యోబు 28:1-28
28 “వెండికి గని ఉంది,
బంగారాన్ని శుద్ధి చేసే స్థలం ఉంది;+
2 ఇనుమును నేల నుండి తీస్తారు,రాళ్లను కరిగించి రాగిని తీస్తారు.+
3 మనిషి చీకటిని జయిస్తాడు;కటిక చీకటిని చీల్చుకుంటూ వెళ్లిముడి ఖనిజం* కోసం వెతుకుతాడు.
4 అతను ప్రజలు నివసించే స్థలానికి దూరంగా,ప్రజలు తిరిగే చోటికి దూరంగా,మరవబడిన స్థలాల్లో సొరంగం తవ్వుతాడు;
కొందరు తాళ్లతో కిందికి దిగి, వేలాడుతూ పనిచేస్తారు.
5 నేల పైన ఆహారం పండుతుంది;కానీ నేల కింద అగ్నితో కాల్చినట్టు చిందరవందరగా ఉంటుంది.*
6 అక్కడి బండల్లో నీలం రాయి,అక్కడి మట్టిలో బంగారం ఉంటాయి.
7 వేటాడే ఏ పక్షికీ అక్కడికి దారి తెలీదు;నల్ల గద్ద కన్ను దాన్ని చూడలేదు.
8 ఠీవిగా నడిచే జంతువులేవీ దానిమీద తిరగలేవు;కొదమ సింహం అక్కడ నడవలేదు.
9 మనిషి తన చేతితో చెకుముకిరాయిని పగలగొడతాడు;పర్వతాల్ని నేలమట్టం చేస్తాడు.
10 అతను బండల్లో గుండా కాలువలు తవ్వుతాడు;+అతని కళ్లు విలువైన ప్రతీ దాన్ని గుర్తిస్తాయి.
11 అతను నదిలోకి నీళ్లొచ్చే దారుల్ని మూసేస్తాడు,దాగివున్న వాటిని వెలుగులోకి తెస్తాడు.
12 అయితే తెలివి ఎక్కడ దొరుకుతుంది?+అవగాహనకు మూలం ఏమిటి?+
13 మనిషికి దాని విలువ తెలీదు,+సజీవుల దేశంలో అది దొరకదు.
14 అగాధ జలాలు, ‘అది నాలో లేదు!’ అంటాయి,సముద్రం, ‘అది నా దగ్గర లేదు!’ అంటుంది.+
15 స్వచ్ఛమైన బంగారంతో దాన్ని కొనలేం;వెండిని తూచి ఇచ్చి దాన్ని పొందలేం.+
16 ఓఫీరు బంగారంతో+ గానీ,అరుదైన సులిమాని రాళ్లతో గానీ, నీలం రాళ్లతో గానీ దాన్ని కొనలేం.
17 బంగారం, గాజు దానికి సాటిరావు;మేలిమి* బంగారు పాత్రను ఇచ్చి దాన్ని పొందలేం.+
18 పగడం, స్ఫటికం దాని దరిదాపుల్లోకి కూడా రావు,+ముత్యాలతో నిండిన సంచి కన్నా తెలివి విలువైనది.
19 కూషు దేశపు పుష్యరాగంతో+ దాన్ని పోల్చలేం;చివరికి స్వచ్ఛమైన బంగారంతో కూడా దాన్ని కొనలేం.
20 మరైతే తెలివి ఎక్కడి నుండి వస్తుంది?అవగాహనకు మూలం ఎక్కడ?+
21 అది ప్రతీ ప్రాణి కంటి నుండి, ఆకాశపక్షుల నుండి దాచబడింది.+
22 నాశనం, మరణం ఇలా అంటాయి:‘మా చెవులు దాని గురించిన నివేదిక మాత్రమే విన్నాయి.’
23 దాన్ని కనుగొనే మార్గం దేవునికే అర్థమౌతుంది;అది ఎక్కడ ఉంటుందో ఆయనకు మాత్రమే తెలుసు.+
24 ఎందుకంటే, ఆయన భూమి అంచుల వరకు చూస్తాడు,ఆకాశం కింద ఉన్న ప్రతీదాన్ని గమనిస్తాడు.+
25 ఆయన గాలికి శక్తిని* నియమించినప్పుడు,+జలాల కొలతను నిర్ణయించినప్పుడు,+
26 వర్షానికి నియమాలు పెట్టినప్పుడు,+ఉరిమే మేఘాలకు దారి ఏర్పాటు చేసినప్పుడు,+
27 ఆయన తెలివిని చూశాడు, దాన్ని వివరించాడు;ఆయన దాన్ని స్థాపించాడు, పరీక్షించాడు.
28 ఆయన మనిషితో ఇలా అన్నాడు:
‘యెహోవాకు భయపడడమే తెలివి,+చెడుకు దూరంగా ఉండడమే అవగాహన.’ ”+
అధస్సూచీలు
^ అక్ష., “రాయి.”
^ గనుల తవ్వకాల్ని సూచిస్తుందని తెలుస్తోంది.
^ లేదా “శుద్ధి చేయబడిన.”
^ అక్ష., “బరువును.”