యిర్మీయా 21:1-14

  • సిద్కియా విన్నపాన్ని యెహోవా తిరస్కరించడం (1-7)

  • ప్రజలు జీవాన్ని లేదా మరణాన్ని ఎంచుకోవాలి (8-14)

21  సిద్కియా+ రాజు మల్కీయా కుమారుడైన పషూరును, మయశేయా కుమారుడూ యాజకుడూ అయిన జెఫన్యాను+ యిర్మీయా దగ్గరికి పంపించినప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది; సిద్కియా వాళ్లను ఇలా అడగమని పంపించాడు:  “మా తరఫున యెహోవా దగ్గర విచారణ చేయి, ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు* మన మీద యుద్ధానికి వస్తున్నాడు.+ అతను మన దగ్గర నుండి వెళ్లిపోయేలా యెహోవా మన తరఫున ఏదైనా ఆశ్చర్యకార్యం* చేస్తాడేమో.”+  అప్పుడు యిర్మీయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు సిద్కియాతో ఇలా చెప్పాలి:  ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు బబులోను రాజుతో, ప్రాకారం బయట ముట్టడి వేస్తున్న కల్దీయులతో ఏ ఆయుధాలతో పోరాడుతున్నారో,+ మీ చేతుల్లో ఉన్న ఆ యుద్ధాయుధాల్ని మీకు వ్యతిరేకంగా తిప్పుతున్నాను. నేను వాటిని* ఈ నగరం మధ్య పోగుచేస్తాను.  చాచిన చేతితో, శక్తివంతమైన బాహువుతో, కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేనే స్వయంగా మీతో పోరాడతాను.+  మనుషులు, జంతువులతో సహా ఈ నగరవాసులందర్నీ నేను చంపుతాను. గొప్ప తెగులు వల్ల వాళ్లు చనిపోతారు.” ’+  “ ‘యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ తర్వాత నేను యూదా రాజైన సిద్కియాను, అతని సేవకుల్ని, ఈ నగర ప్రజల్ని అంటే తెగులును, ఖడ్గాన్ని, కరువును తప్పించుకున్నవాళ్లను బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తాను.+ అతను వాళ్లను ఖడ్గంతో చంపేస్తాడు. అతను వాళ్లమీద జాలిపడడు, కనికరం గానీ కరుణ గానీ చూపించడు.” ’+  “అయితే ఈ ప్రజలతో నువ్విలా చెప్పాలి: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను.  ఎవరైతే ఈ నగరంలోనే ఉండిపోతారో వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు. కానీ ఎవరైతే బయటికి వెళ్లి, మిమ్మల్ని ముట్టడిస్తున్న కల్దీయులకు లొంగిపోతారో వాళ్లు ప్రాణాలతో ఉంటారు, దోపుడుసొమ్ముగా తమ ప్రాణాన్ని దక్కించుకుంటారు.” ’*+ 10  “ ‘ “ఎందుకంటే నేను ఈ నగరాన్ని తిరస్కరించాను. మంచికి బదులు విపత్తే దానిమీదికి వస్తుంది” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది,+ అతను అగ్నితో దాన్ని కాల్చేస్తాడు.”+ 11  “ ‘యూదా రాజు ఇంటివాళ్లారా, యెహోవా మాట వినండి. 12  దావీదు ఇంటివాళ్లారా, యెహోవా ఏమంటున్నాడంటే: “ప్రతీ ఉదయం న్యాయాన్ని సమర్థించండి,మోసం చేసేవాడి చేతి నుండి దోచుకోబడుతున్నవాణ్ణి కాపాడండి,+లేకపోతే మీ చెడ్డపనుల్ని బట్టినా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది,+దాన్ని ఎవరూ ఆర్పలేరు.” ’+ 13  ‘లోయలో నివసిస్తున్నదానా,చదును నేలమీదున్న బండరాయీ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘ “మన మీదికి ఎవరు వస్తారు? మన నివాసాల్లోకి ఎవరు చొరబడతారు” అని అంటున్నవాళ్లారా, 14  మీ పనులకు తగినట్టునేను మిమ్మల్ని లెక్క అడుగుతాను.+ నేను ఆమె అడవికి నిప్పంటిస్తాను,అది ఆమె చుట్టూ ఉన్న వాటన్నిటినీ దహించేస్తుంది’ అని యెహోవా అంటున్నాడు.”+

అధస్సూచీలు

అక్ష., “నెబుకద్రెజరు.”
లేదా “అద్భుతమైన పని.”
లేదా “వాళ్లను” అయ్యుంటుంది.
అక్ష., “నెబుకద్రెజరు.”
లేదా “ప్రాణాలతో తప్పించుకుంటారు.”