యెహోషువ 16:1-10

  • యోసేపు వంశస్థులకు వచ్చిన భూమి (1-4)

  • ఎఫ్రాయిము గోత్రానికి వచ్చిన భూమి (5-10)

16  చీట్లు వేసినప్పుడు+ యోసేపు వంశస్థులకు+ వచ్చిన ప్రాంతం ఏదంటే, యెరికో దగ్గర ఉన్న యొర్దాను నుండి యెరికో తూర్పు వైపు ఉన్న నీళ్ల వరకు, యెరికో ఎదురుగా ఉన్న ఎడారి నుండి బేతేలు పర్వత ప్రాంతం వరకు.+  అది లూజు దగ్గర ఉన్న బేతేలు నుండి అర్కీయుల సరిహద్దు అయిన అతారోతు వరకు కొనసాగింది,  తర్వాత అది కిందికి పడమటి వైపు యప్లేతీయుల సరిహద్దు వరకు, అక్కడి నుండి దిగువ బేత్‌-హోరోను+ సరిహద్దు వరకు, గెజెరు+ వరకు కొనసాగి సముద్రం దగ్గర ఆగిపోయింది.  అలా యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిము గోత్రాలవాళ్లు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారు.+  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం ఎఫ్రాయిము వంశస్థుల సరిహద్దు ఇది: తూర్పు వైపు వాళ్ల సరిహద్దు అతారోతు-అద్దారు నుండి ఎగువ బేత్‌-హోరోను+ వరకు సాగి,  సముద్రం వరకు విస్తరించింది. ఆ సరిహద్దు ఉత్తరాన ఉన్న మిక్మెతాతు+ నుండి తూర్పు వైపుగా తానాత్షీలో వరకు చుట్టూ తిరిగి, తూర్పున యానోహా వైపు కొనసాగింది.  ఆ తర్వాత యానోహా నుండి కిందికి అతారోతు, నయరా మీదుగా యెరికో+ వరకు వెళ్లి, యొర్దాను దాకా విస్తరించింది.  తప్పూయ+ నుండి ఆ సరిహద్దు పడమటి వైపు కానా వాగు దాకా సాగి సముద్రం+ దగ్గర ఆగిపోయింది. వాళ్లవాళ్ల కుటుంబాల్ని బట్టి ఎఫ్రాయిము గోత్రానికి వారసత్వంగా వచ్చిన భూమి ఇది.  మనష్షేకు వారసత్వంగా వచ్చిన ప్రాంతాల్లో కూడా ఎఫ్రాయిము వంశస్థులకు కొన్ని నగరాలు, వాటి పల్లెలు ఉన్నాయి. 10  కానీ వాళ్లు గెజెరులో నివసిస్తున్న కనానీయుల్ని వెళ్లగొట్టలేదు. కనానీయులు ఈ రోజు వరకు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తున్నారు.+ వాళ్ల చేత ఎఫ్రాయిమీయులు వెట్టిచాకిరి చేయించుకున్నారు.

అధస్సూచీలు