యెషయా 27:1-13
27 ఆ రోజు యెహోవా కఠినమైన, గొప్పదైన, బలమైన తన ఖడ్గంతో+లివ్యాతన్* అనే పాకే సర్పం మీదికి,వంకర సర్పమైన లివ్యాతన్ మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు.సముద్రంలోని ఆ భారీ ప్రాణిని ఆయన చంపేస్తాడు.
2 ప్రజలారా, ఆ రోజు ఆమె* మీద ఈ పాట పాడండి:
“పులిసిన ద్రాక్షారసం ఉన్న ద్రాక్షతోట!+
3 యెహోవా అనే నేను దాన్ని కాపాడుతున్నాను.+
ప్రతీక్షణం దానికి నీళ్లు పెడుతున్నాను.+
ఎవరూ దానికి హాని చేయకుండారాత్రింబగళ్లు దాన్ని సంరక్షిస్తున్నాను.+
4 నాకు ఏ కోపం లేదు.+
ముళ్లపొదలతో, పిచ్చి మొక్కలతో ఎవరు నామీదికి యుద్ధానికి వస్తారు?
నేను వాటిని తొక్కేస్తాను, అన్నిటికీ కలిపి నిప్పంటిస్తాను.
5 కాబట్టి, అతను నా బలమైన దుర్గాన్ని గట్టిగా పట్టుకోవాలి.
అతను నాతో సమాధానపడాలి;నాతో శాంతి కుదుర్చుకోవాలి.”
6 రాబోయే రోజుల్లో యాకోబు వేళ్లూనుకుంటాడు,ఇశ్రాయేలు చిగిర్చి పూతపూస్తాడు,+వాళ్లు దేశాన్ని పంటతో నింపుతారు.+
7 అతన్ని కొట్టే వ్యక్తి కొట్టినట్టుగా అతన్ని కొట్టాలా?
అతని ప్రజలు వధించబడి హతులైనట్టుగా అతన్ని చంపాలా?
8 ఆమెను పంపించేసేటప్పుడు నువ్వు గట్టిగా అరిచి ఆమెతో పోరాడతావు.
తూర్పు గాలి వీచే రోజున ఆయన తీవ్రమైన కోపంతో ఆమెను వెళ్లగొడతాడు.+
9 యాకోబు దోషానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం జరుగుతుంది,+అతని పాపం తీసేయబడినప్పుడు అతనికి దక్కే పూర్తి ప్రతిఫలం ఇదే:
ఆయన, బలిపీఠం రాళ్లన్నిటినీనలగ్గొట్టిన సున్నపురాళ్లలా చేస్తాడు,పూజా కర్రలు,* ధూపస్తంభాలు ఏవీ మిగలవు.
10 ఎందుకంటే, బలమైన ప్రాకారాలుగల నగరం నిర్జనమైపోతుంది;పచ్చికబయళ్లు ఎడారిలా వదిలేయబడతాయి, విడిచిపెట్టబడతాయి.+
అక్కడే దూడ మేత మేసి పడుకుంటుంది,దాని కొమ్మల్ని తినేస్తుంది.+
11 దాని చిగుర్లు ఎండిపోయినప్పుడుస్త్రీలు వచ్చి వాటిని విరిచేసి,వాటితో నిప్పు అంటిస్తారు.
ఎందుకంటే ఈ ప్రజలకు అవగాహన లేదు.+
అందుకే వాళ్ల సృష్టికర్త వాళ్లమీద కరుణ చూపించడు,వాళ్లను రూపొందించిన దేవుడు వాళ్లమీద అనుగ్రహం చూపించడు.+
12 ఇశ్రాయేలు ప్రజలారా, ఆ రోజు యెహోవా, ప్రవహించే నదీ* కాలువ నుండి ఐగుప్తు వాగు*+ వరకు ఉన్న పండ్లను రాలగొడతాడు, ఒక్కో పండును ఏరి సమకూర్చినట్టు మిమ్మల్ని సమకూరుస్తాడు.+
13 ఆ రోజు గొప్ప బూర* ఊదబడుతుంది;+ అష్షూరు దేశంలో నశించిపోతున్నవాళ్లు,+ ఐగుప్తు దేశంలో చెదిరిపోయినవాళ్లు+ యెరూషలేములోని పవిత్ర పర్వతం దగ్గరికి వచ్చి యెహోవాకు వంగి నమస్కారం చేస్తారు.+
అధస్సూచీలు
^ ఇశ్రాయేలును సూచిస్తుందని తెలుస్తోంది. అది ఇక్కడ ఒక స్త్రీగా, ద్రాక్షతోటగా వర్ణించబడింది.
^ అంటే, యూఫ్రటీసు.
^ అక్ష., “కొమ్ము.”