యిర్మీయా 1:1-19
1 హిల్కీయా కుమారుడైన యిర్మీయా* మాటలు. హిల్కీయా బెన్యామీనుకు చెందిన అనాతోతులోని+ యాజకుల్లో ఒకడు.
2 ఆమోను+ కుమారుడూ యూదా రాజూ అయిన యోషీయా+ పరిపాలనలోని 13వ సంవత్సరంలో యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం.
3 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ రోజుల్లో కూడా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది; యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన సిద్కియా+ పరిపాలనలోని 11వ సంవత్సరం వరకు, అంటే ఐదో నెలలో యెరూషలేము ప్రజలు చెరగా వెళ్లేంత వరకు+ వాక్యం అతని దగ్గరికి వచ్చింది.
4 యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
5 “గర్భంలో నేను నిన్ను రూపొందించకముందే నువ్వు నాకు తెలుసు,*+నువ్వు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపర్చాను.*+
నేను నిన్ను దేశాలకు ప్రవక్తగా చేశాను.”
6 అయితే నేను, “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా!
నేను చిన్నవాణ్ణి,+ ఎలా మాట్లాడాలో నాకు తెలీదు”+ అన్నాను.
7 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు:
“ ‘నేను చిన్నవాణ్ణి’ అని అనొద్దు.
నేను పంపించే వాళ్లందరి దగ్గరికి నువ్వు వెళ్లాలి,నేను నీకు ఆజ్ఞాపించే ప్రతీది చెప్పాలి.+
8 వాళ్లను చూసి భయపడకు,+ఎందుకంటే, ‘నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
9 అప్పుడు యెహోవా తన చెయ్యి చాపి నా నోటిని ముట్టాడు.+ తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నేను నా మాటలు నీ నోట ఉంచాను.+
10 ఇదిగో, ఈ రోజు నేను నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమించాను. పెల్లగించడానికి, కింద పడేయడానికి; నాశనం చేయడానికి, పడగొట్టడానికి; కట్టడానికి, నాటడానికి నేను నిన్ను నియమించాను.”+
11 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి, “యిర్మీయా, నీకు ఏం కనిపిస్తోంది?” అని అడిగింది. అందుకు నేను, “బాదం చెట్టు* కొమ్మ కనిపిస్తోంది” అన్నాను.
12 యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాటను నెరవేర్చడానికి నేను మెలకువగా ఉన్నాను.”
13 యెహోవా వాక్యం రెండోసారి నా దగ్గరికి వచ్చి, “నీకు ఏం కనిపిస్తోంది?” అని అడిగింది. అందుకు నేను, “మరుగుతున్న పాత్ర* కనిపిస్తోంది, దాని మూతి ఉత్తర దిక్కుకు వ్యతిరేకంగా* వంగి ఉంది” అన్నాను.
14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు:
“ఉత్తరం వైపు నుండి విపత్తు ముంచుకొస్తుంది,అది దేశ ప్రజలందరి మీదికి వస్తుంది.+
15 ఎందుకంటే, ‘ఉత్తర రాజ్యాల కుటుంబాలన్నిటినీ నేను రప్పిస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,+‘వాళ్లు వస్తారు; వాళ్లలో ప్రతీ ఒక్కరుయెరూషలేము ప్రవేశ ద్వారాల దగ్గర,+దాని చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటి ఎదురుగా,యూదా నగరాలన్నిటి ఎదురుగా తమ సింహాసనాన్ని స్థాపిస్తారు.+
16 నా ప్రజల దుష్టత్వమంతటిని బట్టి వాళ్ల మీద నా తీర్పులు ప్రకటిస్తాను,ఎందుకంటే వాళ్లు నన్ను విడిచిపెట్టారు,+వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తున్నారు,*+తమ చేతులతో చేసిన వాటికి వంగి నమస్కారం చేస్తున్నారు.’+
17 అయితే నువ్వు నడుం కట్టుకొని,లేచి నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్లకు చెప్పాలి.
వాళ్లను చూసి భయపడకు,+లేదంటే వాళ్ల ముందు నువ్వు భయపడేలా చేస్తాను.
18 ఈ రోజు నేను నిన్ను ప్రాకారంగల నగరంలా చేశాను;దేశమంతటి ముందు,యూదా రాజుల ముందు, దాని అధిపతుల ముందు,యాజకుల ముందు, దేశ ప్రజల ముందు+
నిన్ను ఇనుప స్తంభంలా, రాగి గోడల్లా చేశాను.+
19 వాళ్లు ఖచ్చితంగా నీతో పోరాడతారు,కానీ వాళ్లు నీ మీద గెలవరు,
ఎందుకంటే, ‘నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
అధస్సూచీలు
^ బహుశా “యెహోవా హెచ్చిస్తాడు” అనే అర్థం ఉండవచ్చు.
^ లేదా “నిన్ను ఎంచుకున్నాను.”
^ లేదా “పవిత్రపర్చాను.”
^ అక్ష., “మెలకువగా ఉండేదాని.”
^ లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్ర.”
^ అంటే, దక్షిణం వైపుకు.
^ మూలభాష పదం ధూపం వేయడాన్ని కూడా సూచించవచ్చు.