యెషయా 11:1-16
11 యెష్షయి+ మొద్దు నుండి చిగురు+ వస్తుంది,అతని వేర్ల నుండి వచ్చిన ఒక మొలక+ ఫలిస్తుంది.
2 యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది,+అది ఆయనకు తెలివిని,+ అవగాహనను ఇస్తుంది,ఆ పవిత్రశక్తి వల్ల ఆయన మంచి సలహా ఇస్తాడు, బలవంతుడిగా ఉంటాడు,+ఆ పవిత్రశక్తి వల్ల ఆయనకు చాలా జ్ఞానం, యెహోవా పట్ల భయభక్తులు* ఉంటాయి.
3 యెహోవా పట్ల భయభక్తులు* కలిగివుండడం అంటే ఆయనకు ఇష్టం.+
ఆయన కంటికి కనిపించేదాన్ని బట్టి తీర్పుతీర్చడు,కేవలం చెవులతో విన్నదాన్ని బట్టి గద్దింపు ఇవ్వడు.+
4 ఆయన పక్షపాతం లేకుండా* దీనులకు తీర్పుతీరుస్తాడు,భూమ్మీదున్న సాత్వికుల తరఫున న్యాయంగా గద్దింపు ఇస్తాడు.
తన నోటి నుండి వచ్చే కర్రతో భూమిని కొడతాడు+తన పెదాల ఊపిరితో* దుష్టుల్ని చంపేస్తాడు.+
5 నీతి ఆయనకు నడికట్టులా ఉంటుంది,నమ్మకత్వం ఆయన తుంట్ల మీద దట్టీలా ఉంటుంది.+
6 తోడేలు గొర్రెపిల్లతో పాటు నివసిస్తుంది,*+చిరుతపులి మేకపిల్లతో పాటు పడుకుంటుంది,దూడ, సింహం, కొవ్విన జంతువు అన్నీ ఒకే చోట ఉంటాయి;*+చిన్న పిల్లవాడు వాటిని తోలుతాడు.
7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి,వాటి పిల్లలు కలిసి పడుకుంటాయి.
ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.+
8 పాలు తాగే పసిపిల్ల నాగుపాము పుట్టమీద ఆడుకుంటుంది,పాలు విడిచిన పిల్లవాడు విషసర్పం పుట్టమీద చెయ్యి పెడతాడు.
9 నా పవిత్ర పర్వతమంతటి మీదఅవి హాని గానీ నాశనం గానీ చేయవు,+ఎందుకంటే సముద్రం నీళ్లతో నిండివున్నట్టుభూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.+
10 ఆ రోజు యెష్షయి వేరు+ జనాల కోసం ధ్వజంలా* నిలబడతాడు.+
దేశాలు నిర్దేశం కోసం ఆయన వైపు చూస్తాయి,*+ఆయన విశ్రాంతి స్థలం మహిమతో నిండిపోతుంది.
11 ఆ రోజు యెహోవా తన ప్రజల్లో మిగిలినవాళ్లను అష్షూరు నుండి, ఐగుప్తు నుండి,+ పత్రోసు నుండి,+ కూషు నుండి,+ ఏలాము నుండి,+ షీనారు* నుండి, హమాతు నుండి, సముద్ర ద్వీపాల నుండి+ సమకూర్చడానికి రెండోసారి తన చెయ్యి అందిస్తాడు.
12 ఆయన దేశాల కోసం ఒక ధ్వజాన్ని* నిలబెట్టి చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని సమకూరుస్తాడు,+ అలాగే చెదిరిపోయిన యూదా ప్రజల్ని భూమి నలుమూలల నుండి సమకూరుస్తాడు.+
13 ఎఫ్రాయిము అసూయ మాయమైపోతుంది,+యూదా పట్ల శత్రుభావం చూపించినవాళ్లు లేకుండా పోతారు.
ఎఫ్రాయిము యూదా మీద అసూయపడదు,యూదాకు ఎఫ్రాయిము పట్ల శత్రుభావం ఉండదు.+
14 వాళ్లు పడమటి దిక్కున ఉన్న ఫిలిష్తీయుల ఏటవాలు ప్రాంతాల* మీదికి అకస్మాత్తుగా ఎగురుకుంటూ వెళ్తారు;వాళ్లిద్దరూ కలిసి తూర్పున ఉన్న ప్రజల్ని కొల్లగొడతారు.
వాళ్లు ఎదోము+ మీద, మోయాబు+ మీద తమ చెయ్యి చాపుతారు,*అమ్మోనీయులు వాళ్లకు లొంగిపోతారు.+
15 యెహోవా ఐగుప్తు సముద్ర సింధుశాఖను* విభజిస్తాడు*+నది*+ మీద తన చేతిని ఆడిస్తాడు.
తన ఊపిరి* సెగతో దాని ఏడు కాలువల్ని కొడతాడు,*ప్రజలు చెప్పులతోనే దాన్ని దాటేలా చేస్తాడు.
16 ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజున ఉన్నట్టేఆయన ప్రజల్లో మిగిలిన వాళ్లు అష్షూరు నుండి బయటికి రావడానికి+ ఒక రాజమార్గం ఉంటుంది.+
అధస్సూచీలు
^ లేదా “భయం.”
^ లేదా “భయం.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “నీతితో.”
^ లేదా “కాసేపు నివసిస్తుంది.”
^ లేదా “దూడ, సింహం కలిసి మేస్తాయి” అయ్యుంటుంది.
^ లేదా “దేశాలు ఆయన కోసం వెతుకుతాయి.”
^ లేదా “ధ్వజస్తంభంలా.”
^ అంటే, బాబిలోనియా.
^ లేదా “ధ్వజస్తంభాన్ని.”
^ లేదా “అధికారాన్ని విస్తరించుకుంటారు.”
^ అక్ష., “భుజం.”
^ అక్ష., “నాలుకను.”
^ లేదా “ఆరిపోజేస్తాడు” అయ్యుంటుంది.
^ అంటే, యూఫ్రటీసు.
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “ఏడు కాలువలుగా విభజిస్తాడు” అయ్యుంటుంది.