యెహెజ్కేలు 44:1-31

  • తూర్పు ద్వారం మూయబడే ఉండాలి (1-3)

  • పరదేశుల కోసం నియమాలు (4-9)

  • లేవీయులకు, యాజకులకు నియమాలు (10-31)

44  అతను నన్ను తూర్పు వైపున్న పవిత్రమైన స్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు,+ ఆ ద్వారం మూయబడివుంది.+  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఈ ద్వారం మూయబడే ఉంటుంది. ఇది తెరవబడదు, ఏ మనిషీ దీని గుండా ప్రవేశించడు; ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దాని గుండా ప్రవేశించాడు.+ కాబట్టి అది మూయబడే ఉండాలి.  అయితే ప్రధానుడు యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి అందులో కూర్చుంటాడు,+ ఎందుకంటే అతను ప్రధానుడు. అతను ద్వారం వసారా గుండా లోపలికి వస్తాడు, దాని గుండా బయటికి వెళ్తాడు.”+  తర్వాత అతను ఉత్తర ద్వారం గుండా నన్ను ఆలయం ముందు భాగంలోకి తీసుకొచ్చాడు. నేను చూసినప్పుడు, యెహోవా ఆలయం యెహోవా మహిమతో నిండివుండడం కనిపించింది.+ దాంతో నేను నేలమీద సాష్టాంగపడ్డాను.+  అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, మనసుపెట్టి గమనించు; యెహోవా ఆలయానికి సంబంధించిన శాసనాలు, నియమాల గురించి నేను నీకు చెప్పబోయే ప్రతీది జాగ్రత్తగా విను. ఆలయ ప్రవేశ ద్వారాన్ని, పవిత్రమైన స్థలం నుండి బయటికి వెళ్లే దారులన్నిటినీ జాగ్రత్తగా గమనించు.+  నువ్వు తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఇప్పటివరకు మీరు చేసిన అసహ్యమైన పనులు చాలు.  మీరు హృదయంలోనూ శరీరంలోనూ సున్నతిలేని పరదేశుల్ని నా పవిత్రమైన స్థలంలోకి తీసుకొచ్చినప్పుడు, వాళ్లు నా ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఒకవైపు మీరు మీ హేయమైన పనులన్నిటితో నా ఒప్పందాన్ని భంగపరుస్తూ మరోవైపు నాకు రొట్టెను, కొవ్వును, రక్తాన్ని అర్పిస్తున్నారు.  మీరు నా పవిత్రమైన వాటిని చూసుకోలేదు.+ బదులుగా నా పవిత్రమైన స్థలంలోని బాధ్యతల్ని నిర్వహించడానికి మీరు వేరేవాళ్లను నియమిస్తున్నారు.” ’  “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “హృదయంలోనూ శరీరంలోనూ సున్నతిలేని, ఇశ్రాయేలులో నివసించే ఏ పరదేశీ నా పవిత్రమైన స్థలంలోకి రాకూడదు.” ’ 10  “ ‘తమ అసహ్యమైన విగ్రహాల్ని* అనుసరించడానికి ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టినప్పుడు నాకు దూరంగా వెళ్లిపోయిన లేవీయులు+ తమ దోషశిక్షను భరిస్తారు. 11  వాళ్లు నా పవిత్రమైన స్థలంలో పరిచారకులుగా ఉంటూ, ఆలయ ద్వారాల్ని పర్యవేక్షిస్తారు,+ ఆలయం దగ్గర పరిచారం చేస్తారు. వాళ్లు ప్రజల కోసం సంపూర్ణ దహనబలి జంతువుల్ని, బలి జంతువుల్ని వధిస్తారు, ప్రజల ముందు నిలబడి వాళ్లకు పరిచారం చేస్తారు. 12  వాళ్లు ఇశ్రాయేలు ఇంటివాళ్ల అసహ్యమైన విగ్రహాల ఎదుట నిలబడి వాళ్లకు పరిచారం చేశారు, అలా వాళ్లు తడబడి పాపం చేసేందుకు కారణమయ్యారు+ కాబట్టి నేను వాళ్లకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాను, వాళ్లు ఖచ్చితంగా తమ దోషశిక్షను భరిస్తారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 13  ‘వాళ్లు నాకు యాజకులుగా సేవ చేయడానికి నన్ను సమీపించరు; నా పవిత్రమైన వాటి దగ్గరికి గానీ, అతి పవిత్రమైన వాటి దగ్గరికి గానీ రారు. తాము చేసిన అసహ్యమైన పనుల్ని బట్టి వాళ్లు అవమానం పొందుతారు. 14  కానీ నేను వాళ్లను ఆలయ బాధ్యతల్ని చూసుకునేవాళ్లుగా నియమిస్తాను; వాళ్లు ఆలయ సేవల్ని, అందులో జరగాల్సిన పనులన్నిటినీ చూసుకుంటారు.’