యోనా 2:1-10
2 అప్పుడు యోనా చేప కడుపులో నుండి తన దేవుడైన యెహోవాకు ప్రార్థించాడు.+
2 అతను ఇలా ప్రార్థించాడు:
“నేను బాధలో ఉండగా యెహోవాను వేడుకున్నాను, ఆయన నాకు జవాబిచ్చాడు.+
సహాయం కోసం నేను సమాధి* గర్భంలో* నుండి మొరపెట్టాను.+
నువ్వు నా స్వరం విన్నావు.
3 నువ్వు నన్ను అగాధంలోకి, సముద్రగర్భంలోకి విసిరేసినప్పుడుప్రవాహాలు నన్ను చుట్టుముట్టాయి.+
నీ తరంగాలన్నీ, అలలన్నీ నన్ను ముంచెత్తాయి.+
4 ‘నీ కళ్లముందు నుండి నేను వెలివేయబడ్డానే!
మళ్లీ నీ పవిత్ర ఆలయాన్ని చూసేదెలా?’ అని నేను అనుకున్నాను.
5 నా ప్రాణం పోయేంతగా నీళ్లు నన్ను చుట్టుముట్టాయి;+అగాధ జలాలు నన్ను కప్పేశాయి.
సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది.
6 పర్వతాల పునాదుల వరకు నేను మునిగిపోయాను.
భూమి శాశ్వతంగా నా మీద తలుపులు మూసేసింది.
అయితే యెహోవా, నా దేవా, సమాధిలో* నుండి నువ్వు నన్ను సజీవుడిగా పైకి తెచ్చావు.+
7 నా ప్రాణం పోతుండగా నేను యెహోవాను గుర్తుచేసుకున్నాను.+
అప్పుడు నా ప్రార్థన నీ దగ్గరికి, నీ పవిత్ర ఆలయంలోకి చేరింది.+
8 వ్యర్థమైన విగ్రహాల్ని పూజించేవాళ్లు తమ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తున్న వ్యక్తిని విడిచిపెడతారు.*
9 కానీ నేను మాత్రం నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, నీకు బలి అర్పిస్తాను.
నేను ఏమి మొక్కుకున్నానో అది తీరుస్తాను.+
రక్షణ యెహోవా నుండే వస్తుంది.”+
10 అంతలో యెహోవా ఆ చేపకు ఆజ్ఞ ఇవ్వడంతో అది యోనాను ఒడ్డు మీద కక్కేసింది.
అధస్సూచీలు
^ లేదా “లోతుల్లో.”
^ అక్ష., “గోతిలో.”
^ లేదా “తమ విశ్వసనీయతను విడిచిపెడతారు” అయ్యుంటుంది.