యిర్మీయా 5:1-31
5 యెరూషలేము వీధుల్లో సంచరించండి.
చుట్టూ చూడండి, తెలుసుకోండి.
ఆమె సంతవీధుల్లో వెదకండి,న్యాయంగా నడుచుకునే వ్యక్తి,నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించే వ్యక్తి ఒక్కరైనా ఉన్నారేమో చూడండి.+ఉంటే, నేను ఆమెను క్షమిస్తాను.
2 వాళ్లు, “యెహోవా జీవం తోడు!” అని అంటారు,
కానీ అబద్ధ ప్రమాణాలు చేస్తారు.+
3 యెహోవా, నీ కళ్లు నమ్మకమైనవాళ్ల కోసం వెదుకుతాయి కదా?+
నువ్వు వాళ్లను శిక్షించావు, కానీ వాళ్లలో ఏ మార్పూ రాలేదు.*
నువ్వు వాళ్లను తుడిచిపెట్టేశావు, కానీ వాళ్లు క్రమశిక్షణను అంగీకరించలేదు.+
వాళ్లు తమ ముఖాల్ని బండరాయి కన్నా గట్టిగా చేసుకున్నారు,+నీ వైపు తిరగడానికి ఇష్టపడలేదు.+
4 అయితే నేను ఇలా అనుకున్నాను: “ఖచ్చితంగా వీళ్లు సామాన్యులు అయ్యుంటారు.
వీళ్లు తెలివితక్కువగానే ప్రవర్తిస్తారు,ఎందుకంటే వీళ్లకు యెహోవా మార్గం, తమ దేవుని తీర్పు తెలీదు.
5 నేను ప్రముఖుల దగ్గరికి వెళ్లి మాట్లాడతాను,ఎందుకంటే యెహోవా మార్గం, తమ దేవుని తీర్పువాళ్లకు తెలిసే ఉంటుంది.+
అయితే వాళ్లంతా తమ కాడిని విరగ్గొట్టుకున్నారు,తమ కట్లు తెంచేసుకున్నారు.”
6 అందుకే అడవిలో నుండి సింహం వచ్చి వాళ్లమీద దాడిచేస్తుంది,ఎడారి మైదానాల్లో నుండి తోడేలు వచ్చి వాళ్లను చీల్చేస్తుంది,చిరుతపులి వాళ్ల నగరాల దగ్గర పొంచి ఉంటుంది.
వాటిలో నుండి బయటికి వచ్చే వాళ్లంతా ముక్కలుముక్కలుగా చీల్చేయబడతారు.
ఎందుకంటే, వాళ్ల అపరాధాలకు లెక్కేలేదు;వాళ్లు ఎన్నోసార్లు నమ్మకద్రోహం చేశారు.+
7 ఇలా చేసినందుకు నేను నిన్ను ఎలా క్షమించగలను?
నీ కుమారులు నన్ను విడిచిపెట్టారు,వాళ్లు దేవుడుకాని వాటి తోడని ప్రమాణం చేస్తున్నారు.+
నేను వాళ్ల అవసరాల్ని తీర్చాను,కానీ వాళ్లు వ్యభిచారం చేస్తూ వచ్చారు,గుంపులుగుంపులుగా వేశ్యాగృహాలకు వెళ్లారు.
8 కామోద్రేకంతో ఉన్న గుర్రాల్లా,వాళ్లలో ప్రతీ ఒక్కరు సకిలించుకుంటూ వేరేవాళ్ల భార్య వెంట వెళ్తున్నారు.+
9 “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా?
ఇలాంటి దేశం మీద నేను పగతీర్చుకోవద్దా?” అని యెహోవా అంటున్నాడు.+
10 “ఆమె ద్రాక్షతోటల్లోకి వెళ్లి నాశనం చేయండి,అయితే పూర్తిగా తుడిచిపెట్టేయకండి.+
విస్తరిస్తున్న కొమ్మల్ని తీసేయండి,అవి యెహోవాకు చెందినవి కావు.
11 ఎందుకంటే, ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లునాకు చాలా నమ్మకద్రోహం చేశారు” అని యెహోవా అంటున్నాడు.+
12 “వాళ్లు యెహోవాను తిరస్కరించి ఇలా అంటూ ఉన్నారు:‘ఆయన ఏమీ చేయడు.*+
మన మీదికి ఏ విపత్తూ రాదు;కత్తిని గానీ కరువును గానీ మనం చూడం.’+
13 ప్రవక్తలు గాలి మాటలు మాట్లాడుతున్నారు,దేవుని వాక్యం వాళ్లలో లేదు.
వాళ్ల మాటల్లాగే వాళ్లు కూడా వ్యర్థులవ్వాలి!”
