని పంట కోసం వాళ్లలో ప్రతీ ఒక్కరు వెయ్యి వెండి రూకలు ఇచ్చేవాళ్లు. 12  సొలొమోనూ, నాకూ ఒక ద్రాక్షతోట ఉంది. ఆ వెయ్యి వెండి రూకలు* నీ దగ్గరే ఉంచుకో,రెండు వందల వెండి రూకలు దాన్ని సేద్యం చేసేవాళ్లకే ఉండనివ్వు.” 13  “తోటల్లో నివసించేదానా,+సహచరులు నీ స్వరం వినాలని ఎదురుచూస్తున్నారు. నన్ను కూడా విననివ్వు.”+ 14  “నా ప్రియుడా, త్వరగా రా,సుగంధ ద్రవ్యాలు పండే పర్వతాల మీదుగాకొండజింకలా, పడుచు దుప్పిలా పరుగెత్తుకుంటూ రా.”+

అధస్సూచీలు

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “అతను తిరస్కరించబడతాడు” అయ్యుంటుంది.
అక్ష., “ఆ వెయ్యి.”