+ 15  “ ‘ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టినప్పుడు, నా పవిత్రమైన స్థలంలోని బాధ్యతల్ని చూసుకున్న సాదోకు వంశస్థులైన లేవి యాజకులు+ నాకు పరిచారం చేయడానికి నన్ను సమీపిస్తారు, వాళ్లు నాకు కొవ్వును,+ రక్తాన్ని అర్పించడానికి నా ముందు నిలబడతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 16  ‘వాళ్లే నా పవిత్రమైన స్థలంలోకి ప్రవేశిస్తారు, నా బల్ల దగ్గరికి వచ్చి నాకు పరిచారం చేస్తారు;+ నా విషయంలో తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు.+ 17  “ ‘వాళ్లు లోపలి ప్రాంగణం ద్వారాల్లోకి ప్రవేశించేటప్పుడు నారవస్త్రాలు వేసుకోవాలి.+ వాళ్లు లోపలి ప్రాంగణం ద్వారాల్లో గానీ, దాని లోపల గానీ పరిచారం చేసేటప్పుడు ఎలాంటి ఉన్ని వస్త్రాలు వేసుకోకూడదు. 18  తమ తలలకు నార తలపాగాలు పెట్టుకోవాలి, పొడవైన నార లాగులు వేసుకోవాలి.+ చెమట పుట్టించేదేదీ వాళ్లు వేసుకోకూడదు. 19  వాళ్లు బయటి ప్రాంగణంలోకి, అంటే ప్రజలు ఉండే బయటి ప్రాంగణంలోకి వెళ్లేముందు, తాము పరిచారం చేస్తున్నప్పుడు వేసుకున్న బట్టల్ని తీసేసి,+ వాటిని పవిత్ర భోజనాల గదుల్లో పెట్టాలి.+ వాళ్లు తమ బట్టలతో ప్రజల్ని పవిత్రుల్ని చేయకుండా ఉండడం కోసం వేరే బట్టలు వేసుకోవాలి. 20  వాళ్లు తమ తలల్ని బోడి చేసుకోకూడదు,+ లేదా తలవెంట్రుకల్ని పొడుగ్గా పెరగనివ్వకూడదు, వాళ్లు తమ తలవెంట్రుకల్ని కత్తిరించుకోవాలి. 21  యాజకులు లోపలి ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు ద్రాక్షారసం తాగకూడదు.+ 22  వాళ్లు విధవరాలిని గానీ విడాకులైన స్త్రీని గానీ పెళ్లి చేసుకోకూడదు; అయితే ఇశ్రాయేలు సంతతికి చెందిన కన్యను గానీ, చనిపోయిన ఒక యాజకుడి భార్యను గానీ పెళ్లి చేసుకోవచ్చు.’+ 23  “ ‘వాళ్లు పవిత్రమైన దానికీ, సాధారణమైన దానికీ ఉన్న తేడా నా ప్రజలకు నేర్పించాలి; అశుద్ధమైన దానికీ, శుద్ధమైన దానికీ మధ్య తేడా వాళ్లకు బోధించాలి.+ 24  వాళ్లు న్యాయమూర్తులుగా ఉంటూ వ్యాజ్యాల్ని పరిష్కరించాలి;+ నా న్యాయనిర్ణయాల ప్రకారం తీర్పు తీర్చాలి.+ నా పండుగలన్నిటికీ సంబంధించిన నా నియమాల్ని, శాసనాల్ని పాటించాలి; నా విశ్రాంతి రోజుల్ని పవిత్రపర్చాలి. 25  వాళ్లు అపవిత్రులు కాకుండా ఉండేలా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లకూడదు. అయితే తమ తండ్రి గానీ, తల్లి గానీ, కుమారుడు గానీ, కూతురు గానీ, సహోదరుడు గానీ, పెళ్లికాని సహోదరి గానీ చనిపోతే వాళ్లకోసం తమను తాము అపవిత్రపర్చుకోవచ్చు. 26  ఒక యాజకుడు శుద్ధుడైన తర్వాత, అతను మళ్లీ పరిచారం చేయాలంటే ఏడురోజులు ఆగాలి. 27  అతను పవిత్ర స్థలంలో సేవ చేయడానికి, పవిత్ర స్థలంలోకి, లోపలి ప్రాంగణంలోకి ప్రవేశించే రోజున అతను తన పాపపరిహారార్థ బలిని అర్పించాలి’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 28  “ ‘వాళ్ల స్వాస్థ్యం ఇదే: నేనే వాళ్ల స్వాస్థ్యం.+ నువ్వు ఇశ్రాయేలులో వాళ్లకు ఏ ఆస్తీ ఇవ్వకూడదు, ఎందుకంటే నేనే వాళ్ల ఆస్తి. 29  వాళ్లు ధాన్యార్పణల్ని, పాపపరిహారార్థ బలుల్ని, అపరాధ పరిహారార్థ బలుల్ని తింటారు;+ ఇశ్రాయేలులో సమర్పించబడిన ప్రతీది వాళ్లదే అవుతుంది.+ 30  మీ మొదటి పంటలో, మీరు ఇచ్చే ప్రతీ విధమైన కానుకల్లో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి.+ మీ దంచిన ధాన్యంలో ప్రథమఫలాల్ని మీరు యాజకుడికి ఇవ్వాలి.+ దానివల్ల మీ ఇంటివాళ్లందరికీ దీవెన వస్తుంది.+ 31  చనిపోయిన లేదా చీల్చబడిన పక్షిని గానీ జంతువును గానీ యాజకులు తినకూడదు.’+

అధస్సూచీలు

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.