14 కాబట్టి సైన్యాలకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:
“ఈ మనుషులు ఇలా అంటున్నారు కాబట్టి,నీ నోట నా మాటల్ని అగ్నిలా చేస్తున్నాను,+ఈ ప్రజలే కలప,అది వాళ్లను దహించేస్తుంది.”+
15 “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను దూరం నుండి మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తున్నాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
“అది చాలాకాలం నుండి ఉన్న దేశం,
పురాతన దేశం.దాని భాష నీకు తెలీదు,వాళ్లు మాట్లాడేది నీకు అర్థం కాదు.+
16 వాళ్ల అంబులపొది తెరచి ఉన్న సమాధి;వాళ్లంతా యోధులు.
17 వాళ్లు నీ పంటను, రొట్టెను,
కుమారుల్ని, కూతుళ్లను,
మందల్ని, పశువుల్ని,
ద్రాక్షచెట్లను, అంజూర చెట్లను మింగేస్తారు.+
నువ్వు నమ్ముకున్న ప్రాకారాలుగల నీ నగరాల్ని కత్తితో నాశనం చేస్తారు.”
18 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “చివరికి ఆ రోజుల్లో కూడా నేను నిన్ను పూర్తిగా తుడిచిపెట్టను.+
19 వాళ్లు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇలా చేశాడు?’ అని అడిగినప్పుడు నువ్వు వాళ్లతో ఇలా చెప్పాలి: ‘మీరు నన్ను విడిచిపెట్టి మీ దేశంలో వేరే దేవుణ్ణి సేవించారు కదా. కాబట్టి మీది కాని దేశంలో మీరు విదేశీయులకు సేవలు చేస్తారు.’ ”+
20 యాకోబు ఇంటివాళ్లకు,యూదా ప్రజలకు ఇలా ప్రకటించండి:
21 “తెలివి, వివేచన* లేని ప్రజలారా,+
కళ్లు ఉండీ చూడలేని,+ చెవులు ఉండీ వినలేని ప్రజలారా,+ ఇది వినండి:
22 ‘మీరు నాకు భయపడరా?’ అని యెహోవా అంటున్నాడు,‘మీరు నా ముందు వణకవద్దా?
సముద్రానికి ఇసుకను సరిహద్దుగా,అది దాటలేని నిత్య నియమంగా పెట్టింది నేనే.
దాని అలలు పైకి ఎగసినా, అవి జయించలేవు;అవి ఘోషించినా సరే, దాన్ని దాటి వెళ్లలేవు.+
23 కానీ ఈ ప్రజల హృదయం మొండిది, ఎదురుతిరిగేది;వాళ్లు పక్కకు తొలగి తమ సొంత దారిలో వెళ్లిపోయారు.+
24 వాళ్లు, “మన దేవుడైన యెహోవాకు భయపడదాం,
సకాలంలో వర్షాన్ని కురిపించేది,తొలకరి వానను,* కడవరి వానను* ఇచ్చేది ఆయనే.మనకోసం కోతకాలపు వారాల్ని నియమించింది ఆయనే”+ అని తమ హృదయంలో అనుకోరు.
25 ఇవి రాకపోవడానికి కారణం మీ తప్పులే;మీ పాపాలే మీకు మంచి జరగకుండా చేశాయి.+
26 నా ప్రజల్లో దుష్టులు ఉన్నారు.
వేటగాడు పొంచివున్నట్టు వాళ్లు పొంచివుంటారు.
వాళ్లు ప్రాణాంతకమైన ఉచ్చు పెడతారు.
దానితో మనుషుల్ని పట్టుకుంటారు.
27 పంజరం పక్షులతో నిండివున్నట్టు,వాళ్ల ఇళ్లు మోసంతో నిండివుంటాయి.+
అందుకే వాళ్లు శక్తిమంతులు, ధనవంతులు అయ్యారు.
28 వాళ్లు కొవ్వుపట్టి నున్నగా తయారయ్యారు;వాళ్లలో దుష్టత్వం పొంగిపొర్లుతుంది.
తాము గెలవాలనే ఉద్దేశంతోవాళ్లు తండ్రిలేని పిల్లల వ్యాజ్యాన్ని వాదించరు;+పేదవాళ్లకు న్యాయం జరగనివ్వరు.’ ”+
29 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా?
ఇలాంటి దేశం మీద నేను పగతీర్చుకోవద్దా?
30 దేశంలో ఘోరమైన, భయంకరమైన ఒక విషయం జరిగింది, అదేంటంటే:
31 ప్రవక్తలు అబద్ధాల్ని ప్రవచిస్తున్నారు,+యాజకులు తమ అధికారంతో ఇతరుల్ని అణగదొక్కుతున్నారు.
అలా జరగడం నా ప్రజలకు ఇష్టం.+
అయితే అంతం వచ్చినప్పుడు మీరు ఏంచేస్తారు?”
అధస్సూచీలు
^ అక్ష., “వాళ్లు బలహీనపడలేదు.”
^ లేదా “ఆయన ఉనికిలోనే లేడు” అయ్యుంటుంది.
^ అక్ష., “హృదయం.”
^ తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
^ కడవరి వానలు దాదాపు ఏప్రిల్ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.